భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.లక్ష్మీధరమూర్తి, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:మీరు జ్యోతిష్యానికి సంబంధించిన భవిష్యకాలంలో వైద్య సంబంధమైన అనారోగ్యాలు కూడా చెపుతున్నారు. నా విషయంలో మీ మాట అక్షరాలా నిజమైంది. డాక్టర్ పరీక్షలో మీరు చెప్పినదే వచ్చింది. ఇది ఎలా సాధ్యం?
సమాధానం:జ్యోతిషం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వైద్య జ్యోతిషం అని కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం ఉంది.
కె.రాజవర్థన్, కొడంగల్ (తెలంగాణ)
ప్ర:గత వారం నా ప్రశ్నకు సమాధానమిచ్చారు. ధన్యవాదాలు. నైరుతి దిశ మీకు యోగరకం అన్నారు. దయచేసి వివరించండి.
సమా:యోగకారం- ఆ దిశలో మీకు కలిసి వస్తుందని అర్థం. ప్రతి వ్యక్తికీ వారి వారి జన్మ జాతకాల ప్రకారం దిశలు కలిసి వస్తాయి. ఆ విధంగా మీకు నైఋతి యోగం.
ఎమ్.వెంకటశేషయ్య, నెల్లూరు, ఆంధ్ర
ప్ర:పొలానికి సంబంధించిన కోర్టు వ్యవహారం-
సమా:మీ ప్రశ్నలో పరిశీలిస్తే కాగితాల సంబంధం కాని రాతపోతలకు సంబంధించి కాని తిరకాసు ఉన్నట్టు సూచిస్తోంది. ఫలితం సందేహమే.
పి.శివరామకృష్ణప్రసాద్, మంగళగిరి, ఆంధ్ర
ప్ర:ఆర్థిక, సామాజిక రంగంలో బాధలు పడుతున్నాను- ఈ సంవత్సరం తొలగుతాయా?
సమా:సంతాన సంబంధమైన విషయంలో మాత్రం 2017 మీకు కొంత శుభాన్ని కలిగిస్తుంది.
బుగ్గవరపు హేమలత, గుంటూరు (ఆంధ్ర)
ప్ర:ఆరోగ్య సమస్య
సమా:ఉదర సంబంధం- లివర్ సంబంధంగా సమస్యలు ఉన్నట్టు సూచిస్తోంది. 2017 ఫిబ్రవరి తరువాత మీకు మంచి వైద్యుడు కాని వైద్యురాలు కాని తటస్థించి మేలు జరుగుతుంది.
వై.వెంకటరమణమ్మ, కైకలూరు (కృష్ణా)
ప్ర:నా స్థలంలో షాపు నిర్మాణం
సమా:నిర్మాణం ఆలస్యం - నిర్మాణ సమయంలో వ్యక్తుల మూలకంగా కాని, ప్రభుత్వ అనుమతి మూలకంగా కాని అభ్యంతరాలు వచ్చే అవకాశం వుంది.
పెద్ది రమేష్, కొత్తపల్లి, కరీంనగర్
ప్ర: ఇల్లు రిజిస్ట్రేషన్‌కు ముహూర్తం-
సమా:స్థానిక పురోహితుని అడవలసిన ప్రశ్న
టి.జె.ప్రకృతి, మద్దిగుబ్బ, ఆంధ్ర
ప్ర:ఐ.ఎ.ఎస్ కాగలనా?
సమా:తప్పకుండా కాగలరు. గట్టిగా ప్రయత్నించండి.
నవీన్‌కుమార్, ఏలూరు, (ఆంధ్ర)
ప్ర:ద్వితీయ వివాహం- కోర్టు సమస్యలు- తండ్రి ఆస్తి గొడవలు
సమా:పరిష్కారానికి చాలా ఆలస్యముంది. ఆస్తి విషయంలో సందేహమే- అంశా దోషం కారణంగా రాబడికంటే పోబడే ఎక్కువ.
ఎస్.వెంకటేశ్వరరావు, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:ఆర్థికాభివృద్ధి- ఆరోగ్యం
సమా:ఆర్థికాభివృద్ధి విషయంలో మీరు స్వార్జితమునే అనుభవించపగలరు. ఆనువంశికత తక్కువే- ఆరోగ్య సంబంధంగా కొలస్ట్రాల్ సమస్య ఉండే అవకాశం వుంది. జంతువులనుండి- క్రిమికీటకాదులనుండి జాగ్రత్తగా ఉండండి.
అన్నవరపు వెంకటేశ్వరరావు- పెనమలూరు (ఆంధ్ర)
ప్ర:ఇన్నాళ్ళూ వ్రతంగా ఉన్న కార్తీకనోములు మానుకోవలెనని సంకల్పము- సూచనలు ఇవ్వండి.
సమా:వయోధర్మం సహకరించనపుడు సంతానానికి అప్పగించండి. ఎవ్వరూ సహకరించకపోతే మహాక్షేత్రంలో చివరిసారిగా సమాపన వ్రతం చేసి యధాశక్తి అన్నదానాదులు నిర్వహించి వ్రతదీక్షలు విరమించండి.
పరిటాల వీరభద్రం- పెనుగొండ- (ఆంధ్ర)
ప్ర:గురువుగారూ! నాకు ఎప్పుడూ తుమ్ములు వస్తూ ఉంటాయి. శుభకార్యాలకు వెళ్లాలంటే భయం- వెళ్లక తప్పదు. జాతకదోషమా? పరిష్కారమేమిటి?
సమా:‘క్షుతం శిరోగతం వాతం’ అని ఆయుర్వేద శాస్త్రం చెపుతుంది. తలలో చేరే వాయువే (గ్యాస్) తుమ్ము రూపంలో బయటకు వస్తుంది. మేషంలో శనిని- కుజునితో కలిసి ఉన్నా కుంభంలో శని-రాహువుతో కలిసి ఉన్నా అట్లా జరుగుతుంది. హారతి కర్పూరం ఎప్పుడూ దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ ఉండండి. గుణం కనిపించవచ్చు. శని రాహు కుజ పీడలకు నారాయణ అష్టాక్షరి జపం ప్రతిరోజూ సహస్రం చేయండి. జపయోగంవలన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తమంత తాముగానే క్రమబద్ధవౌతాయి.
క్రొవ్విడి లక్ష్మీనరసింహం, సజ్జాపురం- (ఆంధ్ర)
ప్ర:నా స్వగ్రామంలో ఉన్న ఇంటిని అమ్మి తణుకులో అపార్ట్‌మెంట్ కొనగలనా?
సమా:తణుకు మీకు బాగానే ఉంటుంది. ఎవరో స్ర్తి కుటుంబ సభ్యుల కారణంగా స్థిరనిశ్చయానికి రాలేకపోతున్నాను. అది పరిష్కరించుకోండి.
వి.సత్యనారాయణ- కాకినాడ - తూ.గో.
ప్ర:ప్రశాంతత లేదు. బ్రతుకు దుర్భరంగా ఉంది-
సమా:దుర్భరం కాదు- జీవితం ఒక వరం- సద్గ్రంధ పఠనం- సత్సాంగత్యం- ప్రయత్నించండి.
ముప్పిడి మహేశ్‌కుమార్ - పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:వివాహమయి చాలాకాలమయింది. సంతానం లేదు. సంతానయోగం ఉందా? పరిష్కారమేమిటి?
సమా:2017లో శుభమేదైనా జరగవచ్చు. ఆర్థిక సమర్థత ఉంటే నాగప్రతిష్ఠ చేయించండి. ‘మున్నంగి’ లేదా మోపిదేవి క్షేత్రాలను దర్శించండి. శుభం కలుగుతుంది.
జి.రమణయ్య, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:్భవిష్యత్తు బాగుంటుందా?
సమా:కాలమొక్క రీతిగా గడవబోదు అనేది పెద్దలు చెప్పిన వాస్తవిక సత్యం. స్వధర్మాన్ని అనుసరించటం - దైవాన్ని నమ్మటం మాత్రమే మనం చేయగలిగేది. చరిత్రలూ - పురాణాలూ చదవండి. సమాధానం మీకే దొరుకుతుంది. ‘యన్నక్షేత్రేతద్దైవత్యాసు కార్యం’ అంటుంది వేదం- ఆయా సందర్భాలలో ఆయా దేవతలను పూజించాలి.
వి.ఎస్.రావు, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:నా మూడవ కుమార్తె నక్షత్రం పునర్వసు నాలుగవ పాదం- ఆమె ఆరోగ్య విషయం చెప్పండి.
సమా:కేవలం నక్షత్రంతో చెప్పడం సాధ్యం కాదు. 2017లో చివరి భాగంలో శుభాలు జరిగే అవకాశం వుంది.
ఎ.సత్యనారాయణ, మొండెపులంక- (ఆంధ్ర)
ప్ర:ఆరోగ్యం-
సమా:క్రమంగా కుదుటపడుతుంది. దిగులు మానేయండి.
టి.హరికృష్ణ- ప్రొద్దుటూరు (ఆంధ్ర)
ప్ర:జాతక చక్ర పరిశీలన - పరిష్కారం
సమా:మీ నక్షత్ర దశానాథుడు శని కారణంగా- రవి- శుక్రులు- యోగ కారకంగా లేని కారణంగా- వ్యయస్థానం రాహుగ్రస్తం కారణంగా దుర్వ్యయం- బంధుద్వేషం- రవి అనుకూలంగా లేని కారణంగా పితృమూలకంగా లాభించకపోవటం- జరుగుతున్నాయి. పరిష్కారంగా శివపంచాక్షరీ జప దీక్ష తీసుకోండి. మీ భార్య చేత గౌరీ పంచాక్షరీ జప దీక్షా తీసుకొమ్మనండి. ప్రతిరోజూ సహస్రం చేస్తూ ఉండండి. అంతా అనుకూలమవుతుంది.
జి.బుచ్చిరాజు - డోర్నకల్ - ఆంధ్ర
ప్ర:నా భార్య పేరు గాయత్రి- జంగారెడ్డిగూడెం బాగుంటుందని మీరన్నారు- ఏ దిశలో తీసుకోమంటారు-
సమా:తూర్పు ద్వారం - పడమరగా ప్రవేశం అంటే లోనికి వెళ్లాలి- శుభం.
జి.లింగయ్య, చైతన్యపురి (హైదరాబాద్)
ప్ర:మా స్వగ్రామంలో ఇల్లు అమ్మి హైదరాబాద్‌లో ప్లాటు కొనగలనా?
సమా:అమ్మగలరు- కొనటం సందేహమే- జాగ్రత్తలు తీసుకోండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ