సబ్ ఫీచర్

క్రిస్టమస్ క్యాండిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ నెల వచ్చిందంటే చలితో పాటు క్రిస్మస్ పండుగ ఇంటింటా సందడి చేస్తోంది. ఇళ్లను అందంగా పెయింటింగ్‌లతో ముస్తాబు చేస్తారు. విభిన్న రంగుల పూలతో అలంకరించిన వస్తువులతో ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతారు. అతిథులకు స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కానుకలను ఇచ్చుకుంటారు. ప్రతి ఇల్లు స్టార్ వెలుగులతో నిండిపోతుంది. క్యాండిల్స్ వెలుగులో కాంతులీనుతుంటాయి. మార్కెట్లోకి అందమైని క్రిస్టమస్ క్యాండిల్స్ వచ్చాయి. నాలుగు అంగుళాల ఎత్తున్న మొక్క ఆకారంలో ఉండే ఈ క్యాండిల్స్ ఆకుపచ్చ వర్ణంలో క్రిస్మస్ ట్రీ ఆకారంలో అందంగా కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు మెటల్‌తో తయారుచేసిన క్యాండిల్స్ కూడా ఉన్నాయి.
రంగు రంగుల పూల మధ్య అందంగా అలంకరించిన ఈ క్యాండిల్స్ చూడండి ఎంత చూడముచ్చటగా ఆహ్వానం పలుకుతున్నాయో. కమ్మటి పూల పరిమళాలు వెదజల్లుతూ రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ క్యాండిల్స్ సెట్‌ను ఇంట్లో ఎక్కడైనా అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. 5.2 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పుతో తాజాదనం సువాసనలు వెదజల్లుతూ వెలుగులు నింపుతుంది. గుబాళించే గులాబీ పూల ఆకారంలో కనిపించే ఈ క్యాండిల్స్‌ను పండుగ సందర్భంగా స్నేహితులకుగానీ, బంధువులకుగానీ కానుకగా అందజేయవచ్చు. ఈ క్యాండిల్స్‌తో పాటు శాంత్రా టోపీని కూడా ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. మల్టీకలర్స్‌లో కనిపించే ఈ పూల క్యాండిల్స్ కూడా మీ ఇంటికి వెలుగులు పంచుతూ కరిగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి ఎన్నో రకాల అందమైన క్యాండిల్స్ వెలుగులు విరజిమ్ముతున్నాయ.