భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తాత్రేయ, రాంనగర్ గుండు (హైదరాబాద్)
ప్ర:‘అతి సర్వత్ర వర్జయేత్, వినా దైవభక్తి’ అని కదా పెద్దల మాట- మీరు ఒకరి ప్రశ్నకు సమాధానం చెపుతూ దైవకార్యాలు విపరీతంగా చేయకూడదు అన్నారు. ఏమిటీ అయోమయం, సూటిగా సమాధానం చెప్పండి.
సమా:మోక్షార్థి ఐనవాడు తదేకంగా దైవభక్తికి అంకితం కావటంలో తప్పులేదు. కాని గృహస్తు జీవితం గడుపుతూ చేయవలసినవి గృహస్థాశ్రమ ధర్మాలు- ఆశ్విలాయన లేదా ఆపస్తంభ, గృహ్యసూత్రాలు- అంతేకాని ఒక గంటసేపు లలితా- ఒక గంటసేపు విష్ణుసహస్రనామాలు- ఒక గంటసేపు ఖడ్గమాల- ఒక గంటసేపు రుద్రాభిషేకాలూ చేయడం సరియైనది కాదు. పైగా ఇవన్నీ చేస్తూ నేను అలసిపోతున్నాను, నాకు మనశ్శాంతి లేదు అనటం మనోవికల్పానికి- మనః చాంచల్యానికి- ఏదో మహిమలు సాధించలేకపోతున్నామని బాధపడటానికి నిదర్శనం- దానినే ‘వ్యభిచార భక్తి’ అంటారు. అలాంటి విషయంలో విపరీతం పనికిరాదు అన్నది నేను చెప్పినమాట. దైవకార్యంలో హఠమూ - శఠమూ పనికిరాదు. గృహస్తు గృహస్తాశ్రమ ధర్మాలు పాటించాలి.
పాల్ పాండి, డిందిగ (మధురై), తమిళనాడు
ప్ర:మా అమ్మాయికి వివాహ దోషానికి పూజ చేయించాము. అయినా కావటంలేదు. కారణం చెప్పండి.
సమా:మీ అమ్మాయి జాతక కుండలి చూడనిదే చెప్పటానికి వీలు కాదు. సంఖ్య కూడా మీ అమ్మాయి చెప్పాలి, మీరు కాదు.
షేక్ సిద్ధిఖీ - శ్రీకాళహస్తి (చిత్తూరు)
ప్ర:నాకు ప్రభుత్వోద్యోగ యోగం ఉందా? వ్యాపారం చేయాలంటే ఏ వ్యాపారం చేయాలి?
సమా:ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు ప్రయత్నించండి. ముఖ్యంగా రైల్వే క్యాంటీన్లు- ప్రభుత్వ ఆఫీసుల్లో క్యాంటీన్లు వంటివి మీకు లాభిస్తాయి.
ఎమ్.కృష్ణమాచార్యులు, రాజమహేంద్రవరం (ఆంధ్ర)
ప్ర:కుమారుడికి ఉద్యోగం-
సమా:సంఖ్య మీ అబ్బాయి చెప్పినది అయి ఉండాలి, మీరు కాదు. మీరు చెప్పిన సంఖ్య ప్రకారం శుభకార్యాలోచనలు- విలువైన వస్తువుల కొనుగోలు అంశాలు కనబడుతున్నాయి. శుభం భవతు.
ఎమ్.వి.సమీరకుమార్, తిరుపతి (చిత్తూరు)
ప్ర:ఉద్యోగమూ - వివాహము
సమా: 2017లో మధ్యభాగంలో శుభకార్య సూచనలు కనిపిస్తున్నాయి. ఏడుకొండల వాడికి యధాశక్తి బూందీ లడ్డూలు సమర్పించండి.
మహానందీశ, ఆదోని, కర్నూలు
ప్ర:ప్రస్తుతం చేస్తూ ఉన్న ప్రభుత్వోద్యోగం నుండి మారమంటారా? మీరు చెప్పిన ప్రకారం ప్రభుత్వోద్యోగం లభించింది.
సమా:మారవద్దు. ప్రస్తుతం ఉన్నదాంట్లోనే మంచి మార్పు రావచ్చు.
ఎమ్.శివప్రసాద్, ద్రోణాచలం (ఆంధ్ర)
ప్ర:పండితులవారూ! నాకు అదేపనిగా ఎడమ కన్ను అదురుతోంది. మంచిది కాదు అంటున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి.
సమా:అదేపనిగా కన్ను అదరటం శరీరంలోని వేడి (ముఖ్యంగా తలలో కణతల భాగంలో) వేడిగాలి పెరిగిందటానికి నిదర్శనం. ప్రతిరోజూ ఉదయం చన్నీటితో కళ్ళు కడుక్కోండి. రాత్రి కూడా పడుకొనేముందు కళ్ళు చన్నీటితో కడుక్కోండి. రెండు రోజుల్లో మంచి మార్పు కనబడుతుంది. వేడి పదార్థాలు మానండి.
సి.గోవింద, సంజీవనగర్, బేతంచర్ల (ఆంధ్ర)
ప్ర:వాస్తు దోషాల ఇల్లు- సమస్యల తోరణం- పరిష్కారం ఏమిటి?
సమా:వాస్తు సవరణలు చేయించండి లేదా ఇల్లు మారండి.
మాడిశెట్టి కొండయ్య దంపతులు, వనపర్తి (పెద్దపల్లి)
ప్ర:సంతాన ప్రశ్న
సమా:నాగప్రతిష్ఠ చేయండి. శుభం జరుగును.
వనమా రామారావు, విజయవాడ (ఆంధ్ర)
ప్ర:మహాశయా! మాది పడమర గుమ్మం అపార్ట్‌మెంట్. ఆదాయం మించిన ఖర్చులు- పడమర గుమ్మం ప్రభావమా?
సమా:పూర్తి పడమర గుమ్మమైతే ఫర్వాలేదు కాని సహజంగా గుమ్మం మూలలవైపు పెట్టడం అనేది నేటి నిర్మాణ పద్ధతి. మీది వాయవ్య మూలగా గుమ్మం అయి ఉండాలి. దానికి పరిష్కరం వాయువ్య దిగ్బంధన యంత్రం గుమ్మంలో లోపలి వైపు ప్రతిష్ఠించండి. దానికిగాను పండితులను సంప్రదించండి- వాయువ్య మూల కావటం దోషం.
ఎమ్.్భజంగరాయలు, పాలకొల్లు (ప గో)
ప్ర:నాది ధనుర్లగ్నం- సమస్యల్లో ఉన్నాను- పరిష్కారం చెప్పండి.
సమా:మీరు చెప్పిన సంఖ్య ప్రకారం ఆర్థికంగా ఇతరుల కారణంగా కాని, స్ర్తి మూలకమైన సమస్యలవల్ల కాని ధన నష్టం పొందినట్లు కనిపిస్తోంది. నామ నక్షత్రవశాత్తు మీది పూర్వాషాఢ- ధనుర్రాశి- ఏలిననాటి శని పీడ ఉంది. తగు శాంతి కార్యాలు పురోహితుల ద్వారా జరిపించుకోండి.
కె.ఎమ్.హెచ్.మల్లికార్జునరావు, గుంటూరు (ఆంధ్ర)
ప్ర:గతంలో నా ప్రశ్న విషయంలో అంతర్లీనంగా స్థిరాస్తి వ్యవహారాలు- స్ర్తి మూలకమైన విషయాలు ఉన్నాయన్నారు. అది అక్షరాలా నిజమే- దానికి పరిష్కారం ఏమిటి?
సమా:ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి వ్రతం చేయండి. శుభం కలుగుతుంది.
ఎన్.వెంకటేశ్వర్లు, నెల్లూరు, ఆంధ్ర)
ప్ర:పొలం తగాదా- కోర్టు వ్యవహారం-
సమా:ఇంకా ఆలస్యముంది- మీకు కొంత నష్టముతో పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి జయము- పూర్తి లాభాము- అనుమానమే. రాజీతో వెళ్ళండి!
తిరుపల్లి శ్రీదివ్య, బద్వేల్ (ఆంధ్ర)
ప్ర:సోదరి జాతకం- సోదరి సమస్యలు-
సమా:మీ సోదరి జాతకంలో బలమైన కుజదోషం కాలసర్పయుతమై ఉంది. షష్టచంద్ర దోషం కారణంగా స్ర్తి విరోధం వంటివి ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలవగలిగితే పరిష్కార మార్గాలు తెలుపగలను.
తలారి వెంకటరావు, విజయనగరం (ఆంధ్ర)
ప్ర:అయ్యా! నమస్కారం! మీరు చెప్పిన ప్రకారం స్వీటు షాపు నడిపిస్తున్నాను. వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. ధన్యవాదాలు. అయితే గతంలో కొందరికి నేను ఇచ్చిన డబ్బులు తిరిగిరావటంలేదు. దానికి పరిష్కారం చెప్పండి.
సమా:‘నష్టద్రవ్య ప్రాప్తి యంత్రం’ పెట్టుకొని పూజిస్తే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. దానికోసం స్థానికంగా ఎవరైనా పండితులు ఉంటే ప్రయత్నించండి. లేదంటే వ్యక్తిగతంగా కలవండి!
వోడ్నాల విద్య, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:ఆర్థిక ఇబ్బందులు- ఆర్థికాభివృద్ధికి ఏం చేయాలి?
సమా:ఇంట్లో ఇరవై నాలుగు గంటలూ ఉత్తరం ముఖంగా వెలిగే విధంగా ఆవు నెయ్యితో శ్రీవేంకటేశ్వరస్వామి ముందు దీపం వెలిగించండి. బుధవారం బూందీ లడ్డూ నివేదన చేసి పిల్లలకు పంచండి. నలభై రోజుల్లో మార్పు కనబడుతుంది.
ఎమ్.ఈరన్న, బిచ్కుంద (కామారెడ్డి)
ప్ర:ఉద్యోగప్రాప్తి
సమా:షరతులతో మీకు మీరే గిరి గీసుకోకుండా ఏ ఉద్యోగమైనా ప్రయత్నించండి.
రావూరి నారాయణరావు, ఫిరంగిపురం (గుంటూరు)
ప్ర:వ్యాపారం సరిగా జరగటంలేదు-
సమా:పణ్యహోమం వ్యాపార స్థలంలో ప్రతి బుధవారం నాలుగు వారాలు చేయించండి.
కేతేపల్లి నాగచంద్రావతి, వేరుపాలం (ఖమ్మం)
ప్ర:నాకు డెబ్భై ఏళ్ళు- నా కుటుంబం, పిల్లలు ఎలా ఉంటారు?
సమా:అందరూ బాగుండాలంటే ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఏకభుక్తంతో ఉపవసించి ఉదయం నిమ్మకాయ పులిహోర నైవేద్యం పెట్టండి. కొంచెం గోధుమ పిండి శర్కర చీమలకు వేయండి.
ఎ.శేషాద్రిరెడ్డి, కాణీపాకం (చిత్తూరు)
ప్ర:మావూరిలో చాలామంది రాజస్తానీవాళ్ళు మీకు అభిమానులయ్యారు. ప్రతి ఆదివారం నా దగ్గరకు వచ్చి మీ భవిష్యకాలం చెప్పించుకుపోతారు. వారు హిందీలో ప్రశ్నిస్తే జవాబులివ్వగలరా?
సమా:హిందీలో ఇవ్వగలను. లిపి మాత్రం తెలుగులోనే ఉంటుంది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :్మ

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి