సబ్ ఫీచర్

రామచిలకల తండ్రి! (వార్త - వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో శేఖర్ జోసెఫ్ అనే కెమెరాల మరమ్మతు దుకాణదారుడున్నాడు. సరదాగా తన డాబామీద పిచుకలకి గింజలు వేసేవాడు. కానీ, సునామీ వచ్చిపోయిన తరువాత, ఎక్కణ్నుంచి వచ్చాయో- వందలాది రామచిలుకలు- ‘‘అక్కాయ్.. అక్కాయ్..’’ అంటూ అతని చెంతకి వచ్చి వాలసాగాయి! వాటి సంఖ్య వేలకి చేరింది.
శేఖర్ తన ఆదాయంలో నలభై శాతం వాటికి అన్నం, గింజలు, మంచినీళ్ళు అన్నీ తన డాబామీద పెట్టేవాడు. ఈ రామచిలకల సంఖ్య రాను రాను పెరిగిపోయి రెండువేలదాకా అయింది. వాటికి రెండు పూటలా పిండి తిండి వడ్డించడం అతనికి అలవాటైపోయింది. మహాబలిపురం దారిలో వున్న పక్షి తీర్థంలో రోజూ మధ్యాహ్నం ఒంటి గంట వేళ ఉత్తర దిశనుంచి రెండు పెద్ద గ్రద్దలు వచ్చి పూజారి చేత పట్టుకుని వున్న ప్రసాదాన్ని తిని వెళ్తూంటాయి. అలాగా, రుూ రామచిలుకలు ఎక్కడెక్కడ్నుంచో శేఖర్ కోసం వచ్చి అనునిత్యం అలారం పెట్టుకున్నట్లు వచ్చి వాలుతాయి. బంతిలో కూర్చుని సంతర్పణ భోజనం ఆరగించినట్లు బుద్ధిగా తిండి తిని, నీళ్లు త్రాగి వెళ్లిపోతాయి.
‘‘ఏనాటి అనుబంధమో, యివి నా నేస్తాలయినాయి. పోయేనాడు ఏం పట్టుకుపోతాం? ఈ చిలుకలు, పావురాలు టంచన్‌గా వస్తాయి. టైము చూసుకోవచ్చు అలారమ్ పెట్టినట్లు’’ అంటాడు శేఖర్ జోసెఫ్!

‘ప్యాంట్’లు ఇప్పేసుకునే రోజు!
గొట్టాం రైళ్లల్లో అర్థనగ్నంగా! అదో వేడుక. మొన్న ఆదివారం- 8- ప్రపంచ మహానగరాలకు- ‘నో ప్యాంట్స్’ అంటే కేవలం ఆడా మగా లాగులు మాత్రం వుంచుకుని ‘అర్థనగ్న ప్రదర్శనా పండుగ’ చేసుకున్నారు- వారెవా!
అసలు ప్యాంట్లు వదిలేసి, లాగులు (డ్రాయర్లు) మాత్రం వుంచుకునే తమాషా పండుగ 2002లో న్యూయార్క్‌లో వో డజన్ మంది కుర్రకారు ‘‘అండర్ గ్రౌండ్ రైల్లో’’ మొదలెట్టారు. అదో మజాగా వుండింది. కాబట్టి ప్రపంచంలో జనవరి 8న అండర్‌గ్రౌండ్ రైలు మార్గాలు వాటినే గొట్టాం రైళ్లు అంటారు. సగం డ్రస్సుల్లో చలికి పిడచగట్టుకుపోతూ- అర్థరాత్రి ప్రయాణం చేయడం గొప్ప వేడుక అయిపోయి- ఆడపిల్లలు కూడా తెగ ఎగబడుతున్నారు.
పోయిన ఆదివారం బెర్లిన్, బ్రస్సెల్స్, బోస్టన్, లండన్, ప్రాగ్, వార్సా, న్యూయార్క్ సరేసరి- పట్టణాలో వజ వజ వణుకుతూ కాళ్లు కొయ్యబారుతూండగా యువతీ యువకులేగాదు- మధ్య వయస్కులు కూడా పంట్లాం, పాజమా, షరాయి, లెగ్గీ, షుర్వా వగైరా దిగువ దుస్తులు - రైలెక్కే ముందు ఒక నిర్దేశిత ప్రదేశంలో వదిలేసి లోపలికి నడవ (కారిడార్) గుండా ప్రవేశించారు.
‘‘ఏమాత్రం సిగ్గూ లజ్జా పడకుండా, ప్యాంట్లు ధరించి వున్నట్లే భావిస్తూ హాయిగా ప్రయాణం ఎంజోయ్ చెయ్యండి’’ అని రుూ పండుగ దీక్ష ఇచ్చిన గురువులు చెబుతూండగా- ‘‘జీసస్.. జీసస్’’ అనుకుంటూ చర్చికి వణుకు ప్రయాణాలు చేశారు.
ప్రతిరోజూ మన పంచాంగం కనీసం అయిదారు వ్రతాలూ, నోములూ, పండుగలూ- యిస్తుంది. విదేశాలలో సరేసరి. నాన్న దినం, అమ్మదినం, తాత, తాతమ్మల దినం మొదలు క్యాన్సర్, డయాబెటిస్ రోజుల దాకా ఎన్నో వుంటాయి. ఐనా మనిషికి తృప్తి లేదు. ఇంకో దినం కలుపుకున్నాడు. చేతిలో ‘తడి’ వుండాలేగానీ ప్రతీ రాత్రీ వసంతరాత్రియే గదా!

బడులలో నిలువుటద్దం, దువ్వెనలు వుండాలి!
అమ్మో, నాయనమ్మో పిల్లలికి యించక్కా- కృష్ణుడికి యశోదమ్మ చేసినట్లు ముస్తాబు చేసి- చిదిమిపెట్టిన దీపాల్లాగా తీర్చిదిద్ది- స్కూల్‌కి పంపాలి. అప్పుడే చదువు వంటపడుతుంది. ‘‘అధ్యాపకులు కూడా అద్దంలో చూసుకుని- తల దువ్వుకుని రావాలి’’ అంటూ, రాష్ట్రంలోని స్కూళ్ళకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం.
వాళ్లకదో ఉద్యమం. ‘శాలదర్పణ్’ అంటూ స్వచ్చ భారత్ స్థాయిలో మొదలెట్టారు. పైగా రాష్ట్రంలో వున్న స్కూళ్ళ సమాచారంతో ఒక వెబ్‌సైట్ పెట్టి, డేటా బేస్‌ను తయారుచేయిస్తున్నారు. మొత్తం స్కూళ్ల సంఖ్య 51 వేలు. వాటిల్లో భర్తీ అయిన పిల్లకాయల సంఖ్య 36,48,994 కాగా, 1,49,381మంది టీచర్లు మాత్రమే వున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో వుంటున్న మనకి తెలియదుగాని బిమారు (రోగిష్టి) అనగా బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లు విద్య విషయంలో వెనుకబడి వున్న రాష్ట్రాలు- యు.పిలో అఖిలేష్ లాప్‌టాప్‌లు పంచిపెట్టి కొంతవరకూ విద్యని పెంపొందించాడుగానీ, బిహార్‌లో, రాజస్థాన్‌లో కథ శోచనీయంగానే వున్నది. పిల్లల్ని శుభ్రంగా వుంచి పంపరు తల్లిదండ్రులు. ఏమయినా అంటే, ‘‘స్కూలుకో రామ్ రామ్’’ అంటారని భయం.

పచ్చిమిర్చియే ప్రాణం!

‘కూరలేని తిండి కుక్క తిండి
ధార లేని తిండి దెయ్యపు తిండి
పప్పులేని తిండి పాడు తిండి!’
అన్నాడు వేమనగారు. అలాగా భూటాన్ ప్రజలకి పచ్చిమిరపకాయల కూర, పచ్చిమిర్చి పులుసు, అలాగే పచ్చిమిర్చి బూరెలు- లేనిదే ఒక్క పూట కూడా ముద్ద దిగదు. అన్నప్రాసనకి వాళ్లు పచ్చి మిరపకాయతో చేసిన ఇమాడాట్షీ అంటే- జన్ను మిరపకాయ తినిపిస్తారు.
ధింపూ వాళ్ల రాజధాని. హిమాలయాల ఒడిలో వుండే రుూ చిన్ని దేశం జనాభా ఏడు లక్షలు మాత్రమే గానీ, ఒక ఇల్లాలి మధ్యాహ్న భోజనం ఏమిటీ అని మనం పరిశీలిస్తే- అరుణవర్ణంలో వున్న అన్నం, జున్ను పచ్చిమిర్చి వంటకం, పుట్టగొడుగుల మిర్చీ కూర, తాజా పచ్చి మిరపకాయలతో చేసిన ‘సలాడ్’, దానిమీదకి, నంజుడుగా మిరపకాయ ఆవకాయ; మళ్లీ పచ్చిమిర్చి చేపల పులుసు! అదండీ సంగతి! పచ్చి మిరపకాయ లేనిదే వాళ్లకి పండుగ లేదు గానీ, రుూసారి ఆ దేశంలో పచ్చి మిరపకాయ- బంగారం అయిపోతోంది. వాళ్లకి కేవలం ఇండియా నుంచే రుూ పచ్చిమిరపకాయలు- రకరకాలు వస్తాయిగానీ 2016, మే నెల నుంచీ భూటాన్ గవర్నమెంటు మిర్చి దిగుమతులు బంద్ చేసింది. కారణం మిరపకాయలలో ఇండియన్ కాలీఫ్లవర్‌లో ఎరువుల రసాయన విష పదార్థాలు వున్నట్లు పరీక్షలో రుజువైందిట. దానితో పదిహేను రూపాయలు కిలో వుండే పచ్చి మిరపకాయలు (ఇందులో చాలా రకాలున్నాయి) పది హేను వందలు పలుకుతున్నాయిట! జనం అల్లాడిపోతున్నారు. పండుగలు లేవు, విందులు లేవు. వాళ్ల దేశంలో యిప్పుడిప్పుడే రుూ పంట వేస్తున్నారు. ఏడాది చివరికి చేతికి అందుతుందేమో పంట కొంచెమేనా. ఈలోగా మిరపకాయల్ని దొంగ రవాణా ద్వారా తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. జనఘోషకు ఝడిసి యిటీవల కలకత్తాలో నుంచి కొన్ని వెరైటీ మిరపకాయల దిగుమతికి గవర్నమెంట్ అంగీకరించింది. ‘‘అమ్మయ్యా! అనుకున్నారు వాళ్లు. మిర్చి బజ్జీల ప్రియుడిగా- తెలుగువాడొక్కడే వాళ్ల బాధను అర్థం చేసుకోగలడు.

-వీరాజీ