భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.శంకరరెడ్డి, కావలి (చాకుదలి), నెల్లూరు
ప్రశ్న: జీర్ణ శివాలయ పునరుద్ధరణ చేయగలనా? భార్య ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
జవాబు: జీర్ణ శివాలయ ఉద్ధరణ చాలా గొప్ప సత్కార్యం. భక్తిశ్రద్ధలతో ప్రారంభించండి. తప్పక పూర్తిచేయగలరు. తద్వారా మీ భార్య ఆరోగ్యంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. క్రొత్తగా దేవాలయ నిర్మాణం కన్నా జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే వేయి రెట్లు అధిక పుణ్యమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఏ పూజాదికాలు లేని శివలింగానికి అభిషేకిస్తే, ప్రతిష్ఠిత పూజావిధులందుకునే దేవుడికన్నా ఎన్నో రెట్లు అధికతమమని శాస్త్ర వాక్యం. జీర్ణదేవాలయ పునరుద్ధరణకు తక్షణం పూనుకోండి! కార్యసిద్ధిర్భవతు!
కాకాని వెంకట శివకుమార్, విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: చేస్తున్న ఉద్యోగం అమ్మవారి గుడిలో రిటైర్మెంట్ వరకు నిర్విఘ్నంగా చేయగలనా?
జవాబు: తప్పక చేయగలరు. శ్రద్ధ్భాక్తులతో చేయండి. ఉద్యోగ ధర్మంగానే కాకుండా భక్త్భివంతో జగన్మాతను సేవించండి. అయితే మీరు చెప్పిన సంఖ్య నేను నిర్దేశించిన పరిధిలో లేదు. అయినా మరో జ్యోతిష పద్ధతిలో పరిశీలించి వ్రాశాను- శుభం భవతు.
కె.సంతోష్, సిద్ధిపేట (తెలంగాణ)
ప్రశ్న: ప్రభుత్వోద్యోగం- భవిష్యత్తు బాగుంటుందా?
జవాబు: ప్రభుత్వోద్యోగం లభించే అవకాశాలున్నాయి. కాని వివాహ సంబంధమైన విషయాల కారణంగా ఆటంకాలు కలుగగలవు. జీవితం సంఘర్షణాత్మకంగా ఉంటుంది. సావధానత అత్యవసరం.
చాట్ల వెంకట రమణ, చీమకుర్తి (ఆంధ్ర)
ప్రశ్న: ఏ వ్యాపారం- ఏ దిశలుగా?
జవాబు: కిరాణా - బియ్యం- స్టేషనరీ- ఆగ్నేయం - వాయవ్యం దిశలు.
అద్దేపల్లి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ (కృష్ణా)
ప్రశ్న: స్వంత స్థలాలపైన దురాక్రమణ- పరిష్కారం?
జవాబు: ఎవరైనా మహానుభావుని ఆశ్రయించి విజయ దుర్గా మంత్రాన్ని ఉపదేశం పొందండి. విజయ దుర్గా యంత్రాన్ని కూడా సంపాదించి పూజలో పెట్టుకోండి. ‘సర్వే సర్వత్ర విజయప్రాప్తి’-
జి.గీతామహాలక్ష్మి, కొత్తపేట (హైదరాబాద్)
ప్రశ్న: మీరు చెప్పినట్లుగా జామ తోటల లీజు లాభించలేదు. మామిడి తోటల వ్యాపారం స్వంతంగా చేయాలనుకుంటున్నాను. లాభిస్తుందా?
జవాబు: భాగస్వామ్యమే మంచిది. అయితే ప్రస్తుతం మీ పేరున ఏలిన నాటి శని పీడ ప్రారంభం కాబోతోంది. శని కార వెంకటేశ్వర వ్రతం చేయండి. మామిడి తోటలే లాభం.
పల్లెపోతు నరసింహారావు, విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: భార్య ఆరోగ్యం?
జవాబు: ప్రమాదాలనుండి జాగ్రత్త పడండి.
వోడ్రాల ప్రసాద్ - జూలపల్లి (తెలంగాణ)
ప్రశ్న: ఎమ్.ఎస్.సి బాటనీ బి.ఇడి చేసాను. కేవలం ఆరు వేలకు ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు అభివృద్ధి లేదా?
జవాబు: జన్మస్థానాన్ని వదలి కరీంనగర్‌లో ప్రయత్నించండి. జాలపల్లి మీకు యోగించదు.
బి.రామచంద్రమూర్తి, విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: తగినంత స్థోమత లేక అమ్మాయిల పెళ్లి చేయలేకపోతున్నాను. పరిష్కారమేమిటి?
జవాబు: దూరదృష్టితో ముందుజాగ్రత్త పడవలసింది. ఏదైనా స్థిరాస్తి ప్రమేయంతో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దైవసేవకుగాను శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి ప్రతి శనివారం తులసిమాలలతో పూజించి బూందీ లడ్డూ నివేదన చేసి చిన్న పిల్లలకు పంచిపెట్టండి.
పి.అలేఖ్య - అమలాపురం (ఆంధ్ర)
ప్రశ్న: వివాహ ప్రశ్న-
జవాబు: వాయువ్య దిశ నుండి రాగలదు. 2017 చివరి భాగంలో జరుగును.
శే్వత, మహబూబ్‌నగర్ (తెలంగాణ)
ప్రశ్న: ప్రభుత్వోద్యోగం రాగలదా?
జవాబు: ఉద్యోగం కంటే వివాహ ప్రశస్తి జరిగే అవకాశం ఉంది.
కె.తనూజ - విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: వివాహ విషయం?
జవాబు: స్వయంవర పద్ధతిలో జరిగే అవకాశం వుంది. కొన్ని వ్యతిరేక సంఘటనలు కూడా జరగవచ్చు.
వీరత్తు సత్తిబాబు - బాపట్ల (ఆంధ్ర)
ప్రశ్న: దాంపత్య సమస్యలు
జవాబు: పదకొండు సోమవారాలు గజ గౌరీవ్రతం పదకొండు మంగళవారాలు గజగౌరీవ్రతం చేయండి.
కామిడి అరుణ్‌కుమార్, సిద్ధిపేట (తెలంగాణ)
ప్రశ్న: విద్యాభ్యాసం ఎలా ఉంటుంది?
జవాబు: అదృష్టం బాగుంది. అయితే విద్యా విషయంలో ఏకాగ్రత ఉన్నట్టు లేదు. అది పెంచుకోండి. బాసర సరస్వతీ మాతను దర్శించండి.
రహ్మత్ పటేల్, సిద్ధిపేట (తెలంగాణ)
ప్రశ్న: హమ్ గుజరాతీ హై- సిద్ధిపేటమే దో మెహనేకే ఆగే ఆకే బస్‌గయేహై. యహా హమ్ వుడ్ వర్క్ కారోబారీ షురూ కరే హై- సిద్ధిపేట్ మేరే నామ్ సే జమ్‌తాయా నహీ-
జవాబు: సిద్ధిపేట్ ఆప్‌కేలియే యోగ్‌దాయ్‌హై- నిశ్చిత్‌హోకర్ కారోబారీ షురూకీజియే-
రావూరి నారాయణ, ఫిరంగిపురం (గుంటూరు)
ప్రశ్న: వ్యాపారాభివృద్ధికి పణ్యహోమం చేయించుకొమ్మని మీరు సలహా ఇచ్చినారు గతంలో- పణ్యహోమం అంటే ఏమిటి?
జవాబు: వ్యాపారాభివృద్ధికి చేసే హోమం పణ్యహోమం- స్థానిక పురోహితులను కలుసుకోండి- లేదా వ్యక్తిగతంగా కలవండి.
టి.రవికుమార్, వెనె్నలబావి, నెల్లూరు
ప్రశ్న: నాకు ఉద్యోగం ఏ రంగంలో ప్రయత్నించవలెను.
జవాబు: వైద్య- డిఫెన్సు- పోలీసు- సంస్థలు.
ఆలవాల రోశయ్య, పాల్వంచ (ఖమ్మం)
ప్రశ్న: నా కూతురుమీద అకారణంగా ద్వేషం పెంచుకుంటున్న నా కుమారుడు- పరిష్కారం ఏమిటి?
జవాబు: ‘ఏకద్రవ్యాభిలాషీ ద్వేషీ’ అన్నది పెద్దలు చెప్పిన నిర్వచనం. ఒకే వస్తువును ఇద్దరు కోరినప్పుడు స్పర్థలూ, ద్వేషాలూ వస్తాయి. పెద్దవారుగా ఆలోచించి న్యాయం చెయ్యండి. ఇరువురికీ దూరంగా ఉండండి.
వెంకట్, తిరుపతి (ఆంధ్ర)
ప్రశ్న: మా అమ్మమ్మ పేరున ఇల్లు నాకు వస్తుందా మా నాన్నకు వస్తుందా?
జవాబు: మీ అమ్మమ్మగారి స్వార్జితమైతే వీలునామా ప్రకారం చెందుతుంది. వీలునామా లేకపోతే మీ నాన్నకి చెందుతుంది. వారసత్వ నిర్ణయం ప్రధానం. ఆమెకు కూతుళ్ళు కాని ఉంటే వారికీ భాగం ఉంటుంది.
ఎస్.హరనాధ్ - బరంపురం (ఒడిసా రాష్ట్రం)
ప్రశ్న: జీవితంలో స్థిరత్వం
జవాబు: కమీషన్ వ్యాపారం- వస్త్ర వ్యాపారం - మెడికల్.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :


ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ