సబ్ ఫీచర్

చిరు వ్యాపారం .. చిగురించే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాపారం చేయాలనే లక్ష్యం, తపన ఉంటే విజయం సాధించటం సులువే. వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు ఎంతోమంది సామాన్య, మధ్యతరగతి గృహిణులు ఆర్థికస్థిరత్వం సాధించేందుకు తపనపడుతుంటారు. సరైన వేదిక, ఆసరా దొరికితే చాలు స్వావలంబన దిశగా అడుగులు వేస్తారు. ఇలాంటి వారికి స్వయం సహాయక సంఘాలు ఆశాదీపంగా నిలిచి వెలుగునందిస్తున్నాయి. చీకటి రోజులను దాటుకుని చిన్న వ్యాపారంతో చిరు వెలుగులోకి వచ్చిన మహిళలు ఎందరో. ఆర్థిక భరోసాతో సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న రాజస్థాన్ మహిళలు వీరు..

ఉగ్మాకన్వార్ నాలుగేళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది. సంవత్సరం తరువాత పెద్ద కొడుకు చనిపోయాడు. ఈ రెండు మరణాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. ఏ పనిచేసినా అందులో కష్టపడటం ఉగ్మాకు తెలుసు. అందుకే పొలం పనులు మానేసి ఇదే కష్టాన్ని స్వయం ఉపాధి కోసం పెడితే ఫలితం ఉంటుందని భావించి మరో ఇద్దరు మహిళలను సాయంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఆహారపదార్థాల ప్యాకెట్లు అందించే చిరు వ్యాపారాన్ని ఆరంభించింది. రోజుకు 40 ఫుడ్ ప్యాకెట్స్ అందించేది. ఒక్కొక్క ప్యాకెట్ ఖరీదు రూ.45లు మాత్రమే. నాలుగు నెలల తరువాత తన టీమ్‌లోని అందరూ వెళ్లిపోగా తాను మాత్రమే మిగిలింది. దీంతో ఆమె చర్భూజా స్వయం సహాయ కేంద్రంలో చేరి సూక్ష్మరుణాన్ని తీసుకుంది. కేవలం రూ.10,000ల రుణాన్ని తీసుకుని అప్పడాలు తయారు చేసి అమ్మటం ఆరంభించింది. మొదటి రెండు నెలలు అంతంత మాత్రంగా ఆదాయం వచ్చింది. ప్రభుత్వ అధికారుల నెట్‌వర్క్ సాయం అందించటంతో అప్పడాలను దుకాణాలకు, హోటల్స్‌కు సరఫరా చేస్తోంది. ఇపుడు తన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల మరో రెండు గ్రామాలకు అప్పడాలను సరఫరా చేస్తోంది. ఇపుడు ఉగ్మా ఆ గ్రామంలో ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు ఉన్న మహిళగా స్వయం సహాయక సంఘాల సాయంతో తనను తాను తీర్చిదిద్దుకుంది.

చిన్న వ్యాపారం.. పెద్ద మార్పు
ఒకేసారి పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి రెండు చేతులా ఆర్జించాలని ఆరాటపడలేదు. చిరు వ్యాపారంతో ఆరంభించిన జీవనం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతే చాలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినట్లేనని భావించింది గీతాదేవి. జై సీతారామ్ స్వయం సహాయక సంఘంలో చేరి తొలిసారి తీసుకున్న రుణంతో టైర్లు పంచర్ వేసే షాపు పెట్టుకుంది. ఆ ఊళ్లో అలాంటి దుకాణం లేకపోవటంతో గీత వ్యాపారం సజావుగానే సాగుతుంది. రెండవసారి ఇచ్చిన రుణంతో జనరల్ స్టోర్స్ దుకాణాన్ని ఆరంభించి సరుకులు అమ్ముతుంది. ఇపుడు రెండు చిరు వ్యాపారాలతో తన కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుందని అంటుంది. జబ్బుపడిన భర్తకు మందులు కొనివ్వగలుగుంది. పిల్లలు చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఇలా చిరు వ్యాపారంతో ఆర్థిక ఆశలు చిగురుస్తూ ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలుదొక్కుకుంటున్నాయి.