సబ్ ఫీచర్

వంచన మిగిల్చిన వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నారై సంబంధాలతో సమస్యలు * మోసపోతున్న వధువులు * పంజాబ్‌లో ఈ కేసులు ఎక్కువ

విదేశాల్లో ఉద్యోగం అంటే ఆర్థికంగా ఫరవాలేదన్న ధైర్యం ఉంటుంది. తన కూతురికి మంచి సంబంధం చేయాలనుకోవడం తల్లిదండ్రులకు మామూలే. అలా ఆలోచించి ప్రవాసం ఉంటున్న యువకులతో పెళ్లిచేస్తే అందుకు విరుద్ధమైన అనుభవాలు ఎదురై కష్టాలపాలవుతున్న కుటుంబాలకు లెక్కలేదు. ముఖ్యంగా పంజాబ్‌లో ఇలా మోసపోయినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కమల్జిత్ కథ వింటే అసలు విషయం తెలుస్తుంది.
విదేశీ సంబంధాలంటూ ఆడపిల్లలను లక్షలాది రూపాయలు కట్నం కానుకలు ఇచ్చి మోసపోయిన బాధితులు పంజాబ్‌లో ఎక్కువగా ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇలాంటి విదేశీ సంబంధాల పేరుతో మోసపోయినవారు దాదాపు 15000 మంది వరకు ఉన్నట్లు అధకారిక లెక్కలు చెబుతున్నాయి. నెలకు ఇలాంటి కేసులు దాదాపు 15 వరకు తన వద్దకు వస్తున్నట్లు గత పదేళ్ల నుంచి ఇలాంటివారికి న్యాయపరమైన సాయం అందిస్తున్న మిసెస్ రామూవాలియా చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇలాంటి మహిళలకు దల్జిత్ ఖౌర్ అనే న్యాయవాది తోడ్పాటుతో న్యాయ సాయం అందిస్తున్న రామూవాలియా మహిళల హక్కుల పరిరక్షణ కోసం పరిశ్రమిస్తున్నారు. ఇటీవలనే ఇటువంటి అభాగ్యునులతో సమావేశం నిర్వహించి ఎలాంటి సాయం అందించాలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదిఏమైనా పదికాలలపాటు పచ్చగా నిలవాల్సిన సౌభాగ్యం కన్నీటిధారల్లో కలసిపోయి ఇలా ఒంటరిగా ఉండిపోతున్నవారు ఎందరో.

‘నేను గర్భవతిని అతను నన్ను వదలి వెళ్లేటప్పటికీ. అప్పటికే పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డకు తండ్రయిన అతను మళ్లీ కట్నం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ఇంట్లోవాళ్లకు ఇష్టం లేదని వదిలేసి వెళ్లిపోయాడు. పురిట్లోనే పుట్టిన ఆడపిల్లకు ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వైద్యఖర్చులకు కూడా పైసా పంపలేదు. చివరకు బిడ్డను చేతులారా పోగొట్టుకున్నాను. ఇరవై ఏళ్లయింది. లక్షలాది రూపాయలు కట్నం కింద ఇచ్చి భర్త వదిలేసిన భార్యగా పదహారేళ్ల నుంచి బతుకుతున్నాను’ అంటోంది ఆమె. ఇది కమల్జిత్ కన్నీటి కథ. కమల్జిత్‌ను ఇటలీలో ఉద్యోగం చేసే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.

‘విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడంటే ఆనందంతో అమ్మాయిని ఇచ్చి చేశాం. లక్షలాది రూపాయలు కట్నంగా ఇచ్చాం. ఇండియా వదలి వెళ్లేటప్పుడు మాత్రం ‘నాకు విదేశీ అమ్మాయితోనే పెళ్లయింది. నాకు కొడుకు, కూతురు ఉన్నారు’ అని చెప్పి వెళ్లిపోయాడు. 16 ఏళ్ల నుంచి అతని వద్ద నుంచి కబురే లేదు. ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నాం. అలా ఉన్నాయి ఇక్కడి చట్టాలు’ అని వాపోతున్నాడు అరవై ఏళ్ల వృద్ధుడు దర్శన్.

వంచనకు గురైన బాధితులకు
న్యాయ సాయమందిస్తున్న
మిసెస్ రామూవాలియా