సబ్ ఫీచర్

పర్యాటకులకు కోరుకున్న సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్నామ్‌పెన్.. కంబోడియా రాజధాని. పర్యాటకులకు స్వర్గ్ధామంగా నిలిచే కంబోడియాలో ఈ నలుగురు అక్కాచెల్లెళు ల వినూత్నంగా ఆలోచించారు. టూరిస్టు గైడ్లుగా మారారు. బైక్‌ల మీద పర్యాటకులను వారు కోరుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్లి చూపిస్తారు. నిర్భయంగా, నిజాయతీగా వీరు చేస్తున్న సేవలకు ప్రపంచ వ్యాప్తంగా మెయిల్స్ ద్వారా అభినందనల వర్షం కురుస్తుంది.
ఫ్నామ్‌పెన్ నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. వీరికి రవాణా, హోటల్ సౌకర్యాలు, చారిత్రక ప్రదేశాలను చూపించి, విశిష్టతను తెలిజేయడం ఇప్పటివరకూ పురుషులే చేసేవారు. రెనూ చియా, రెక్సిమీ ,చియాలు, హర్మ్ ఈ నలుగురు అక్కా చెల్లెళ్లతో పాటు మరో యువతి పర్యాటకులకు కోరుకున్న సాయం అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఇతర దేశాల్లో ఉన్నట్టే ఇక్కడ మహిళా టూరిస్టు గైడ్ల అవసరం ఉందని భావించారు. నిజానికి కంబోడియా దేశంలో ఇలా గైడ్లు ఉండడం అరుదు. ఈ అక్కాచెల్లెళ్లు పర్యాటకుల సౌకర్యార్థం ‘ద మోటార్ గర్ల్ టూర్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌తో పర్యాటకుల వివరాలు తెలుసుకుని, అవసరమైన ప్రదేశాలు చూపిస్తున్నారు. ఇందుకు కొంత మొత్తాన్ని ఛార్జి చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
విమర్శలు వెల్లువెత్తుతున్నా వెరవని వైనం
ఎరుపు రంగు టీషర్ట్, జీన్స్ ధరించి రోజూ పర్యాటకులను వారు చూడాల్సిన ప్రాంతాలకు తీసుకువెళ్లి చూపిస్తారు.
వీరి ఉపాధిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. 40 కిలోలు ఉన్న రెనూ చియా ఒక పర్యాటకుడిని ఎలా తన స్కూటర్‌పై తీసుకువెళ్తుంది? అని కొంతమంది మొదట్లో హేళన చేశారు. అయితే, ఆ విమర్శలను తిప్పికొడుతూ తమ పని తాము చేసుకుంటున్నారు. మగ పర్యా టకులు వెకిలి చేష్టలు చేయకుండా కొన్ని నిబంధనలు పెట్టారు. స్కూటర్ వెనకాల కూర్చున్న టూరిస్ట్ తమపై చేతులు పెట్టకుండా, స్కూటర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హేండిల్‌ను పట్టుకోవాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేస్తారు.
నిజానికి మాకీ మోటార్ టూరిస్ట్ గైడ్ ఆలోచన మా ఆంటీవల్లనే వచ్చింది. థాయిలాండ్‌లో మహిళా టూరిస్టు గైడ్లు ఉంటారని ఆమె మాకు ఓ సందర్భంలో చెప్పింది. అప్పుడే మా ఆలోచనకు బీజం పడిందని చెప్పారు. దీనినే వృత్తిగా స్వీకరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై అధ్యయనం చేశాం. కంబోడియాన్ పర్యాటక శాఖ లెక్కల ప్రకారం 2015లో దాదాపు ఐదు మిలియన్ (50 లక్షలు)మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శిస్తారని తెలుసుకున్నాం. పర్యాటకుల అభిరుచి మేరకు బైక్‌లపై తీసుకుపోయి, కోరుకున్న ప్రదేశాలను చూపించి, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను వివరిస్తాం. తమ వాహనాలపై ఎంతో ఉల్లాసంగా, భద్రంగా తీసుకువెళ్తుంటామని, మాకూ కొంతమేర నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పారు. తనకు హైస్కూల్ స్థాయినుంచే స్కూటర్ నడపడం తెలుసు. ఇంగ్లీష్ భాష తెలియడం మరో ప్లస్ పాయింట్ అయిందని రెనూ చియా వివరించింది. ఒకేవేళ నగరం వెలుపలకు, రాత్రి పర్యటనలు పడితే, తామంతా కలిసి వెళ్తుంటామని, దీనివల్ల తమకు భద్రత ఉంటుందని తెలిపింది. 2016లో దీనిని ప్రారంభించామని, పర్యాటకుల్లో 50 శాతం మంది పురుషులే వస్తున్నారని చెప్పారామె.
చానెల్ సింక్ల్కెర్ అనే 31 ఏళ్ళ మహిళా న్యాయవాది 2016 మొదటిసారిగా ఫ్నామ్‌పెన్‌లో పర్యటించినపుడు మమ్మల్నే సంప్రదించింది. మా సర్వీసు ఆమెకు ఎంతో నచ్చి ప్రశంసించినట్లు, ఇటువంటి పర్యాటకులు మరింత ఎక్కువగా రావాలని మేము కోరుకుంటున్నామని, కానీ, ఇప్పటివరకు 50 శాతంమంది పురుషులే వస్తున్నారని చెప్పింది. కొన్నిసార్లు కొంతమంది టూరిస్టులు డేటింగ్‌కు ఆహ్వానించే సంఘటనలు ఎదురైనా సున్నితంగా తిరస్కనించి ముందుకు సాగుతున్నారు. వీరి సేవలకు ప్రపంచ వ్యాప్తంగా మెయిల్స్ ద్వారా అభినందనల వర్షం కురుస్తోందని చియా సంబరపడిపోతోంది.

తొలుత ఈ వృత్తిని స్వీకరించటానికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారిని ఒప్పించి పర్యాటకుల అభిరుచి మేరకు బైక్‌లపై తీసుకుపోయి, కోరుకున్న ప్రదేశాలను చూపించి, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను వివరిస్తాం. మాకూ కొంతమేర నాలెడ్జ్ పెరుగుతుందని చియా అభిప్రాయం.

-జి.కల్యాణి