Others

బాబోయ్! దెయ్యాల మేడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెయ్యాల నమ్మకం, భయం- రెండూ మన దేశంలోనే కాదు- పాశ్చాత్య దేశాలలోనూ, యితర దేశాలలలోనూ కూడా అమితమే! బ్రెజిల్‌లో కొత్తగా అధ్యక్షుడైన శ్రీ మైఖేల్ టెమెర్‌గారు గృహప్రవేశం చేసిన పది రోజుల్లో యిల్లు వదిలిపెట్టి- సకుటుంబంగా పరుగులు తీశాడు. మైఖేల్‌గారు తాత్కాలిక అధ్యక్షుని హోదాలో అల్వోరాడో పేలెస్‌లో సంబరంగా ప్రవేశం చేశాడు. కానీ, ఆ రాత్రినుంచే నిద్ర పట్టక, భార్యాభర్తలు అల్లాడిపోయారు. కాకపోతే, వాళ్ల ముద్దుల కుమారుడు ఏడేళ్ల బాలుడు ఆ సువిశాల ఆలీషాన్ బంగ్లాలో ఒకటే కేరింతలతో పరుగులు తీస్తూ ఆడుకున్నాడు.
‘‘ఆల్వోరాడో’’ అంటే సుప్రభాతమే అని అర్థం. ఆ మహా భవనంలో ఫుట్‌బాల్ మైదానం వుంది. స్విమ్మింగ్ పూల్స్ వున్నాయి. చర్చ్ వుంది. వైద్య కేంద్రం సహా సకల సుఖ సౌకర్యాలూ గలవు! కానీ, అధ్యక్షులవారి భార్య ‘‘దెయ్యాలు కూడా వున్నాయి రుూ కొంపలో బాబోయ్’’ అంటోంది. టిమెర్‌గారి వయసు 76 సంవత్సరాలు. కానీ, అతని ముద్దుల భార్య మర్సీలా 33 సంవత్సరాల యువతి. ఒకటే బిడ్డ, ఏడేళ్లవాడు వాళ్లకి.‘‘ఏమిటో వింత భయాలు కలుగుతున్నాయి. దెయ్యాలు వున్నట్లుగా- భయం భయంగా వుంది’’ అంటూ ఆమె మత గురువునొకర్ని పిలిపించి- మంత్ర తంత్ర పూజలు గట్రా చేయించింది. కానీ ‘్భయం’ పోలేదు. ‘‘అసలు నా కారుని ఇంటికి దెయ్యం నడిపిస్తోందా అన్నట్లుంది’’ అంటాడు తాత్కాలిక అధ్యక్షుడు- ఇప్పటిదాకా ఉపాధ్యక్షుడు అయిన మైఖేల్ మహాశయుడు. అంతే.. దెబ్బకి యిల్లు వదిలి మళ్లీ పాత యింటికే వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ, రుూయనగారి జాగాలో ఉపాధ్యక్షుడు ఎవరూ యింకా రాకపోవడంతో పాత భవనం అలాగే, ఖాళీగా, ‘స్వాగతం’ అంటూ వున్నది. హోదా మాట దేవుడెరుగు- ముందు నిద్రపట్టాలిగా?!..

veeraji.pkm@gmail.com