భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీర్ మహమ్మద్ యాఖూబ్ అలీ, అనంతపురం (ఆంధ్ర)
ప్ర:జ్యోతిష్కులు యు.పి.లో హంగ్ వస్తుందనీ, ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని చెప్పారు. ఆ జోస్యం పూర్తిగా తప్పింది కదా!
సమా:జ్యోతిష్కుడు చేసిన తప్పును జ్యోతిష శాస్త్రానికి ఆపాదించకూడదు. లౌకిక ప్రయోజనాలకోసం, యాదృచ్ఛికంగా జరిగితే తమకు పేరు వస్తుందన్న దురాలోచనతోనో- కాదంటే ఎవరో ప్రాంప్టింగ్ చెప్పిస్తేనో కుహనా జ్యోతిష్కులు చెప్పిన జ్యోతిష్యమది- వారంతా ఇప్పుడు గణపతి బొడ్లో వేలుపెట్టిన దొంగల్లా గప్‌చిప్ అయ్యారు. అపూర్వమైన దైవశాస్త్రాన్ని అల్పమైన బెట్టింగ్ సరుకుగా మార్చడం స్వార్థపరుల లక్షణం- మన దురదృష్టం.

డి.విజయలక్ష్మి, విజయనగరం (ఆంధ్ర)
ప్ర:ఋణబాధలు - అనేక సమస్యలు తీరేదెలా?
సమా:ముందుచూపు లేకుండా ఆడంబరాలకోసమో స్థిరాస్తుల కోసమో- శుభకార్యములవల్లనో ఋణగ్రస్తులయ్యారు. మారేడు దళాలతో ఈశ్వరుని అభిషేకించండి. శుభం జరుగును.

కె.వి.లక్ష్మి, బందరు (ఆంధ్ర)
ప్ర:మాది పెద్ద కుటుంబం. నాకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నవి. కాని నాకు వివాహం పట్ల ఆసక్తి లేదు. కారణం ఏమిటి?
సమా:మీకు జన్మలగ్నంలో రవి- రాహు- చంద్ర శుక్ర సంయోగం ఉంది. వృషభం రాశి- లగ్నం- అమావాస్య తెల్లవారు జామున కనుక క్షీణ చంద్రుడు - శుక్రవ్ఢ్యౌమి- రవి- రాహుల సంయోగం మహత్వాకాంక్షను- అహంకారాన్ని కల్గిస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కోరిక కారణంగా వివాహ బంధం పట్ల విముఖంగా ఉన్నారు. మమతా బెనర్జీ - జయలలిత వంటి ప్రముఖుల జాతకాలకు కూడా ఇవే కారణాలు. కాల సర్ప దోష శాంతి చేయించండి. సప్తమ కేతు దోషం కూడా కారణం.

టి.పద్మావతి, సికింద్రాబాద్ (తెలంగాణ)
ప్ర:నాకు కలిగే అనారోగ్యాలకు పరిష్కారం?
సమా:తల- పాదాలు- కాలేయ సంబంధ సమస్యలుంటాయ. జాగ్రత్తగా ఉండండి. కొన్ని స్ర్తిల విషయంలోవి కూడా ఉన్నాయి.

శశిశేఖర్ ఖటువా, జూబ్లీహిల్స్ (హైదరాబాద్)
ప్ర:ఇస్ సాల్ మే మేరా వివాహ్ హోనేకా హై - ఆనేవాలీ కన్యా సే మేరా జీవన్ కైసా రహీగా-
సమా:ఉల్జన్ మే రహనా ఆప్ కా స్వభావ్ హై- హిమ్మత్ - హిక్మత్ వాలీ కన్యా ఆప్‌కో మిలేగీ-

సి.రామకృష్ణ, రాజమండ్రి (ఆంధ్ర)
ప్ర:ఇటీవల తిరుపతి వెళ్ళాను. కొండమీద సత్రంలో తలుపు పక్కనే బాగ్ పెట్టాను. అందులోని డబ్బు 6000 ఎవరో తస్కరించారు. దేవుని కొండమీద ఇలా జరగటం బాధ అనిపించింది. దీనికి కారణమేమిటి?
సమా:మీరిచ్చిన సంఖ్య- మీరు వ్రాసిన త్తరంలోని దస్తూరీని బట్టి చూస్తే- మీరు సింహ-కన్యారాసులవారిగా కనిపిస్తున్నారు. శని సంచారం మార్పు మీ గ్రహచారాన్ని మార్చింది. సహజంగా మీరు సెల్ఫ్ రైజియస్ స్వభావులుగా కనబడుతున్నారు. మహాక్షేత్రాలలో భక్తులతోబాటు చోరులూ ఉంటారు. ఇందులో దైవాన్ని ప్రస్తావించటం అసంగతం.

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం (తూ.గో)
ప్ర:ఋణబాధలు - ఆరోగ్య సమస్యలు- పుత్రికా సంతానమే- అందరూ బాగానే ఉన్నారు. పుత్ర సంతానం లేదు. భార్య ఆరోగ్యం బాగులేదు. పరిష్కారం చెప్పండి. ఏ వ్యాపారం చేయమంటారు?
సమా:ఋణబాధలు మీకే కాదు చాలామందికి ఉంటాయి. ఆధునిక కాలంలో ఆడంబర జీవనంలోని వస్తువులు- అత్యవసర వస్తువులుగా మారిపోయాయి. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసారు, శుభం. ఇంతవరకు చేసిన వ్యాపారమే చేయండి. ఆర్థిక లాభం కోసం తేనెలో ముంచిన మారేడు దళాలతో శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించి స్వీటు నివేదన చేయండి.

జి.అరుణాదేవి, భద్రాచలం (తెలంగాణ)
ప్ర:ఆరోగ్య విషయంలో ఎం చేయమంటారు?
సమా:ఉదర సంబంధంగా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజూ ఒక ఐదు మొలకెత్తిన శనగలు తినండి.

సిహెచ్.మారుతీ రామారావు, నూజివీడు, కృష్ణా
ప్ర:ప్రమోషన్ వస్తుందా?
సమా:జూలై- ఆగస్ట్‌లలో అవకాశం ఉంది.

ఎస్.నాగేశ్వరరావు, నరసారావుపేట (గుంటూరు)
ప్ర:స్వాతి నక్షత్రం- ఏలిననాటి శని పోయినా బాధలు తగ్గలేదు.
సమా:దశా ప్రకారం కూడా జాతకం జ్యోతిష పండితులకు చూపించండి. తగు శాంతి పూజలు చేయించండి!

గుండా శివప్రసాద్, మీరజ్ (మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లా)
ప్ర:కృత్తికా నక్షత్రం- మొదటిపాదం- ఉద్యోగ స్థానచలనం- అభివృద్ధి ఎలా ఉంటుంది?
సమా:నవమ శని- మీది మేషరాశి- జూన్, జూలైల వరకూ సావధానంగా ఉండండి.

బి.వి.శివాజీ, అనకాపల్లి (ఆంధ్ర)
ప్ర:ఉద్యోగం- వివాహం- క్రీడలలో అభివృద్ధి-
సమా:జన్మ స్థానానానికి దూరంగా దక్షిణ దిశలో క్రమ క్రమంగా అభివృద్ధికి రాగలరు. క్రీడల్లో పరిచయ ప్రవేశాలవరకే కీర్తి.

హరికృష్ణ పిళ్ళా - విజయవాడ (ఆంధ్ర)
ప్ర:ఒకనాడు నేను గౌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి అతి సన్నిహితుణ్ణి. వారితో దిగిన ఫొటో పంపిస్తున్నాను. కోట్ల వ్యాపారం చేశాను- ప్రస్తుతం ఏమీ లేదు. దేవాలయం కట్టించాను. వివాదాస్పదంగా మారింది. భవిష్యత్తు గురించి ఆలోచన-
సమా:మీ ఫొటో పేపరు కటింగ్ మీరు గౌ. మోదీగారికి ఎంత సన్నిహితులో తెలియజేస్తోంది. కాల చక్రంలో ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే సామెత మీకు తెలియనిది కాదు. భాజపా రాజకీయాలలలోనే ఉండండి. భవిష్యత్తు ఆశాజనకమే.

టి.సత్యనారాయణ, గుంతకల్లు, అనంతపురం
ప్ర:జాతక పరిశీలన - ప్రభుత్వోద్యోగం- యోగం ఎలా ఉన్నాయ?
సమా:మీకు ప్రభుత్వోద్యోగ యోగం ఉంది.

బొడ్డుపల్లి క్రాంతికుమార్, పెద్దపల్లి (తెలంగాణ)
ప్ర:ఏ రంగంలో స్థిరపడగలను?
సమా:వ్యాపార రంగం- కమ్యూనికేషన్ వస్తువులు

నరసారెడ్డి, బుసాపురం (కర్నూలు, ఆంధ్ర)
ప్ర:వివాహ విషయం?
సమా:మే-జూన్‌లలో పూర్తి అవకాశాలు ఉన్నాయి.

టి.ప్రశాంత్, బరంపురం (ఒడిసా స్టేట్)
ప్ర:ఆర్థిక బాధలు ఎప్పడు తీరతాయి? స్వంత గృహయోగం ఉందా?
సమా:ఆర్థిక విషయాలలో కచ్చితంగా ఖర్చులో అదుపు- ఉన్నంతలో పొదుపు- పొదుపు చేసిన సొమ్మును తెలివైన లాభసాటి స్కీముల్లో మదుపు చేయండి. కులదైవాన్ని శ్రద్ధగా నియమంగా పూజించండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ