భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.దుర్గాదేవి, కాకినాడ (ఆంధ్ర)
ప్ర:కుటుంబంలో చాలా సమస్యలు- ఆర్థిక బాధలు- పరిష్కారం చెప్పండి.
సమా:ఆధునిక కాలంలో అనుబంధాలకంటే ధనబంధాల ప్రాధాన్యం పెరిగిపోయింది. ఉన్నవారికి ఉన్నదానికోసం కలహం- లేనివారికి ‘లేమి’ కారణంగా కలహం- కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజూ అరగంటైనా దైవధ్యానం చేయాలి. ప్రయత్నిస్తే ధన సంపాదనకు ఈ కాలంలో అనేక సక్రమ మార్గాలున్నాయి. కుల దైవాన్ని భక్తితో సేవించండి- ప్రయత్న శీలత్వం అలవరచుకోండి.
పి.నరసింహారావు, జగ్గయ్యపేట (ఆంధ్ర)
ప్ర:నాకు ప్రభుత్వోద్యోగం లభిస్తుందా?
సమా:ప్రభుత్వ సంబంధంగల సంస్థలో తప్పక వచ్చే సెప్టెంబర్‌లో ఉద్యోగం లభిస్తుంది.
బొడ్డు రామకృష్ణ, చిరతపూడి (తూ.గో)
ప్ర:కొత్త ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము?
సమా:జూలై-ఆగస్టులలో ఆ దిశలో ప్రయత్నలు మొదలౌతాయి.
కోట లక్ష్మి, కావలి (నెల్లూరు)
ప్ర:మా పాపది ఆశే్లషా నక్షత్రం- జన్మ తేది 07-04-1998- 5 గం 30 ని సమయం. శారీరకంగా ఎదుగుదల లేదు. మాటలు కూడా స్పష్టంగా రావటంలేదు.
సమా:ఆందోళన పడకండి. శారీరకంగా చురుకుగా లేదేమోకాని మానసికంగా చాలా చురుగ్గా ఉంటుంది. వయసు వచ్చినకొద్దీ అభివృద్ధి కనిపిస్తుంది. జాతకరీత్యా పాదాలలో బలహీనత- విటమిన్ బి కాంప్లెక్స్ లోపమూ ఉంటుంది. దానికి తగు చికిత్స చేయించండి. దైవసేవగా కర్నాటకలోని ‘మూకాంబికా’ దేవాలయానికి తీసుకువెళ్లండి.
(పేరు చెప్పటం ఇష్టంలేదు), చందానగర్, హైదరాబాద్
ప్ర:ఎదిగిన కూతురు రహస్యంగా పెళ్లిచేసుకున్నది. ఆ వివాహం చెల్లుతుందా?
సమా:ఇద్దరూ మేజర్లే అయి, ఏ విధమైన (ఒత్తిడి) ‘కోఎర్షన్’ లేకుండా పరస్పర అంగీకారంతో చేసుకుంటే పూర్తిగా చెల్లుతుంది. అంగీకరించి ఆదరించటమే మీరు చేయగలిగేది- భవిష్యజ్జీవితం మీరు కాని ఎవరు కాని నిర్దేశించలేరు.
నేసుగాంధి, అవనిగడ్డ, ఆంధ్ర
ప్ర:అసలు పేరు సీతారామాంజనేయులు- గాంధీగారి మార్గాన నడచిన కారణంగా నన్ను గాంధీగానే పిలుస్తారు. యాభై సంవత్సరాలు వచ్చినా నాకు ఇల్లు లేదు. ఆర్థిక బాధలు, పరిష్కారం చెప్పండి.
సమా:బయట పల్లకీ మోత గలవారికి ఇంట్లో ఈగల మోతే. ‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత’ అని అందుకే సామెత చెప్పారు. నిజమైన గాంధీ మార్గాన్ని అనుసరించినవారు నిజమైన గాంధీ పేదరికమే అనుభవిస్తారు. గాంధీ పేరును తెలివిగా ఉపయోగించుకున్నవారు రాజ్యాలేలుతారు. వివరంగా విజ్ఞప్తి చేస్తూ మోదీగారికి లేఖ వ్రాయండి. శుభం జరగవచ్చు!
ఎమ్.హేమంత్‌కుమార్, విజయవాడ (కృష్ణా)
ప్ర:రియల్ ఎస్టేట్ వ్యాపారం యోగిస్తుందా?
సమా:్భగస్వామ్యం లేకుండా చేస్తే యోగిస్తుంది
చేతనభట్ల సుబ్రహ్మణ్యశాస్ర్తీ, పామర్రు - ఆంధ్ర
ప్ర:పురోహిత పుత్రుని వివాహం- గృహ వాస్తు-
సమా:వివాహం ఇంకా ఆలస్యం- వాస్తు రీత్యా మీ యింట్లో ఆగ్నేయ వాయవ్యాలు దోషంగా కనబడుతున్నాయి.
ఎమ్.సూర్యనారాయణమూర్తి, కాకినాడ (తూ.గో)
ప్ర:నా కుమారుడు- కూతుర్లమధ్య ఆస్తి తగాదాలు- నేను మగ పిల్లలకు ఇచ్చిన ఇంటి వాటా ఆడపిల్లలు ఇవ్వనివ్వటంలేదు. ఏం చేయమంటారు?
సమా:ఇంటి వాటా పూర్తిగా పంచిన తరువాతనే అడ్డుగోడలు పెట్టించిన తరువాతనే పొసెషన్ ఇవ్వాల్సింది- ప్రస్తుతం మీ పొసెషన్‌లో ఉంటే అది పూర్తిగా మీ స్వార్జితమైతేనే మీ వీలునామా చెల్లుతుంది.
కె.సాయి చైతన్య, ఎమ్మిగనూరు (ఆంధ్ర)
ప్ర:ప్రభుత్వోద్యోగం-
సమా:ఆగస్టు - సెప్టెంబర్‌లలో కళారంగ సంస్థల్లో ఉద్యోగం దొరికే అవకాశం వుంది.
కె.పాపారావు, మల్కాపురం, ఆంధ్ర
ప్ర: గురువుగారూ! నేను మా స్నేహితునికి డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఐదు సంవత్సరాలనుండి ఇవ్వటంలేదు. ఏం చేయమంటారు?
సమా:ఇతరులకు ఇచ్చిన డబ్బు రాబట్టుకోవటంలో చాలా సహనం ఉండాలి. పెద్దలు చెప్పిన ఉపమానం ఏమిటంటే ‘బరుసు కంపలమీద బట్టలారేసినట్టు’ అని. తొందరపడి తీస్తే చిరిగిపోతాయి. ఓపిక పట్టండి.
కె.వి.లక్ష్మి, బందరు (ఆంధ్ర)
ప్ర:మొన్నటి నా ప్రశ్నకు సవివరంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దయచేసి పరిష్కార శాంతులు- పూజా కార్యక్రమాలు తెలియజేయండి.
సమా:ఆ వివరాలు పత్రికా ముఖంగా తెలియజేయటం సాధ్యంకాదు. జాతక కీలకాంశాలను బహిర్గతం చేయటం మంచిది కాదు. వ్యక్తిగతంగా వ్రాయండి. లేదా వ్యక్తిగతంగా సంప్రదించండి.
వి.సౌమ్య, కొండపల్లి, ఆంధ్ర
ప్ర:నేను ఎంతగా చదివినా పరీక్షల సమయంలో గుర్తుకురావటంలేదు. కారణం, పరిష్కారం చెప్పండి.
సమా:చదివేటప్పుడు పరీక్ష దృష్ట్యా కాకుండా సబ్జెక్ట్ ప్రాధాన్యంగా చదవండి. పరీక్ష సమయంలో పరీక్షా పత్రం చేతికి రాగానే వెంటనే చదవకండి. కాసేపు కళ్ళు మూసుకొని దైవధ్యానం చేయండి. ఆ తరువాతనే పరీక్షా పత్రం చదవండి. మార్పు కనబడుతుంది.
ఎన్.రమాజ్యోతి, బెంగుళూరు, కర్నాటక
ప్ర:సార్! మిమ్మల్ని వ్యక్తిగతంగా హైదరాబాద్‌లో కలిసి చర్చించిన తరువాత మీ సలహాల కారణంగా మా దాంపత్యంలో చాలా మంచి మార్పు వచ్చింది. జ్యోతిషాన్ని నమ్మని మావారు మరోసారి వ్యాపారం విషయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ధన్యవాదాలు.
సమా:శుభం భవతు - సర్వేజనాస్సుఖినోభవంతు
రమేశ్ అగర్వాల్, జాల్నా, మహారాష్ట్ర
ప్ర: పండిట్‌జీ! ‘జైసా ఆప్ కహ చుకే హై, వైసే హీ దిశాసే, ఔర్ అక్షర్‌సే హమారా దామాద్ ఖాయమ్ హువాసై, ధన్యవాద్-
సమా:బహుత్ ఖుషీ కీ ఖబర్ సునామీ ఆప్‌నే భగవాన్ ఆప్‌కో భలా కరే-
ఎస్.రాజేశ్వరరావు, కరీంనగర్ (తెలంగాణ)
ప్ర:నాకు వివాహ యోగం ఎప్పుడు-?
సమా:త్వరలోనే కొన్ని దినాలలోనే తూర్పు దిశ నుండి సంబంధం నిర్ణయం కాగలదు.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ