సబ్ ఫీచర్

ఆ 3రోజులూ సెలవు దొరికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో ఇటీవలనే మహిళల ప్రసూతి సెలవు ఆరునెలలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల తరువాత అమ్మకు సెలవు దక్కింది. అలాగే నెల నెలా పలుకరించే ఋతు సెలవు కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది. ఎందుకంటే ఇటలీలో ఉద్యోగం చేసే మహిళలకు ఋతు సెలవు మంజూరు చేస్తే బిల్లు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ మూడు రోజులూ విపరీతమైన
మానసిక ఒత్తిడి
నెలసరి సమయంలో ఆ మూడు రోజులూ మహిళలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగిని పరిస్థితి అయితే వేరే చెప్పనక్కర్లేదు. పెళ్లికాని యువతుల్లో అధికశాతం మంది ఆ మూడు రోజులు కూడా భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పి భరించలేక సిక్‌లీవ్ తీసుకోవాలంటే వీలుకాదు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినుల పరిస్థితి అయితే మరీదారుణంగా ఉంటుంది. ఆ బాధ గురించి చెప్పలేక, సెలవు అడగలేక అనేకమంది నరకయాతన అనుభవిస్తుంటారు.
ఏయే దేశాల్లో అమలవుతుంది?
జపాన్‌లో 1947లోనే ఇలాంటి సెలవును ఉద్యోగినులకు మంజూరుచేశారు. ఇండోనేషియాలో రెండు రోజులు పాటు సెలవు ఇస్తారు. సౌత్ కొరియాలో ఈ మూడు సెలవులు కలుపుకుని మొత్తం 33 హెల్త్‌లీవ్స్ ఉద్యోగినులకు మంజూరుచేస్తారు. స్పోర్ట్‌వేర్ కంపెనీ ‘నైక్’ సైతం తన ఉద్యోగినులకు 2007 నుంచే ఈ సెలవును మంజూరు చేస్తోంది. మరి మనదేశంలో ఇలాంటి సెలవు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువస్తే బాగుంటుందని ఉద్యోగినులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బిల్లు గనుక వస్తే ప్రైవేటు కంపెనీలు ఆడవాళ్లకు బదులు మగవాళ్లను తీసుకుంటాయనే భయం కూడా లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ హర్మోన్లు అధికశాతం ప్రభావం చూపే ఆ మూడురోజులు మహిళల భావోద్వేగాలు సైతం అదుపులో ఉండలేని పరిస్థితి వారిలో నెలకొంటుంది.