మెయిన్ ఫీచర్

కథల కాణాచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ కుర్రాళ్లవేదిక యువ రచయితలకు
ఆర్థిక అవకాశాలు ఆన్‌లైన్ సాహిత్య సంపుటి కహానియా

కథ చెబుతాం ఊ కొడతారా? ఉలిక్కిపడతా రా? అని అడుగుతున్నారు ఈ హైదరాబాద్ కుర్రా ళ్లు. ఒక్కసారి మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే మంచి మంచి కథలు చెబుతాం. అలాగే మీరు చెప్పే కథలను కూడా వింటానికి ‘కహానియా’ రెడీగా ఉందంటున్నారు. ఇంతకు ఈ కహానియా (ర్ఘ్ద్ఘీశజక్ఘ.ష్యౄ) గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చదవండి.
కథలకు, భాషకు ప్రాణంపోయాలనే తపనతో
పల్లవ్, దేవేందర్, జశ్వంత్ ముగ్గురూ హైదరాబాదీలు. భాషంటే వీళ్లకి ప్రాణం. మాతృభాషను బతికించుకోవాలని ఈ యువకుల తాపత్రయం. యువ రచయితలకు, కథకులకు ఒక చక్కటి వేదికంటు లేకుండా పోయింది. దీన్ని గమనించిన హైదరాబాద్ కుర్రాళ్లు కహానియాను స్టార్ట్ చేసారు. అమెరికాలో ఐదు లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం చేస్తున్న పల్లవ్ కథలు విపరీతంగా చదువుతాడు. ఇతని ఆలోచనల నుంచి పుట్టిందే కహానియా. ఇతనికి చిన్ననాటి స్నేహితులు దేవేందర్ గోనా, జస్వంత్ తోడయ్యారు.
వివిధ భాషల కథలు, కవితలు
కహానియా వెబ్‌సైట్‌లో మొత్తం పదకొండు భాషల కథలు, కవితలు అందుబాటులో ఉన్నా యి. కామిక్, ధ్రిల్లర్, మైథాలజీ, డ్రామా, ఫిక్షన్, పొయిట్రీ..ఇలా అన్ని రకాల సాహిత్యం ఇందులో దొరుకుతుంది. ఆండ్రాయిడ్ యాప్ కూడా ప్రారంభించారు. త్వరలో ఐవోఎస్ యాప్ తీసుకొచ్చారు. పుస్తకం చదివే ఓపిక లేనివారు వెబ్‌సైట్‌లో ఉన్న చిన్న బటన్‌ను నొక్కితే ఓ వాయిస్ ఓవర్ పుస్తకాన్ని చదివి వినిపిస్తుంది. రాసిన రచయితతో పాటు వాయిస్ ఓవర్ కళాకారులకూ కమిషన్ అందుతుంది. ఈ వెబ్‌సైట్ వేదికగా పుస్తకప్రియులు ఎక్క డ ఉన్నా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. పాఠకులకే కాదు రచయితలకు కూడా ఇది మంచి వేదిక. రెండేళ్లలో ప్రపంచంలోని వివిధ భాషల పుస్తకాలను, సాహిత్యాన్ని కహానియా ద్వారా భారతీయులకి అందించాలన్నదే వీళ్ల లక్ష్యం. భారతీయ సాహిత్యపు వైవిధ్యాన్ని ఇంగ్లీష్ లో ప్రపంచానికి అందించడానికి కూడా కృషి చేస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో కొత్త రచనలు, కామి క్స్, ఆడియో కథల్లాంటివి కూడా తీసుకువచ్చే ఆలోచన వుందంటున్నారు సీఇఓ పల్లవ్.
తెలంగాణ ప్రభుత్వం అండదండలు
కహానియా స్టార్టప్‌కు తెలంగాణ సర్కార్‌నుంచి సంపూర్ణ సహకారం లభించింది. టీహబ్ ద్వారా కహానియా టీంకు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో బిజినెస్ పదిమందికీ తెలిసింది. అటు తెలంగాణ భాషా సంఘం ప్రోత్సాహం కూడా దొరికింది. ప్రభుత్వం వేస్తున్న సంకలనాలన్నీ కహానియా డాట్ కామ్‌లో ఉన్నాయి. ప్రత్యేకంగా బుక్‌షాపులకు వెళ్లేంత తీరిక లేని వారికి ఇదొక మంచి వేదిక. స్మార్ట్ ఫోన్‌లో కూడా నచ్చిన పుస్తకం చదువుకునే వెసులుబాటు ఉంది. ఒక్కసారి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే...మంచి మంచి కథలు చెప్తుం ది కహానియా.

కహానియా అంటే ఏమిటి?
ఆన్‌లైన్ సాహిత్య సంపూటి కహానియా. ఈ వెబ్‌సైట్ సృష్టికర్త ముగ్గురు హైదరాబాద్ కుర్రాళ్లే. యువ రచయితలకు చక్కటి వేదికను ఏర్పాటుచేసి వారికి ఆర్థిక అవకాశాలను కల్పిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పుస్తకం కొనుక్కుని చదివే తీరిక ఎవ్వరికీ ఉండటం లేదు. అదే పుస్తకం ఆన్‌లైన్‌లో దొరికితే ప్రయాణం చేస్తూ మొబైల్ ఫోన్‌లో చదువుకోవచ్చు. డెస్క్‌టాప్ మీద పెట్టుకుని వీలున్నపుడు చదువుకోవచ్చు. అంతేకాదు కథలు, కవితలు రాసే ఔత్సాహికులకు కూడా ఈ వెబ్‌సైట్ ఆహ్వానం పలుకుతుంది. ఆలోచనలను అక్షరాలుగా మలిచి పుస్తకంగా రాసిన రచయిత ఇష్టమైన ధర నిర్ణయించి అమ్ముకోవచ్చు. ఆ పుస్తకాన్ని పాఠకులకు చేర్చే బాధ్యత కహానియాది. ప్రాంతీయ పాఠకుల సంఖ్యను పెంచే ప్రధాన ఆశయంతో పాఠకులను, రచయితలను కలిపే వేదికగా మారింది. పేరున్న రచయితలను కలసి వారిని భాగస్వామ్యులను చేసి ఈ మిత్రబృందం 2016 మే 21న కహానియాకు ప్రాణం పోశారు.

ఆసక్తి ఉన్నవారికిఆహ్వానం
ఆసక్తి ఉన్న రచయితలు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి కథలు, కవితలు రాయొచ్చు. పదిహేను నిముషాల్లోపు చదవగలిగే వాటిని ఎంచుకోవాలి. పెద్ద కథ అయితే మూడు నాలుగు భాగాలుగా రాసుకోవచ్చు. రచయిత తన ఐటటమ్‌కు తానే ధర నిర్ణయించుకునే వీలుంది. రీడర్స్ వాటిని కొనుగోలు చేసి చదువుకుంటారు. కొన్ని పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి. తెలుగులో కామిక్స్ పెద్దగా లేవు. కథలకు బొమ్మలు వేసేవాళ్లు కూడా చాలా తక్కువ. కహానియా టీం అలాంటివారిని వెతికి పట్టుకుని కథకులతో అనుసంధానం చేసింది. వచ్చే ఆదాయంలో ఎవరి వాటా వారికి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు కథను ఆడియో రూపంలోకి మార్చి రచయితకు పంపవచ్చు. నచ్చితే ఇద్దరూ ఒప్పందం చేసుకుని ఆడియో బుక్ రూపంలో వెబ్‌సైట్‌లో పోస్టు చేయొచ్చు. దీనివల్ల ఇద్దరికీ ఆదాయం సమకూరుతుంది. ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైన కొత్త కొత్త కథలు...కహానియా ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాయి.