మెయిన్ ఫీచర్

విద్యా కుసుమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కలలు కనండి..వాటి కోసం కష్టపడండి’’- మాజీ రాష్టప్రతి అబ్దుల్ కాలమ్ ఇచ్చిన ఈ పిలుపు ఎంతో మంది యువతీ యువకులను కదిలించింది. అందులో ఒకరు అనితాసెంథల్. కుగ్రామం నుంచి ఈ యువతి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగి పలువురు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు సంసార జీవితం ఆమెకు ప్రతిబంధకం కాలేదు. అడ్డంకులను అధిగమించి ముందుకువెళ్లారు. ఇంతకీ ఎవరా అనితా సెంథిల్? ఎం సాధించారో తెలుసుకుందాం.
కుగ్రామం నుంచి అడుగులు
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో అనితాసెంథిల్‌ది ఓ చిన్నగ్రామం. దిగుమ మధ్యతరగతికి చెందిన ఈ యువతిని నచ్చిన కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వటం ఆమె ఎదుగుదలకు ఓ సానుకూల అవకాశం. పాలక్కడ్‌లో స్కూ లు చదువులు పూర్తిచేసుకున్న తరువాత కొయంబత్తూర్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత చెన్నైలో బీపీఓ సెక్టార్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడ లభించిన అనుభవంతో భావి జీవితానికి మార్గం సుగమం చేసుకుంది. అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చి ఆన్‌లైన్‌లో తన కెరీర్‌కు మెరుగులు దిద్దుకు నే ప్రయత్నాలు ఆరంభించింది.
విద్యారంగంలోకి ప్రవేశం..
తొలుత ఫ్రీలాన్స్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఆమె విద్యారంగంలోకి అడుగుపెట్టారు. అందులో ఎదురైన సవాళ్లు, కష్టాలు ఆమెను మరింత రాటుదేల్చాయి. ఆ తరువాత ష్యఖూఒళజ.ష్యౄ ను స్థాఫించారు. విద్యార్థులకు ప్రొఫెషనల్ స్టడీ మెటీరియల్ అందించే వెబ్‌సైట్ ఇది. అంతేకాదు ఎవరికైనా అవసరమైతే ఆన్‌లైన్ ట్యూటర్స్ సైతం అందిస్తుంది. ఇలాంటి వెబ్‌సైట్లు నిర్వహిస్తూనే ఆమె ఎంబీఏ పూర్తిచేశారు. ఈ డిగ్రీలో ఆమెలోని నైపుణ్యాన్ని మరింత పెంచింది.
అనతి కాలంలోనే అతిపెద్ద ప్రాజెక్టు
ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ ఎన్నో వ్యాపార మెళకువలను నేర్చుకుంది. తరువాత ప్రాజెక్టును ఏది ప్రారంభించాలనే ప్రణాళిక వేసుకుంటూ ధైర్యంగా కొచ్చిన్‌లో ‘కీవేస్ ఎడ్యు సర్వీసెస్‌కు శ్రీకారం చుట్టింది. పెళ్లి, పిల్లలు, సంసారం వంటి ప్రతిబంధకాలు ఆమె అభిరుచికి ఏమాత్రం అడ్డంకిగా రాలేదు. ప్రస్తుతం cour segig. com, academicpaperhub.com అనే రెంఢు వెబ్‌సైట్లను కీవేస్ ఎడ్యు సర్వీసెస్ గొడు గు కిందకు తీసుకువచ్చి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. అనితాసెంథల్‌గా ముగ్గురు ఉద్యోగులు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తారు. మిగిలిన వారం తా ఫ్రీలాన్సర్స్.
విద్యార్థులకు ఆన్‌లైన్ సపోర్టు
విద్యాపరంగా కేరళ దేశంలోనే ముందడుగులో ఉంది. ఇటువంటి చోట ఇంటర్నెట్, సాంకేతికత సాయంతో విద్యార్థులు వారి లక్ష్యాలను చేరుకోవటానికి సాయపడుతున్నారు. విద్యార్థులను విద్యావంతులను చేయడానికి, వారి విద్యాప్రమాణాలు పెరగడానికి, భవిష్యత్తు చక్క గా తీర్చిదిద్దుకోవటానికి ఆన్‌లైన్ సపోర్టు ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు పలక్కడ్ గ్రామ మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచారు.