సబ్ ఫీచర్

పర్యావరణ ‘ప్రచారక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలవనరులు కలుషితం కారాదని, పర్యావరణ శోభతో పుడమి పరిఢవిల్లాలని ఆయన పరితపించారు.. అదే లక్ష్యంతో తుదిశ్వాస విడిచేవరకూ నిబద్ధతతో కృషి చేసి జన హృదయాల్లో ‘పర్యావరణ ప్రేమికుడి’గా చెరగని ముద్ర వేసుకున్నారు. మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందిన అనిల్ మాధవ్ దవే (60) రాజకీయాల్లోకి రాకముందు నుంచీ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తూ ప్రజలతో మమేకం అయ్యారు. ఆదర్శ రాజకీయవేత్తగానూ రాణించారు. గత ఏడాది జూలైలో పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టకముందే నర్మదా నది ప్రక్షాళన కోసం ఉద్యమించిన నిజమైన పోరాట యోధుడిగా గుర్తింపు పొందారు. పారిశ్రామిక కాలుష్యం, నదీ పరీవాహక ప్రాంతంలో అడవుల నిర్మూలన, నదుల్లో విగ్రహాల నిమజ్జనం వం టి సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దవే నిర్విరామంగా శ్రమించారు. పర్యావరణ మం త్రిత్వ శాఖను చేపట్టిన నాటి నుంచి నదుల పరిరక్షణ, అడవుల పెంపకం వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరించారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బారానగర్‌లో 1956 జూలై 6న జన్మించిన ఆయన తనకు ఇష్టమైన ‘రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్’లో పీజీ చేశాక నర్మదా నది పరిరక్షణ కోసం నడుం బిగించారు. విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూనే ‘నర్మద సమగ్ర’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. విద్యార్థి దశలో ఆయన తన తాతగారి నుంచి స్ఫూర్తి పొంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. పూర్తిస్థాయి ‘ప్రచారక్’గా పనిచేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు.
బ్రహ్మచారి అయిన దవే తన వ్యక్తిగత జీవితంలో ఆడంబరాలకు, విలాసాలకు దూరంగా ఉంటూ మృధుస్వభావిగా పేరొందారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఆయన ప్రకృతిని అమితంగా ఆరాధించేవారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటించడం అంటే ఆయనకు మహా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన నర్మదా నది పరిరక్షణను ఓ తపస్సులా భావించారు. 19 రోజుల పాటు ‘నర్మద యాత్ర’ నిర్వహించి జలవనరుల పరిరక్షణకై జనంలో చైతన్యం రగిలించారు. ‘నర్మద’పై ఉన్న ప్రేమతో ఆయన భోపాల్‌లోని తన ఇంటికి ‘నదీ కా ఘర్’ అని పేరు పెట్టుకున్నారు. ‘నర్మద సమగ్ర’ సంస్థ ఆధ్వర్యంలో నదీ పరీవాహక ప్రాంతంలో మొక్కల పెంపకాన్ని విస్తృత ప్రాతిపదికపై చేపట్టారు. 2004లో ‘జన్ అభియాన్ పరిషత్’ పేరిట ఓ సంస్థను ప్రారంభించి సుమారు పాతికవేల స్వచ్ఛంద సంస్థలను ఒకే గొడుగు కిందకు చేర్చారు. ‘జన్ అభియాన్ పరిషత్’ నేతృత్వంలో ‘నర్మద సేవా యాత్ర’ వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. మంచి రచయితగాను పేరున్న ఆయన- పరిపాలన, మేనేజ్‌మెంట్, రాజకీయాలు, పర్యావరణం, వాతావరణం మార్పులు వంటి పలు విషయాలపై పుస్తకాలు రాశారు. హోషంగాబాద్ జిల్లాలో 1,880 పాఠశాలల్లో బయో టాయిలెట్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయించారు.
మరాఠా యోధుడు శివాజీ అంటే దవేకు ఎనలేని అభిమానం. అందుకే శివాజీ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ‘జనతా రాజా’ పేరిట నాటకాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శింపజేశారు. 2003లో దవే భారతీయ జనతాపార్టీలో క్రి యాశీలక పాత్ర ప్రారంభించారు. 2003 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమాభారతి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడేందుకు దవే తన అనుచరులతో కలిసి విశేషంగా కృషి చేశారు. 2008, 2013 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా విజయం కోసం వ్యూహకర్తగానూ పనిచేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌తో సన్నిహితుడిగా ఉంటూ తన సొంత రాష్ట్రం అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించారు. 2009, 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పనె్నండేళ్లకోసారి ఉజ్జయినిలో జరిగే ‘సింహస్థ’ సందర్భంగా ‘వైచరిక్ మహాకుంభ్’ పేరిట ఓ సదస్సును ఆయన నిర్వహించి, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రముఖులు చర్చించేలా కృషి చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రిమండలిలో పర్యావరణం, అటవీ శాఖ లభించింది. మంత్రి పదవిలో ఉన్నది కొద్దికాలమే అయినప్పటికీ తన పనితీరుతో ఆయన చెరగని ముద్ర వేశారు. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య నెలకొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచేవారు. పర్యావరణ అనుమతుల విషయంలో నిజాయితీగా ఉండాలని అధికారులకు ఆయన చెప్పేవారు.
చివరి లేఖలోనూ...
తన మరణానంతరం ఎలాంటి హంగామా చేయవద్దని, నర్మదా నదీ తీరాన అంత్యక్రియలు జరపాలని మరణానికి ముందు అనిల్ మాధవ్ దవే తన చివరి లేఖలో రాసుకున్నారు. మృత్యువు ఒడిలోకి చేరకముందు దవే రాసుకున్న లేఖను ఆయన సోదరుడు ప్రధాని మోదీకి అందజేశారు. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
chitram...
అనిల్ మాధవ్ దవే*