మెయిన్ ఫీచర్

వనదేవతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుందరబన్’ రక్షణలో మహిళలుఖ నర్సరీల్లో మొక్కల పెంపకం
ఖ మడ అడవులతోనే మనుగడఖ అహరహం శ్రమిస్తున్న
18వేల మంది అతివలుఖ ఐలా తుపాను నేర్పిన గుణపాఠం

చుట్టూ నీరు.. ఆ నీటిలో ఏపుగా ఎదిగిన మొక్కలు.. నేలమీదకు తన్నుకొచ్చిన ఆ వృక్షాల వేళ్లు.. పదుల సంఖ్యలో దీవులు...
పులులు, జింకలు, డాల్ఫిన్లు, విభిన్న జీవజాతులు తిరిగే ప్రాంతం అది. అందమైన ‘సుందరబన్’ మడ అడవుల్లో అక్కడక్కడ చిన్నచిన్న దీవులు. అడవినే నమ్ముకుని, అలలపైనే ఆధారపడి బతికేస్తున్నవారి జీవితంలో ఒక్కసారి కుదుపు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం.. ఐల తుపాను వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది పదుల సంఖ్యలో మృతులు. వేల సంఖ్యలో కూలిన ఇళ్లు.. అయిపులేని సామగ్రి... తాము ఎంతగానో ‘సుందరబన్’ ఎందుకిలా అయిపోయింది.. అక్కడ జీవించే ప్రతి ఒక్కరిలోనూ అదే ఆవేదన.. ఆలోచించారు. కలపకోసం విచ్చలవిడిగా చెట్లను నరికేయడం, మరపడవల సంఖ్య పెరగడం, భద్రంగా ఉండే గట్ల నిర్మాణం లేకపోవడం, మట్టి కోసుకుపోవడం వంటివి నష్టాన్ని పెంచేసాయి. వనాలను వధించకుండా రక్షిస్తే అవి తమల్ని రక్షిస్తాయని ఐలా అనుభవంతో తెలుసుకున్నారు. పాఠాలు నేర్చుకున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ సంస్థల సహకారంతో మహిళలు రంగంలోకి దిగారు. మడ అడవుల పెంపకం బాధ్యతను భుజాన వేసుకున్నారు. స్వల్పధరకు విత్తనాలు, మొలకలు తీసుకురావడం, నర్సరీల్లో పెంచడం, కొన్ని సంస్థలకు విక్రయించడం, వారి ద్వారా మళ్లీ తీసుకుని నిర్దిష్ట ప్రాంతాల్లో నాటడం వారి పని. అందుకు ప్రతిగా కాస్త ఆదాయమూ వస్తుంది.
నర్సరీల పెంపకానికి, నాటిని ప్రతి మొక్కకు ఇంత అని కొంత చెల్లిం పు ఉంటుంది. ఇవి కాక అక్కడ జలపరిరక్షణకు వీలయ్యే, ముంపునుంచి రక్షణకు సహకరించే గట్టు, నీటికుంటల నిర్మాణ పనులూ మహిళలు చేపట్టారు. కొన్ని దీవుల మధ్య, దీవుల్లోనూ రాకపోకలకు వీలుగా ఇటుకలతో రోడ్ల పనులూ వారే చేపట్టారు. వారాంతాల్లో సమావేశాలు నిర్వహించడం, వనాల రక్షణకు చేపట్టిన చర్యలపై సమీక్ష, చైతన్య, ప్రచార కార్యక్రమాలు చేపట్టడం మొదలైంది. వివిధ సంస్థల సహకారంతో ఇప్పుడు సుందరబన్‌లో 18వేలమంది మహిళలు ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. తుపాను తాకిడికి సర్వం కోల్పోయిన సుందరబన్ బాధిత కుటుంబాల్లో మగవారు ఉపాథి వెతుక్కుంటూ వలసవెళ్లిపోయారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆ నేలనే నమ్ముకున్నారు. అంతర్జాతీయ సంస్థలు, ఎన్‌జిఒల సహకారంతో ‘సుందరబన్’ రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అది ఫలితాలను ఇస్తోంది. అక్కడివారికి ఆదాయం పెంచడం, మడ అడవుల రక్షణ ఆవశ్యకతను వివరించి చెప్పడం కీలకంగా మారింది. ఇప్పుడు ఎంతోమంది ఆత్మవిశ్వాసంతో తమ సుందరమైన జీవితం కోసం అహరహం శ్రమిస్తున్నారు.
‘సుందరి’ని
బతికించడం ఎలా?
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ ప్రాంతంలో బంగాళాఖాతం తీరంలో గంగ, బ్రహ్మపుత్ర, మేఘ్న నదుల డెల్టా ప్రాంతంలో విస్తరించిన ‘సుందరబన్’ మడ అడవుల సమాహారం. మనదేశ పరిథిలో ఉన్న ‘సుందర్‌బన్’లో ‘సుందరి’ అనే వృక్షజాతి మొక్క లు ఎక్కువ. వీటి శాస్ర్తియ నామం ‘హెరితైర ఫోమ్స్’. నేలమీదకు తన్నుకొచ్చే వేళ్లు నీటిలోనూ లోతుగా పాతుకుపోతాయి. నేలపైన వృక్షం ఉంటుంది. మన సుందరబన్‌లో వీటిశాతమే ఎక్కువ. అందుకే ఈ మడ అడవులకు సుందరబన్ అన్న పేరువచ్చిందన్నది స్థానికుల విశ్వాసం. ఉప్పునీటితో బతికే మొండిమొక్క ఇది. నీటిలోని ఉప్పును విసర్జించగలిగే తత్వం వీటి వేర్లకు, చివరకు ఆకులకూ ఉంటుంది. ఆక్సిజన్ కోసం వేళ్లు నేలమీదకు తన్నుకువస్తాయి. అయితే మొక్కల్లో ఎక్కువశాతం మొదట్లోనే నశిస్తాయి. పూర్తిగా మొక్క ఎదగడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ‘సుం దరి’సహా మరిన్ని మడ జాతుల మొక్కల పెంపకాన్ని అక్కడి మహిళలు విస్తృతంగా చేపట్టారు. నర్సరీల నిర్వహణ, మొక్కలు నాట డం, ఇప్పటికే అడవుల్లో విస్తారంగా ఉన్న మొక్కల్లో పాడైన, వ్యాధుల సోకిన వాటిని తొలగించడం వంటి పనులు వీరే చేస్తున్నారు. అనవసరంగా అడవుల్లోకి వెళ్లి వేటాడటాన్ని తగ్గించుకున్నారు. శబ్ద కాలుష్యం లేకుండా చూస్తున్నారు. ఇల్లూవాకిలీ, కుటుంబం అంతా అలల మధ్య తేలియాడే మొక్కల మధ్య ఉన్నాయి. తాము సురక్షితంగా ఉండాలంటే వనాలు బాగుండాలి. మడ అడవుల వల్ల అలల తాకిడి, వరదల తాకిడి నియంత్రించబడుతుంది. ఆ నియంత్రణవల్లే తమ ఆవాసం సురక్షితంగా ఉంటుందన్నది వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం. అందుకే ఇప్పుడు చిత్తశుద్ధితో ఆ పని చేస్తున్నారు. వీరికి నేచర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీతోపాటు ఎన్నో ఎన్‌జిఓలు, ప్రభుత్వం సహకరిస్తున్నాయి.