సబ్ ఫీచర్

అందమైన అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవితా షినోజ్ సీనియర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కుమారుడు అర్జున్‌కు తల్లి. ముప్పయి మూడేళ్ల ఈ గృహిణి ఇటీవల ముంబయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని పదవ కంటెస్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా తను అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఇది మరిచిపోలేని అనుభవం అం టారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ర్యాంప్ మీద నడిచిన అనుభవంతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. బహుళజాతి సంస్థలు నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న అనుభవంతో ఈ పోటీల్లో పాల్గొనటం జరిగిందని చెబు తూ.. తల్లినవ్వటం వల్ల నాలో శారీరకంగా వచ్చిన మార్పుల దృష్ట్యా ఈ పోటీల కోసం యోగా, జుంబా ప్రాక్టీస్ చేశానని చెబుతుం ది. ఇంటి అవసరాలు చూసుకుంటూ కొడుకు నిద్రపోయిన సమయంలో ఆఫీసు వర్క్‌ను పూర్తిచేసుకుని ఈ పోటీలకు ఆమె తయారయ్యారు. 25 మంది తల్లులు పాల్గొనగా అందులోలవిత పదవ పోటీదారురాలిగా నిలవటం గమనార్హం. మధ్యతరగతి గృహిణి కావటం వల్ల ఈ పోటీల కోసం చెల్లించాల్సిన పీజు 50,000 రూపాయలు ఓ ప్రైవేటు సంస్థ స్పాన్సర్ చేయటంతో పోటీల్లో పాల్గొనగలిగారు. తల్లయిన సందర్భంలో దాదాపు 69 కిలోల బరువు ఉన్న లవిత షినోజ్ ఈ పోటీల కోసం 53 కిలోలకు తగ్గిపోయింది. అందం కోసం పిల్లలకు పాలివ్వని తల్లుల కోవలోకి లవిత రాదు. ఎందుకంటే ఆమె బరువ తగ్గటానికి పిల్లాడు ఆరోగ్యంగా ఎదగటానికి పాలివ్వటం ఓ అవకాశం అని అంటారు. అంతేకాదు ఈ పోటీల కోసమని జంక్, ఆయిల్ ఫుడ్ తీసుకోలేదు. ఉద్యోగం చేసే ప్రతి తల్లి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, అంతేకాదు మీరు పనిచేసే సంస్థ, ఇంట్లోనివారు ప్రోత్సహిస్తే ఇలాంటి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవటం పెద్ద కష్టం కాదంటారామె.