ఐడియా

బాటిల్స్‌తో టాయిలెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది జార్ఖండ్‌లోని జెమ్‌షెడ్‌పూర్. అక్కడ ఉన్న మానవ వికాస్ పాఠశాలలో విద్యార్థులకు ఒకేఒక టాయిలెట్ మాత్రమే ఉంది. టీచర్లు, విద్యార్థులంతా దానినే ఉపయోగిస్తారు. దీంతో వారంతా ఆ ఒక్క టాయిలెట్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూలును రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి నడుపుతున్నారు. మరో టాయిలెట్‌ను నిర్మించాలంటే అవసరమైన డబ్బులేక వీరంతా ఆలోచించి చౌకగా టాయిలెట్ నిర్మించాలని ప్లాస్టిక్ బాటిల్స్‌ను కలెక్ట్ చేశారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఇసుక, చిక్కటి బూడిద, ఇనుప ఖనిజాన్ని నింపేశారు. వీటినే ఇటుకలుగా తయారుచేశారు. పిల్లలు సేకరించి తెచ్చిన బాటిల్స్‌ను మూడు వేల ఇటుకలుగా తయారుచేశారు. వీటిని ఉపయోగించి టాయిలెట్‌ను నిర్మించారు.
ఈ టాయిలెట్ నిర్మాణాన్ని చూసిన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ పాండే ఆచ్చెరవొందారు. నిరుపయోగంగా ఉండే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఎన్నో పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోవాలంటే ఇలాంటి టాయిలెట్స్ నిర్మాణం ఎంతో అవశ్యమని నమ్మిన ఆయన వెంటనే పిల్లలు, పెద్దలు కలిసి నిర్మించిన ఈ టాయిలెట్ గురించి మెయిల్ మెస్సేజ్ పంపారు. డిప్యూటీ కలెక్టర్ మెస్సేజ్‌తో ఈ టాయిలెట్ నిర్మించినవారిపై అభినందనల
వర్షం కురుస్తోంది.
అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఈ టాయిలెట్ నిర్మాణానికి అవసరమైన నగదు సాయాన్ని హిల్ టాప్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఛటర్జీ అనే విద్యార్థి అందించాడు. తల్లిదండ్రులు ఇస్తున్న పాకెట్ మనీని దాచి ఈ టాయిలెట్ నిర్మాణానికి ఇవ్వటం విశేషం. ఈ టాయిలెట్ చక్కగా పనిచేస్తే రాబోయే కాలంలో ఇలాంటి పనికిరాని బాటిల్స్‌తో పనికొచ్చేలా టాయిలెట్స్ నిర్మాణం చేపడితే పర్యావరణాన్ని పదికాలాలపాటు కాపాడుకోవచ్చు.