సబ్ ఫీచర్

మహిళా ఉద్యోగులు తగ్గిపోతున్నారెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపుకుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవటం మహిళలకు కష్టమైన పని అయినప్పటికీ ఇబ్బందులను భరిస్తూ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా స్చేచ్ఛ కలిగిన మహిళలే సాధికారిత వైపు పయనించగలరనేది వాస్తవం. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 2004 నుంచి దేశంలో విభిన్న రంగాల్లో మహిళా ఉద్యోగినుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది. 2004 నుంచి 2012 జనాభా లెక్కల ప్రకారం దేశంలో రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాల నుంచి అర్ధంతరంగా తప్పుకున్నట్లు వెల్లడైంది.
మహిళా కార్మికులు సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. 1993-94లో 42శాతం మంది మహిళా కార్మికులు ఉండగా.. అది 2011-12కి 31శాతానికి పడిపోయింది.
గ్రామీణ ప్రాంతాలలో 53శాతం మంది మహిళలు విధుల నుంచి తప్పుకుంటున్నారు. అలాగే 15-24 సంవత్సరాల వయసు ఉన్న యువతులే ఉద్యోగాలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మికుల సంఖ్య 49శాతం నుంచి 37.8శాతానికి పడిపోయింది.
2004 నుంచి 2009 మధ్య 2.4 కోట్ల మంది పురుషులు ఉద్యోగాల్లో చేరారు. ఇదే సందర్భంలో 2.7 కోట్ల మంది మహిళలు తమ విధుల్లో నుంచి తప్పుకున్నారు.
సామాజిక సమస్యలే కారణం..
మహిళా ఉద్యోగులు తగ్గిపోవటానిక సామాజిక సమస్యలే కారణమని వెల్లడైంది. పెళ్లికాని అమ్మాయిల కంటే పెళ్లయిన వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. అవివాహితుల్లో కేవలం 21శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే పెళ్లయినవారిలో మాత్రం 41శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారట. వీరు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తప్పుకోవటానికి ప్రధాన కారణం పెళ్లి. కాన్పుల సమయంలో చాలామంది ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతోంది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు పెళ్లికాని యువతులను వారి తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు పంపడం లేదని నిపుణులు చెబుతున్నారు. వేతనాలలో వ్యత్యాసం, రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోవటంతో మహిళలు చాలామంది ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో యువతులు స్కూళ్లు లేదా కాలేజీలలో చదువుకుంటున్నారు. ఇది కూడా ఓ కారణం.
ఇతర దేశాలతో పోలిస్తే..
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం మహిళా ఉద్యోగులు విధుల నుంచి తప్పుకోవటానికి కారణాలు అనేకం అయినప్పటికీ 131 దేశాలలో సర్వే నిర్వహించగా.. మనదేశం రేటు 121 ఉంది. చైనాలో 68శాతం నుంచి 64శాతానికి తగ్గింది. అలాగే పొరుగున ఉన్న శ్రీలంకలో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం కేవలం రెండు శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం అమెరికా కన్నా జపాన్‌లోనే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రపంచంలోకెల్లా చిన్న దేశమైన డెన్మార్క్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. డెన్నార్క్ తర్వాత స్థానాల్లో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలల్లో మాతృత్వంతో పాటు పితృత్వ సెలవులు ఇస్తున్నారు. కొన్ని దేశాలలో కొత్త దంపతులకు ప్రత్యేక రాయితీలు సైతం ఇస్తున్నారు. చైల్డ్‌కేర్ సెంటర్లకు సబ్సిడీలు ఇస్తున్నారు. దీనికి తోడు బాలింతలకు ఇచ్చే సెలవులు నానాటికీ తీసికట్టు అనే విధంగా ఉంది. చైల్డ్‌కేర్ సెంటర్ల ఖర్చు భరించలేక మనదేశంలో ఎక్కువమంది మహిళలు ఇంటిపట్టునే ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు ఇష్టపడుతున్నారు.చీ

గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మికుల సంఖ్య 49శాతం నుంచి 37.8శాతానికి పడిపోయింది