Others

లండన్ కార్పొరేటరుగా చెన్నై వనిత! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా అక్కడికి వలసపోయిన కుటుంబాలకు చెందినవారు స్థానికంగా పదవులు అలంకరించడం- మనం గర్వంగా భారతీయ మూలా లు అంటూ చెప్పుకోవడం జరుగుతుంది. కాని చెన్నైలో పుట్టి అక్కడే పెరిగి పెద్దదయిన రేహానా అమీర్ గొప్ప వ్యాపారవేత్తగా తన నలభైయ్యవ ఏటనే యుకెలో రాణిస్తున్నది. ఆమె ప్రోసాప్స్ టెక్నాలజీ ఐటి కంపెనీ బాస్- ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబిఏ చేసింది. స్థానికంగా పరిసర ప్రాంతాల వస్తువులను తెప్పించి రిటైల్ వ్యాపారం కూడా చేస్తుంది. అంతవరకూ బాగానే వుంది. స్థానికంగా పలుకుబడి కూడా వున్నది కానీ ఈమధ్యనే లండన్ మునిసిపల్ కార్పొరేషన్‌కి కౌన్సిలర్‌గా సిటీ శివారులో వున్న విన్ట్రీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. పొలిటికల్ పార్టీలతో ఆమెకు ప్రమేయం లేదు- కేవలం స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసింది. ఎందుకు? అంటే, తనకు లండన్ చేసిన ఉపకారానికి బదులుగా అక్కడి ప్రజలకు సేవ చేసి ఋణం తీర్చుకోవాలని అనిపించింది. ఎన్నికల బరిలోకి దిగాను అంటూ ఆమె లండన్ ప్రజలలో కలిసిపోయింది. వీధుల పరిశుభ్రత, అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదల, గాలి దోషాల తొలగింపు తన ముందున్న ప్రథమ కర్తవ్యాలు అన్నది ఈ ఇండియన్ లేడీ. సిటీ కార్పోరేషన్ చాలా పెద్ద సంస్థ. ఇరవై ఐదు వార్డులు వున్నాయి. 1.3బిలియన్ల పౌండ్ల నిధులున్నాయి. కాకపోతే, తన వ్యాపారాభివృద్ధి కోసమే ఆమె ఇదంతా చేస్తున్నది అని మనవాళ్ళే ఆరోపిస్తున్నారు. ఏది ఏమయితేనేం కోటా గట్రా లేకుండా గెలిచింది. భేష్!

-వీరాజీ