సబ్ ఫీచర్

‘అందమైన లోకం’లో ఆలాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాథల సేవలో యువ గాయకుడుఖకచేరీలతో నిధుల సేకరణ
ఖమూగజీవాల పోషణకూ ప్రాధాన్యంఖఅండగా నిలిచిన స్నేహితులు

అతడిది ‘అందమైన లోకం’.. ఎందుకంటే ఆ యువకుడి మనసు అలాంటిదిమరి... ఓ పాట కోసం అనాథ శరణాలయానికి వెళ్లిన అతడు వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. గొం తు సవరించుకున్నాడు. సేవాకార్యక్రమాల కోసం ఓ అందమైన లోకాన్ని సృష్టించాడు. అతడి ప్రయ త్నంలో ఎందరో పాలుపంచు కుంటు న్నారు.
***
జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు కొందరి జీవితాలను మార్చేస్తాయి. అలాగే 18 ఏళ్ల సిద్దార్థ్ బెందీ జీవితాన్ని కూడా మార్చేసింది. అతని సుమధుర గళమే అతన్ని సేవామార్గం వైపునకు నడిపించింది. హైదరాబాద్‌లోని సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన సిద్దార్థ్ సంగీత కళాకారుడు. అతను గిటార్ పట్టుకుని పాట పాడితే నర్తించని యువత ఉండదు. చిన్ని చిన్ని వేడుకల్లో ఈ యువకుడు ఎన్నో సంగీత కచ్చేరీలు చేస్తూంటాడు. దేశమంతా తిరుగుతూ పాటలు పాడే ఈ యువకుడు ‘ది బ్యూటీఫుల్ వరల్డ్’ అనే పాటతో మ్యూజిక్ వీడియో చిత్రీకరించాలనుకున్నాడు. అందుకోసం కొన్ని అనాథ శరణాలయాలకు వెళ్లాడు. అక్కడ అనాథలను చూసిన అతనికి వారికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆలోచనతో తన సంగీత కార్యక్రమాలు వారిని ఆదుకుంటే తన జీవితం ధన్యమైనట్లేనని భావించాడు. అదే అశయంతో సిద్దార్థ్ తనకిష్టమైన పాట ‘ది బ్యూటీఫుల్ వరల్డ్’ అనే పేరుతోనే ఎన్జీఓ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థను తన స్నేహితులు నలుగురితో ఆరంభించాడు. ప్రతి ఆరు నెలలకొకసారి అనాథ పిల్లలను దత్తత తీసుకుని విద్యావంతులను చేస్తుంది. అంతేకాదు మూగజీవాలను ఆశ్రయం కల్పిస్తుంది. ఈ పనులు చేయటానికి అవసరమైన నిధులను తన సంగీత కార్యక్రమాల ద్వారా సేకరిస్తాడు. నలుగురితో ఆరంభమైన ఈ సంస్థలో నేడు అనేకమంది యువకులు చేరుతున్నారు. వీరంతా 25 సంవత్సరాలలోపువారే.
ఈ యువకులు చేస్తున్న పనులను కన్నవారు సైతం ఆనందపడుతున్నారు. వారు సైతం విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మరింతమంది యువకులు తనకు తోడవ్వాలని సిద్దార్థ్ ఆకాంక్షిస్తున్నాడు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటూ వచ్చే ఆనందం, తృప్తి వెలకట్టలేమంటాడు సిద్దార్థ్.

భూమికకు రచనలు పంపండి
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03