మెయిన్ ఫీచర్

నాసాలో మన జాబిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖప్రతిభతో దూసుకుపోతున్న
హైదరాబాద్ యువతి
ఖ‘నిసార్’ ప్రాజెక్టులోనూ అవకాశం
ఖఅంతరిక్ష ప్రయాణంపై ఆసక్తి

ప్రతి ఒక్కరూ కలలుకంటారు.. మంచి కలలు నిజమైతే బాగుండునని చాలామంది అనుకుంటారు.. కానీ కలల్ని నిజం చేసుకునేవారు తక్కువమందే ఉంటారు. అలాంటివారిలో మన చాందిని ఒకరు. ఆమె పూర్తిపేరు చాందిని వీరమాచనేని గుంటుపల్లి. ప్రస్తుతం నాసా అనుబంధ సంస్థలో పనిచేస్తోంది. ప్రతిష్టాత్మక ‘కేసిని స్పేస్‌క్రాఫ్ట్’ ప్రాజెక్టులో పాలుపంచుకుంటోంది. రెండు దశాబ్దాలుగా అంతరిక్షం లో తిరుగుతూ శనిగ్రహ కక్ష్యలో పదమూడేళ్లుగా పరిభ్రమిస్తూ, ఆ గ్రహానికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలను తీస్తూ చరి త్ర సృష్టించిన కేసినో ఉపగ్రహం ఓ సంచలనం. అంతటి గొప్ప ప్రాజెక్టులో అలా పనిచేయాలన్నదే చాందిని కల. నాసాలో ఆమెకు అవకాశం ఎలా వచ్చింది? ఆమె కల ఎలా నిజమైంది? అదేకదా అసలు కథ.

పుట్టింది అమెరికాలో..
మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వచ్చింది. ‘నస్’్ర స్కూల్లో చదివేది. అప్పుడే సైన్స్, స్పేస్ అంటే ఆసక్తి ఏర్పడింది. చిన్నవయసులో ‘స్టార్ టెక్’ కార్యక్రమాన్ని వీక్షించేది. అంతరిక్ష ప్రయాణం అంటే ఆసక్తిగా ఉండేది. అదెంతో ఇష్టంగా అనిపించేది. అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఉండేది. హైదరాబాద్ నగరంలోని బిర్లా ప్లానిటోరియానికి వెళ్లి కార్యక్రమాలు చూసేది. అక్కడి సైన్స్ మ్యూజి యం మరో ఇష్టమైన ప్రాంతం. అక్కడికి వెళితే సమయమే తెలిసేదికాదు. గంటలు గంటలు అక్కడే గడిపేది. సైన్స్ ఇష్టపడేవారికి అదో అద్భుతమైన కేంద్రం అంటుందామె. ఎన్నిగంటలున్నా అక్కడి షోలు చూసేది. ఆ ఇష్టమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ తరువాత నగరంలోని విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడ అధ్యాపకవర్గం వెన్నంటి ప్రోత్సహించారు. అమెరికా కన్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వారే సహకరించారంటుంది చాందిని. ఆ కోర్సు చివరి సంవత్సరంలో అద్భుతమైన ‘రాడార్’ ప్రపంచంలోకి అక్కడే అడుగుపెట్టే అవకాశం వచ్చిందని చెప్పింది చాందిని. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌లో మంచుఫలకాల పరిశోధనకు అవకాశం వచ్చింది. కానీ ఆమె ‘రాడార్’ కలల్నే నిజం చేసుకోవాలని నిర్ణయించుకుంది. మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక నాసా అనుబంధ విభాగమైన జెట్ ప్రొపల్షన్ లాబరేటరి (జెపిఎల్)లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది. రోబోటిక్ స్పేస్, ఎర్త్‌సైన్స్ మిషన్స్‌ను జెపిఎల్ చేపడుతుంది. ఇక్కడ అవకాశం వస్తుందని ఆమె అసలు ఊహించలేదు. కాకపోతే ఆమె గురువు డాక్టర్ ప్రసాద్ గోగినేని దంపతులు ప్రోత్సాహంతో ఆమె జెపిఎల్‌లో ఉద్యోగం సాధించగలిగింది.
నాసాలో ఏం చేస్తోంది?
అమెరికా కేంద్రంగా పనిచేసే అంతరిక్ష పరిశోధనా సంస్త ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లో పనిచేయడం ఓ అద్భుతమని చెబుతోంది చాందిని. సౌరకుటుంబం, అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం ఉత్సుకత కలిగిస్తూంటుందని ఆమె ఉత్సాహంగా చెబుతూంటారు. పదేళ్లుగా నాసాలో ఆమె పనిచేస్తున్నారు. ఎందరో సమర్థులైనవారితో కలసి పనిచేయడంలో ఎంతో ఆనందం ఉందంటోంది చాందిని. నాసాలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులేనని, అదే వ్యోమగాముల శిక్షణ తరగతుల్లో 50 శాతం మంది మహిళలేనని, ఇదెంతో ఆసక్తి కలిగించే అంశమని ఆమె అంటారు. అంతరిక్షంలో ఇంతవరకు ప్రయాణించే అవకాశం రాలేదు. కానీ ‘కేసిని ప్రాజెక్టు’లో భాగస్వామ్యం వల్ల నా కల నిజం చేసుకోవాడనికి దగ్గరైనట్లు ఆమె విశ్వా సం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ‘టైటాన్’ (శనిగ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహం చందమామ) ఉపరితలాన్ని మేపింగ్ చేయడం అసలు లక్ష్యం. దీనికి కేసిని మిషన్ అని పేరుపెట్టారు. ఆ ప్రాజెక్టులో చాందిని రాడార్ ఆపరేషన్స్ ఇంజనీర్‌గా సేవలందిస్తోంది. టైటాన్‌ను పరిశీలిస్తున్నప్పుడు తన సహచరులతో కలసి రాడార్ ఫ్లైట్ కంప్యూటర్ ద్వారా ఆదేశాల పరంపరను జనరేట్ చేయడం ఆమె పని. దీనితోపాటు మన అంతరిక్ష సంస్థ ‘ఇస్రో’తో కలసి ‘నాసా’ చేపట్టనున్న ‘నిసార్’ (నాసా ఇస్రో సింథటిక్ అపెర్టర్ రాడార్) ప్రాజెక్టులో ఆమెకు అవకాశం దక్కింది. సంక్షిష్టమైన భూగ్రహ పరిధిని కొలవడం, పర్యావరణంపై దుష్ప్రభావాన్ని పరిశీలించడం, మంచు ఫలకాలు కరగడం, ప్రకృతి వైపరీత్యాలను గమనించడం వంటి కార్యక్రమాల్లో అడ్వాన్స్‌డ్ రాడార్ ఇమేజింగ్ సాంకేతికతను వినియోగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో 34 ఏళ్ల చాందిని భర్తతో కలసి ఆమె ఉంటోం ది. ‘ఇస్రో’లో పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం వస్తే వచ్చేస్తారో అని అడిగితే ‘ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ననె్నం తో ఉద్వేగానికి గురిచేసింది. కానీ ఇండియాకు రావాలని ఇప్పటికైతే అనుకోలేదు’ అని నవ్వేసింది. ఖాళీగా ఉన్నప్పుడు ఇళయరాజా స్వరపరచిన సంగీతాన్ని ఆస్వాదిస్తానని, బోర్డు గేమ్‌లు ఆడుకుంటానని, భారతీయ సినిమాలు చూడటం ఇష్టమని, బాహుబలి-2 సినిమా కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెబుతోంది. తను పనిచేసే చోట తెలుగు తెలిసినవారు దాదాపు ఉండరని, ఎప్పుడైనా తెలుగులో మాట్లాడితే తను ఉప్పొంగిపోతానని అంటున్న చాం దిని హైదరాబాద్ బిర్యానీని మిస్ అవడం బాధగా ఉంటుందని, కనీసం రెండేళ్లకోసారి నగరానికి వస్తూంటానని చెప్పారు. భాగ్యనగరం ఎంతోమారిపోయిందని, అయినా అక్కడకు రావడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని అంటోది మన చాందిని.