ఐడియా

తరాలవారథే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు మారాలి. మనసత్వాలు మారాలి అని అందరూ చెబుతుంటారు. కొంతకాలం క్రితం అత్తలు కోడళ్లు అంటే వారిద్దరి మధ్య ఎప్పుడూ రగిలేకుంపటి ఉండేది. అది ఎప్పుడు భగ్గుమంటుందో ఎప్పుడు చల్లారుతుందో తెలిసేది కాదు. పైగా అది ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులానే ఉండేది. కాని ఈమధ్య అలాంటి స్థితి మారిం ది. వేరు కాపురాలు పెళ్లికి ముందే అనేసుకుంటున్నారు. పెళ్లి అవగానే వేరుగానే ఉంటున్నారు. కాని కొంతమంది ఇంకా కలసి ఉండాలనే భావంతో అక్కడక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తున్నాయి. కాకపోతే రెండింటిలో దేని బాధలు, సంతోషాలు దానికి ఉంటాయి. కాని ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల అవసరాలు ఎక్కువ అవుతున్నాయి. అత్తమామలను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు కాని, నేటి ఉద్యోగస్థులైన మహిళలు ఎవరైనా పెద్దవారుంటే తమ పిల్లలు చూసుకొనేవారు కదా అనే ఆలోచనకు వస్తున్నారు.
నిజమే!
పెద్దల ధోరణి మారుతోంది. ఇంతకుముందులాగా కోడలిని సాధించాలనో లేక ఆమె నా కింద ఉండాలనో భావాన్ని విడనాడుతున్నారు. కొడుకు తో సమానంగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే కోడలు కష్టపడుతోంది అని అనుకొనే స్థితి వస్తున్నారు. ఇంట్లో వంట, వగైరా పనులు చేస్తూనే ఆఫీసులో కూడా పనిచేస్తున్న మహిళల గురించి పెద్దవారు అర్థం చేసుకొంటున్నారు.
అందుకే ఇపుడు పెద్దలు కావాలని యువత అనుకొన్నట్లే వృద్ధాశ్రమాల్లో చాలామందిలో ఉన్నా ఒంటరితనాన్ని వదిలేయలేకపోతున్న పెద్దలు తమ కన్నవారి నీడ కావాలనుకొనే తయారు అవుతున్నారు. అట్లాంటపుడే యువత, వృద్ధులు ఇద్దరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల వారి మనసు తెలిసి మసలుకోవాలి పిన్నలు. వారు ఏదో తమ అనుభవంతో చెప్పినా అది ఇప్పుడు పనికి వస్తుందా రాదా అని చూసుకుని ఒకవేళ పనికి రాని దైతే ఆవిషయాన్ని వారికి మెల్లగా చెప్పాలి. పెద్దలు కూడా తాము చెప్పిందే చేయాలన్న పంతం పోకుండా నేటి పరిస్థితులు ఏది అనువైనదో వారు తెలుసుకోవాలి. కొడుకు కాకుండా కోడలుచెప్పినా అది ఇంటి మొత్తానికి పనికి వస్తుంది కనుక దాన్ని గురించి పూర్తిగా విని అందులోని మంచిని చెపుతూ ఇంకేదైనా సరిదిద్దాల్సి ఉంటే దాన్ని చెబితే ఆ కోడలు దాన్ని స్వీకరిస్తుంది. అంతేకాని నీవు ఏమిటి చెప్పేది అని ముందే అనయకూడదు. అపుడే రెండు తరాల మధ్య వారధి అనే సామరస్యపు పునాదిగట్టిగా నిలబడతుంది.
పునాది గట్టిదైతే...

- శ్రీలత