సబ్ ఫీచర్

ముప్పు తప్పదన్నా మోజు తగ్గదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుసంధ్యల సంగతెలా ఉన్నా నేడు మొబైల్ ఫోన్ లేని విద్యార్థులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సంపాదన లేకున్నా స్మార్ట్ఫోన్‌లో నిత్యం ‘వాట్సాప్’, ‘ఫేస్‌బుక్’తో ఆధునిక యువత మమేకం అవుతోంది. విద్యార్థులే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారికీ మొబైల్ ఫోన్ లేనిదే పొద్దుగడవని పరిస్థితి ఏర్పడింది. సమాచారం కోసమో, విజ్ఞానం కోసమో కాదు.. చాలామందికి సెల్‌ఫోన్ కాలక్షేపానికి పనికొచ్చే సాధనమైంది. అతిగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నందున అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా, ‘గుడ్‌మార్నింగ్’ నుండి ‘గుడ్‌నైట్’ వరకూ ఎంతో సెల్‌ఫోన్‌ను యథేచ్ఛగా వాడుతూ విలువైన డబ్బు, సమయాన్ని వృథా చేయడం నేడు పరిపాటిగా మారింది. మాట్లాడడానికే కాదు, సామాజిక వెబ్‌సైట్లను వీక్షించేందుకు స్మార్ట్ఫోన్ల వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లో ఖాతా లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లు చాలామంది భావిస్తున్నారు. మరోవైపు దీన్ని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. సామాజిక వెబ్‌సైట్లలో అసభ్యకర వ్యాఖ్యలు, అశ్లీల ఫొటోలు పోస్ట్ చేయడం, నీలిచిత్రాలను వీక్షించడం వంటివి కొందరికి వ్యసనంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయవచ్చునో నేడు సెల్‌ఫోన్ వాడకమే చెబుతున్నది. ఎంతగా కాదనుకుంటున్నా వదిలించుకోలేని నిత్యావసర వస్తువై కూర్చున్నది సెల్‌ఫోన్.
సెల్‌ఫోన్ వాడకం వల్ల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, విజ్ఞానాన్ని పెంచుకోవడం వంటి ప్రయోజనాలున్నాయి. అయితే, ఆచరణలో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. గేమ్స్, సినిమాలు, చాటింగుల కోసం, ఫొటోలు, వీడియోలు తీయడానికి సెల్‌ఫోన్‌ను వాడుతూ కాలాన్ని, ధనాన్ని వృథా చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మహిళల పట్ల వేధింపులు, సైబర్ నేరాల జోరు అనూహ్యంగా పెరుగుతోంది. మరోవైపు అతిగా సెల్‌ఫోన్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. మొబైల్‌తోనే ఎక్కువ సేపు గడుపుతూ శారీరక శ్రమ లేనందున కొందరిలో ఊబకాయం సమస్య తలెత్తుతోంది. చేతులు పొడిబారడం, దురద పెట్టడం, నల్ల మచ్చలు రావడం, చెవి చుట్టూ లేదా చెంపలపై మొటిమలు రావడానికి సెల్‌ఫోన్ కారణమని నిపుణులు చెబుతున్నారు. గంటలకొద్దీ చేతిలో ఫోన్ ఉంచుకోవడం వల్ల రేడియేషన్ విపరిణామం ఇది. సున్నితమైన ముఖ నిర్మాణాన్ని కూడా రేడియేషన్ ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సేపు మాట్లాడితే ఫోన్ వేడెక్కినట్లే చర్మమూ వేడెక్కుతుంది. ఈ వేడికి ఎక్స్‌పోజ్ అయినపుడు మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా డార్క్ స్పాట్స్, చర్మం కమిలిపోవడం వంటివి తప్పవు. ఇలాంటి మచ్చలు పోవాలంటే చర్మంపై అలోవేరా జెల్, కొబ్బరి నీళ్ళు కలిపి మసాజ్ చేయాలి. పబ్లిక్ టాయిలెట్లలో మొబైల్‌ను వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌పై బాక్టీరియా పేరుకుపోతే, చేతుల ద్వారా అది శరీరంలోని మిగతా భాగాలపై వ్యాపించే ప్రమాదం ఉంది.

-హిమజారమణ