భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిహెచ్.బసవపున్నారావు,
హరిపురికాలనీ (హైదరాబాద్)
ప్ర: భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది
సమా : దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యేలాగుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఉదర భాగాల్లో అనారోగ్యం సూచించబడుతోంది.
కోరుట్ల శివలింగం - ఎలగందుల, కరీంనగర్
ప్ర: గత సంవత్సరం మీరు మాకొక దీక్ష చెప్పినారు. వేములవాడ స్వామికి మొక్కు చెల్లించాము. ఫలితంగా కుమారుడు కలిగాడు. అయితే ఒక గిర్నీ భాగస్వామ్యంలో కోర్టు కేసులున్నాయి. మాకు జయమవుతుందా?
సమా: ప్రతి మంగళవారం చండీ సప్తశతి పారాయణం చేయించండి. సమర్థులైన బ్రాహ్మణుల చేత కనీసం 21 వారాలు చేసిన తరువాత చండీ హవనం చేయండి. జయమూ, శుభమూ కలుగుతాయి.
వాసా పరిమళమ్మ, గుంటూరు (ఆంధ్ర)
ప్ర: మా యింటి పెరట్లో పుట్ట పెరిగింది. తీసేయాలంటే అనర్థం అంటున్నారు. తీయకపోతే పాము చేరుతుందేమోనని భయం. తగు ఉపాయం చెప్పండి.
సమా: పుట్ట చుట్టూ ప్రతిరోజూ ఆవుపేడతో కలాపి చల్లండి. పుట్టలో ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. బెల్లానికి చీమలు చేరతాయి. పాము అసలు రానే రాదు. కొన్నాళ్లకు పుట్ట ఆవుపేడ వలన తొలగిపోతుంది.
కురువ శ్రీనివాసులు - అంబర్‌పేట (హై)
ప్ర :నా జన్మ తేదీ వివరాలు ఇచ్చాను. నా నక్షత్రం తెలపండి. గృహ యోగం ఎప్పుడు?
సమా: ఈ మాత్రం దానికి నాకు ఉత్తరం వ్రాయాల్సిన పనిలేదు. ఏ కంప్యూటర్ జాతకమైనా ఐదు నిమిషాల్లో పొందవచ్చు! మీకు గృహయోగం మీరున్న దిశ నుండి తూర్పు వైపు కలిగే అవకాశం వుంది. ఈ సంవత్సరం చివరలో ఆ దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి.
చెరువు భవ్యాప్రసాద్, రాజమండ్రి, (తూ.గో)
ప్ర: పంచాంగాలలో పలువురు సిద్ధాంతులు పలు రకాలుగా రాస్తున్నారు. దేన్ని నమ్మమంటారు.
సమా: ప్రాథమిక విషయాలలో అందరిదీ ఒకే పద్ధతి అయితే దృక్సిద్ధాంతమని, సూర్య సిద్ధాంతమని కొన్ని భేదాలున్నాయి. అలాగే చాంద్రమానం బార్హస్వత్య మానం, సౌరమానం ఇలా వేరు వేరు ప్రమాణాలూ ఉన్నాయి. ఏమైనా మీ ప్రాంతానికి చేరువగా ఉన్న సిద్ధాంతులు వ్రాసిన చాంద్రమాన పద్ధతి పాటించటం మేలు.
శ్రీరంగం లక్షీపతి శాస్ర్తీ (చెన్నై), తమిళనాడు
ప్ర: హైందవానికి వేదాలు ప్రమాణం కదా? మరి ఇన్ని చీలికలు ఎందుకు చోటుచేసుకున్నాయి.
సమా: వేద ప్రామాణికంగా ప్రబోధింపబడినదేంటో కూడా ప్రాథమిక సత్యంలో తేడా లేదు. ‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అనేది మాత్రమే అన్వయిస్తుంది. వేద బాహ్యమైన మతాలలోనే మూఢ విశ్వాసం చోటుచేసుకుంది. భక్తితో కూడిన విశ్వాసం- భక్తి విశ్వాసం- జ్ఞానంతో కూడిన వైరాగ్యం ‘జ్ఞాన వైరాగ్యాలు’ ఈ సులక్షణాలు వేద బాహ్యమైన మతాలలో కనిపించవు. అందుకే వైషమ్యాలు- అందుకే మూర్ఖత్వం.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం :

కూపన్ల ద్వారా మాత్రమే ప్రశ్నలు పంపాలి.
పోస్ట్‌కార్డ్‌లపై, కవర్ల ద్వారా పంపిన
ప్రశ్నలు పరిశీలించబడవు.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ