భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్ ప్రభాకర్ జోసెఫ్, విజయవాడ
ప్ర: మా నాన్నకు ఇద్దరు కుమారులం. మా అన్నయ్య చెన్నైలో ఉంటాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మకు డబ్బుకు లోటేమీ లేదు. కానీ, అమ్మానాన్నల ప్రవర్తనే మా పట్ల ఓకేతీరుగా ఉండదు. మా పల్లెలో వ్యవసాయాన్ని, మా వ్యాపారాన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. అయినా, ఎప్పుడో వచ్చిపోయే అన్నయ్యను ఇంట్లో ఎంతో గౌరవంతో చూస్తూ ఉంటారు. నన్ను మాత్రం ఏదో వర్కర్‌లాగా చూస్తుంటారు. నాకెంతో బాధగా ఉంటుంది. దీనికి జాతకమే కారణమా?
సమా: జాతకం కంటే మానవ సహజ స్వభావం కారణం. పవిత్ర బైబిల్‌లో ‘త్రీ పారబుల్స్’ (Threee parables) అని మూడు నీతి కథలున్నాయి. అవి మీరు తెలుసుకుంటే కారణం మీకే అర్థమవుతుంది. ‘తప్పిపోయిన గొఱ్ఱె, పడిపోయిన నాణెం, చెడిపోయిన కొడుకు’ అనే కథలు చదవండి. ఒక్క గొఱ్ఱె తప్పిపోతే దాని కోసం మందనంతా వదలి వెతుకుతూ ఉంటాడు గొఱ్ఱెల కాపరి. కింద పడిపోయిన నాణెం కోసం వెతుకుతూ చేతిలో వంద నాణెలను పట్టించుకోడు ఓ మనిషి. ఇంట్లో ఉన్న మంచి కొడుకు కన్నా, చెడిపోయి బయట తిరుగుతున్న కొడుకు కోసం వేదన పడతాడు తండ్రి. ఇదంతా మానవ నైజం. మీ అమ్మానాన్నలకు చెడును ఆపాదించకండి. మిమ్మల్ని మీరు చిన్న బుచ్చుకోకండి. అప్పుడు మీ వ్యక్తిత్వం మరింత గౌరవాన్ని పొందుతుంది.
జి.కామేశ్వరి, వనస్థలిపురం (హైదరాబాద్)
ప్ర: నా మనవరాలికి విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉందా?
సమా: మీరు అనుకున్నది ఆలస్యంగా జరగవచ్చు. కానీ, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండే అవకాశం లేదు.
జి.సింధూర,కావలి
ప్ర: నాకు ఉద్యోగం ఎప్పుడు?
సమా: దక్షిణ,ఆగ్నేయ దిశలుగా ఏప్రిల్, మే నెలల్లో అవకాశాలు సూచిస్తున్నాయి.
మునుకుంట్ల సుబ్రహ్మణ్యం,
వీరవాసరం (ప.గో)
ప్ర : నాకు ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం ఎప్పుడు?
సమా: వచ్చే తెలుగు సంవత్సరం దుర్ముభిలో మధ్యభాగంలో మంచిస్థాయి గల ఉద్యోగం మీరున్న దిశ నుండి ఆగ్నేయం కానీ, నైరుతిలో కానీ అవకాశం ఉంది.
క్రొవ్విడి లక్ష్మీ నరసింహం, తణుకు
ప్ర : నాకుమారునికి ఉద్యోగ యోగం, వివాహ యోగం ఉన్నవా?
సమా: మీ అబ్బాయికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలంటే- అతడే ఓ సంఖ్యను చెప్పాలి.
పల్లెర్ల చంద్రమోహన్, వరంగల్
ప్ర: మీరు ‘యవన జాతకం’ ఉందన్నారు కదా. మరి జ్యోతిష శాస్త్రం వేద సమ్మతమేనా? ఎందుకంటే యవనులు భారతీయులు కాదు కదా!
సమా: వేదాంగాలైన ఆరు శాస్త్రాల లోనిదే జ్యోతిష శాస్త్రం. జ్యోతిషాన్ని ‘వేద చక్షుహం’ అన్నారు. అంటే- వేదానికి కన్నువలే ప్రాధాన్యం కలదని భావం. ఇక యవన జాతకమంటారా? వేద విజ్ఞానం ఒకప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. సైబీరియాలో సరస్వతీ విగ్రహాలు లభ్యమయ్యాయి. స్కాండినేవియాలో అత్యంత ఎత్తయిన శివలింగం ఉంది. మక్కాలో కూడా మూడు వందల అరవై దేవతా విగ్రహాలు ఉండేవట! ‘కాస్పియన్ సీ’నే కశ్యప మహా సముద్రంగా వ్యవహరిస్తున్నారు. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసిన స్థానమే మక్కా పవిత్ర మఖము (క్షేత్రం).
శరబోజు పరబ్రహ్మచారి, పాలకుర్తి (వరంగల్)
ప్ర: ఇంచుమించు సంవత్సరం క్రితం మీరు సంతానం కోసం నాగ ప్రతిష్ఠ చేయమన్నారు. చేస్తామని మొక్కుకున్నాం కానీ చేయలేదు. మాకు సంతనప్రాప్తి కలిగింది. ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి?
సమా: నాగపంచమి, నాగచతుర్థి, గరుఢ పంచమి, సుబ్రహ్మణ్య షష్టి వంటి రోజుల్లో నాగప్రతిష్ఠ చేయటం శ్రేష్టం. దీనికి దక్షిణాయనం కూడా మంచిదే. విధానం గురించి ఈ శీర్షికలో చెప్పడం అసాధ్యం. స్థానిక పండితులను సంప్రదించండి.
జ్యోతిపంతుల లక్ష్మణరావు, మిర్యాలగూడ
ప్ర: జ్యోతిషంలో ‘్ధృవకం’ అంటే ఏమిటో తెలియజేయండి?
సమా: ప్రశ్న సంఖ్యల్లో ధృవక సంఖ్యలు వేరు. శుభలగ్న నిర్ణయంలో లగ్న ధృవకాలు వేరువేరుగా ఉంటాయి. ధృవకం అంటే ‘కేంద్రం’గా భావించాలి.
ద్రోణాద్రి విరూపాక్షయ్య, అనంతపురం
ప్ర: జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి బేధమేమిటి?
సమా: సంస్కారాలకు జన్మ నక్షత్రం ప్రధానం. వాస్తు, వ్యాపారాది లౌకిక విషయాలకు నామ నక్షత్రం ప్రధానం. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ