సబ్ ఫీచర్

రెప్పవేయకుండా చదివితే ప్రమాదమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. చాలామంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తలనొప్పి, కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 40 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.వైద్యులను సంప్రదించే ప్రతి పది మంది పిల్లల్లో నలుగురు కంటి చూపుతో బాధపడేవారే ఉండటం గమనార్హం. పాఠ్య పుస్తకాల్లో ముద్రించిన అక్షరాలు సక్రమంగా లేకపోతే చదివేటప్పుడు విద్యార్థుల నేత్రాలపై ఒత్తిడి పెరిగే ఫలితంగా పలు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రక్తహీనత కూడా నేత్రాలపై ప్రభావం చూపుతోంది. చదివేటప్పుడు ప్రతి 30 నిమిషాలకొకసారి విశ్రాంతి తీసుకుంటే కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోజుకు ఏడు గంటలు నిద్రలేని పక్షంలో కూడా విద్యార్థులకు కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సంవత్సరానికి ఒకసారైనా పిల్లలకు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించి నేత్ర వైద్యుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోషకాహార లోపంకూడా కళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందునే విద్యార్థులకు పరీక్షల సమయంలో తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలి.
చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కంటికి, పుస్తకానికి కనీసం ఒక అడుగు దూరం ఉండే విధంగా చూసుకోవాలి. కంటికి మరీ దగ్గరగా పుస్తకాలు పెట్టుకొని చదవొద్దు. వెలుతురు సరిగ్గా లేని గదుల్లో చదవకూడదు. ప్రతి నిమిషానికి 10 నుంచి 15సార్లు కంటి రెప్ప కొడుతూ ఉంటాలి. పుస్తకంపై నీడ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లపై కాకుండా పుస్తకం పైనే వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. సరైన క్రమంలో కూర్చొని చదివేందుకు ప్రయత్నించాలి. పడుకొని గాని, అటు ఇటూ తిరుగుతూ గాని చదవకూడదు. కంటి అద్దాలు ఉపయోగించేవాళ్లు వాటిని తీసి చదవద్దు. పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అదే పనిగా చదవకుండా అప్పుడప్పుడు కంటికి విరామం ఇవ్వాలి. కనీసం ఆరేడు గంటలు నిద్రపోయే విధంగా చూసుకోవాలి. పిల్లల చదువు విషయమే కాకుండా ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించి చదివితే విద్యార్థినీ విద్యార్థులు తమ కళ్లను పదిలంగా కాపాడుకోవడంతోపాటు పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యం చేరవచ్చు.

- కొత్త బాలరాజుగౌడ్