సబ్ ఫీచర్

జంతు సంరక్షణ .. మనందరి కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువులను వధిస్తూ పోతుంటే కొన్నాళ్లకు అవి పూర్తిగా అంతరించిపోతాయి. జంతువధ అమానుషం అయినా దీనిని గురించి పట్టించుకున్నవారంతగా లేరు. ఇది శోచనీయం, ఆందోళనకరం అంటూ వాపోతుంది సోనాలి పురెవలి... మాటలనడంతో సరిపెట్టుకోలేదు. ఆ మాటలను చేతలలో చూపించడం కోసం నడుం బిగించింది, పోరాడింది. చివరికి విజయం సాధించింది.
ఇంతకీ ఎలా పోరాడింది? ఏం సాధించిందో చూద్దాం... హిమాచలప్రదేశ్‌లో ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి గాదిమై పండుగ జరుగుతుంది. ఇది బలి ప్రధానంగా జరిగే పండుగ. ఈ పండుగ సందర్భంగా రక్తం ఏరులై పారుతుంది. గేదెలు, మేకలు, కోళ్ళు మొదలైన జీవాల కుత్తుకలు తెగిపడుతూనే ఉంటాయి. ఐదువేలదాకా జంతువులను ఈ పండుగలో బలివ్వడం జరుగుతుంది. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూనే జంతు సంరక్షకురాలిగా, జంతువుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న సోనాలికి ఈ పరిస్థితి దారుణంగా కనిపించింది. ఈ సామూహిక జంతువధను ఆపాలనుకుంది. నడుం బిగించింది. 2014 నవంబర్ 29న హిమాచల్‌ప్రదేశ్‌లోని హైకోర్టులో కేసు పెట్టింది. పోరాడింది. తన పోరాటానికి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్ కోర్టు జంతు క్రీడలను నిషేధిస్తూ తీర్పునిచ్చింది.
వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయినా ప్రవృత్తి రీత్యా జంతు సంరక్షకురాలిగా ఉన్న సోనాలి ఇప్పటికే ఒక జంతు సంరక్షకశాలను నిర్వహిస్తోంది. కేవలం జంతు హింసకు వ్యతిరేరకంగా పోరాడడంతోనే తన పాత్ర అయిపోలేదు. తను స్వయంగా వాటి పాలన, పోషణకు కొంత సమయం, శ్రమ వెచ్చించాలనుకుంది. నిజానికి జంతు హింసకు వ్యతిరేకంగా చిన్నతనం నుంచి తన మనసులో ఆలోచనలు రేకెత్తించేవని, టీవీలోగాని, పత్రికలలోగాని జంతు హింసకు సంబంధించి ఏవైనా వార్తలు విన్నా, చూసినా చాలా బాధ కలిగేదని, అప్పటి నుంచి తన మనసులో గూడుకట్టుకున్న ఆలోచనలే ఇలా జంతు సంరక్షణలో పనిచేసేలా చేసిందని చెప్తుంది సోనాలి. ఆ ఆలోచనలతోనే 2005లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో గుడ్ కర్మా షెల్టర్ పేరుతో ఒక రెస్క్యూ హోమ్‌ను ప్రారంభించింది. మొదట మూడు కుక్కలతో ప్రారంభించిన ఈ హోమ్‌లో ప్రస్తుతం కుక్కలతోపాటు పెద్ద సంఖ్యలో మేకలు, గుర్రాలు, గేదెలు లాంటి ఎన్నో జంతువులు రక్షణ పొందుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న జంతువులు, యజమానులు వదిలేసిన జంతువులు ఇలా సంరక్షణ అవసరమైన జంతువులను తాము తమ హోమ్‌లో సంరక్షణలోకి తీసుకుంటామని చెప్తున్నారు సోనాలి. ప్రస్తుతం ధర్మశాలలో కూడా మరొక హోమ్‌ను ప్రారంభించారు.
తన సంపాదనలో కొంతభాగాన్ని జంతు సంరక్షణకు ఖర్చు చేస్తున్న సోనాలి తను సాధించిన విజయానికి గాను పబ్లిక్ ఇంట్రెస్టు ఇలిగేషన్ అవార్డును కూడా అందుకుంది.

- మావూరు విజయలక్ష్మి