మెయిన్ ఫీచర్

మువ్వల సవ్వడికి మరో పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ రాష్టప్రతి ప్రతిభా పాటిల్ నుంచి సంగీత నాట్య అకాడమీ అవార్డును స్వీకరిస్తున్న డాక్టర్ ఆనంద శంకర్ జయంత్
.......................................
రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. నేటి సామాజిక సమస్యలకు పురాణాల్లోనే పరిష్కారం దొరుకుతుందని విశ్వసించే అనంద శంకర్ జయంత్ వరకట్నం, అత్యాచారాలు వంటి సామాజిక సమస్యలపై చైతన్యం తీసుకువచ్చేలా నృత్యరూపకాలను రూపొందించి దేశ విదేశాల్లో ప్రదర్శిస్తోంది. 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. భరతనాట్యంలో సంగీత నాట్య అకాడమీ అవార్డుతో పాటు వివిధ రాష్ట్రాలు ఇచ్చే పురస్కారాలను సైతం ఆమె అందుకున్నారు.
....................................
త్రివేణి సంగమంలా సాగే కూచిపూడి, భరతనాట్యం నర్తనశాలల్లో గజ్జెకట్టిన నృత్యకారిణి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్. ఆమె నృత్యకారిణే కాదు గురువు, వక్త, కొరియోగ్రాఫర్, రచయిత, పండితురాలు. ఇలా పలువురు నిష్ణాణితులు కొలువుదీరారు. విభిన్న కోణాల్లో తనదైన ముద్రవేసుకున్న ఆనంద్ శంకర్ జయంత్ చెన్నైకి చెందిన ప్రముఖ కళా సంస్థ భారత్ కళాచార్ నుంచి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాకరమైన ‘విశ్వకళా భారతి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రతిభకు కొలమానం రికార్డులు కాదనే ఈ కళా కుసుమం ఖ్యాతి ఇప్పటికే ఖండాంతరాలకు వ్యాపించింది. పేరులోనే కాదు ఆమె జీవితంలోనూ నిత్యనూతనంగా తాండవించే ఆనందాన్ని పలువురికి పంచుతూ క్యాన్సర్ బాధితులకు, యువతకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిస్తోంది. ఈ ప్రసంగాలకు యూట్యూబ్‌లో అభిమానులు వేలాదిమంది ఉన్నారు.
శాస్ర్తియ నృత్యమే శ్వాసగా..
తొలినాళ్లలో హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూలోలో చదివిన ఈ 53 ఏళ్ల నృత్యకళాకారిణి హిస్టరీ అండ్ కల్చరల్ కోర్సులో ఎంఫిల్, టూరిజంలో పి.హెచ్‌డీ చేసింది. రైల్వే ట్రాఫిక్ సర్వీసులో తొలి మహిళా అధికారిణి. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆనంద శంకర్ జయంత్ నాలుగేళ్ల ప్రాయం నుంచే పాదాలతో మువ్వల సవ్వడి చేసింది. కూచిపూడి, భారతనాట్యం, వీణ తదితర కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె 17 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు తిరిగివచ్చి ఆరుగురు విద్యార్థులతో శంకరానంద కళాక్షేత్ర నృత్య పాఠశాలను ఏర్పాటుచేసి ఎంతోమందికి శాస్ర్తియ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె రూపొందించిన నృత్య రూపకాల్లో బుద్ధం..శరణం.. గచ్చామి, నేనెవరిని, పంచతంత్ర, శ్రీకృష్ణ వందే జగద్గురుమ్, నవరస, దర్శనం, సత్యం -ఇలా విభిన్న ఇతి వృత్తాలతో రూపొందించిన నృత్య రూపకాలు ప్రపంచ స్థాయి గుర్తింపుపొందాయి. భారతీయ నృత్య రూపకాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆమె నేడు దేశ విదేశాల్లో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తున్నారు.
వరించిన అవార్డులు
2007లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. భరత నాట్యంలో సంగీత నాట్య అకాడమీ అవార్డుతో పాటు వివిధ రాష్ట్రాలు ఇచ్చే పురస్కారాలను సైతం ఆమె అందుకున్నారు. 2008లో క్యాన్సర్ బారిన పడిన ఆమె కుంగిపోకుండా చికిత్స తీసుకుని ఆ ప్రాణాంతక వ్యాధిని నుంచి బయటపడ్డారు. కిమో, రేడియోషన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఆమె తన శిష్యులకు శిక్షణ ఇచ్చేవారు. నాట్యమే అన్నీ నేర్పిందంటారు. ‘నవరస’ నృత్యరూపకంలో ఒక రసమే భయం. అలాంటి భయాన్ని అభినయించిన నాకు క్యాన్సర్ అంటే భయమెందుకు అని అంటారు. ఆ నృత్యరూపకమే తనలోని భయాన్ని పోగొట్టిందని చెబుతారు. ఇపుడు క్యాన్సర్ రోగుల కోసం ఆమె నృత్యప్రదర్శనలిస్తుంది. తన ప్రసంగాలతో క్యాన్సర్ పేషెంట్లలో స్ఫూర్తిని నింపుతుంది. అంతేకాదు సామాజిక సమస్యలైన వరకట్నం, అత్యాచారాలపై చైతన్యం తీసుకువచ్చేలా నృత్యరూపకాలను రూపొందించి దేశ విదేశాల్లో ఇస్తుంది. నేటి సామాజిక సమస్యలకు పురాణాల్లోనే పరిష్కారం దొరుకుతుందని విశ్వసించే అనంద శంకర్ జయంత్ ‘‘శాస్ర్తియ నృత్యాన్ని నేర్చుకునేవారు తొలి అడుగు బలంగా వేయండి. ఆ తరువాత ఈ రంగంలో నిలబడండి. పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ నృత్యాభ్యాసానికి ఎలాంటి మధ్య మార్గాలు లేవని, నిరంతర సాధనే వారు ప్రదర్శించే భావాలను సమ్నోహితులను చేస్తుందని’’ అంటారు.