భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టి వెంకట శివరామకృష్ణ, ఏలూరు
ప్ర: నాకు మంచి రోజులు ఎప్పుడు? ఈనెలలో పూర్తి కావలసిన కోర్టు వ్యవహారం ఇకనైనా ముగుస్తుందా?
సమా: ఇంకా కొన్ని రోజులు పట్టేట్టుంది. మీరు కాస్త ఓపిక పట్టవలసి వుంది. దైవసేవ చేయండి. ముఖ్యంగా మీ ఇంటి వేలుపును పూజించండి.
శ్రీరామచంద్రమూర్తి, విశాఖ
ప్ర: నా కుమారుల వివాహ విషయంలో ఆటంకాలు. కారణం తెలియటం లేదు.
సమా: మొదటిగా పెళ్లి కావలసిన అబ్బాయి జాతకం చూపించండి. మిగతావారి జాతకాలు కూడా సరైన పండితులకు చూపించండి. ఇంటి వాస్తును కూడా చూపించండి. ముఖ్యంగా వాయవ్య ఈశాన్య దిశలు.
కోట కుమార్, మెట్‌పల్లి (కరీంనగర్)
ప్ర: నా వయస్సు 34 సంవత్సరాలు. ఏ దురలవాటూ లేదు. అయినా ఒక వ్యాధితో బాధపడుతున్నాను. ఏం చేయను?
సమా: అనువంశికంగా ఆస్తిపాస్తుల వలే కొన్ని రకాల వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. మంచి బ్రాహ్మణుల చేత సుందరాకాండ పారాయణం చేయించండి. మీకంతా శుభం జరుగుతుంది. నలభై రోజుల పాటు పారాయణం చేయించాలి.
కె.ఎస్.పవన్‌కుమార్, విజయవాడ
ప్ర: నాకు మంచి రోజులు ఎప్పడు వస్తాయి?
సమా: గత సంచిత కర్మలు సరిగా లేకపోతే వర్తమానంలో కష్టాలు తప్పవు. ‘కర్మణా కర్మణః ఛేదః’ అన్నారు పెద్దలు. చెడుకర్మలను వదిలి మంచికర్మలు చేయడం ద్వారా జీవితంలో బాగుపడే అవకాశం వుంది. ముఖ్యంగా శివారాధన చేయండి. మంచి జరుగుతుంది.
గొదాసు బాలయ్య,
రామన్నపేట (నల్లగొండ)
ప్ర: నా భవిష్యత్తు గురించి తెలపండి.
సమా: నూరేళ్ళ భవిష్యత్తు గురించి చెప్పాలంటే ఈ శీర్షికలో ఎలా సాధ్యపడుతుందనుకున్నారు. సంపూర్ణ జాతకం చూడనిదే చెప్పటం సాధ్యం కాదు. అయినా, ఎంత గొప్పవారి జాతకంలోనైనా కొన్ని ఆటుపోట్లు, చీకటి వెలుగులు తప్పవు.
ఎస్.కె.జిలానీ బాషా, వనంపల్లి (ప.గో)
ప్ర: నాకు బట్టల వ్యాపారం కలిసి రావటం లేదు. మరేదైనా వ్యాపారం గురించి చెప్పండి.
సమా: కిరాణా కొట్టు మీకు లాభించే అవకాశం వుంది. అది ప్రయత్నించండి. ‘చిల్లర శ్రీమహాలక్ష్మి’ అనే సామెత గుర్తుకు తెచ్చుకోండి.
ఎ.బాలసుబ్రహ్మణ్యం,
బనగానపల్లె (కర్నూలు)
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగం, జీవితంలో స్థిరత్వం, వివాహం ఎప్పుడు?
సమా: మూడూ వేర్వేరు ప్రశ్నలు. మీకు ప్రభుత్వోద్యోగ యోగం కనిపించటం లేదు. 2016 చివరిలో వివాహయోగం కనిపిస్తోంది. ఉత్తర, ఆగ్నేయ దిశల నుండి సంబంధం వస్తుంది.
బి.్భషణం, దెందులూరు (ప.గో)
ప్ర: నేను వ్యవసాయాన్ని ప్రారంభిద్దామనుకుంటున్నాను. బాగుంటుందా?
సమా: బాగానే వుంటుంది. ముఖ్యంగా ‘క్యాష్ క్రాప్స్’ కానీ, పండ్ల తోటలు, కూరగాయలు వంటివి మీకు లాభించే అవకాశం వుంది.
డి.వి.రాఘవాచారి,
తిమ్మాపురం (ప.గో)
ప్ర: నా సోదరుడు 20 సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయాడు. అతను జీవించి ఉన్నాడా?
సమా: జీవించే ఉన్నాడు. మంచి స్థితిలోనే ఉన్నాడు. ఈ సంవత్సరమే మీ వద్దకు తిరిగిరాగలడు.

ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ