మెయిన్ ఫీచర్

ఆధ్యాత్మికతే ఆభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మహిళను గౌరవించే విధానంపైనే మన జాతి ప్రగతి ఆధారపడి ఉంది. ఆమె ఉన్నతికి పాటుపడనంతకాలం ప్రపంచ పురోగతిలో ఎలాంటి మార్పు జరగదు’’
***
‘‘కుటుంబానికే కాదు ప్రపంచానికే శక్తి మహిళ. అందుకే దైవసమానురాలైంది. ప్రపంచమంతా ఆ శక్తిపైనే ఆధారపడి పనిచేస్తుంది’’
-స్వామి వివేకానంద

స్ఫురదీపి అయిన ఈ యువకిశోరానికి అమ్మగా ఆకలిదప్పులు తీర్చటమే కాదు ఆహార్యంలోనూ మార్పులు తీసుకువచ్చి అక్కడ ఉన్నన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడింది కూడా అమెరికా దేశ మహిళలే. అమెరికా పర్యటనలో అడుగడుగన వెన్నుదన్నుగా నిలిచిన ఆయనను దర్శించినా..స్పృశించినా దివ్యానుభూతి కలిగేదంటారు.

ఆధ్యాత్మిక శిఖరం, యుగాచార్యుడు, దార్శనికుడు, దేశభక్తుడు- ఇలా ఎన్నో విశేషణాలను సజీవంగా నిలుపుకున్న స్వామి వివేకానంద జీవితం, సందేశం ఆధునిక మహిళకు ఆశాదీపంగా నిలుస్తుంది. తొమ్మిదేళ్లపాటు యావత్తు ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న స్వామి వివేకానంద జీవించింది 39 సంవత్సరాలే అయినప్పటికీ ఈ యుగానికి సరిపడా సందేశాన్ని మనకందించి వెళ్లారు.
ఆనాడు అలుపెరగని ఆయన ప్రపంచ పర్యటనలో ఎంతోమంది మహిళలు ఆయన వ్యక్తిత్వానికి ప్రభావితులయ్యారు. చికాగాలో జరిగిన విశ్వ మత సభల్లో సింహనినాదం చేసిన యువకిశోరానికి కావల్సిన శక్తినిచ్చింది శారదమాత ఆశీస్సులేనని చెబుతారు. ఓ విధంగా అమెరికాలో తాను దిగ్విజయంగా తన సందేశాన్ని ఇవ్వటానికి సహకరించింది కూడా అమెరికా తల్లులేనని సవినయంగా అంటారు. ఆకలితో నడిచే ఓపిక లేక ఫుట్‌పాత్‌పై కుప్పకూలిన సమయంలో ఎదురింటి తలుపులు హఠాత్తుగా తెరుచుకుని ఆ ఇంటి యజమానురాలు జార్జ్ హెల్ సతి స్వామిజీకి ఆశ్రయం ఇచ్చి విశ్వమత సభల్లో పాల్గొనటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

విశ్వమత సభల్లో తన ప్రసంగాన్ని ఆరంభించే ముందు ఆయన మనసులో సరస్వతిదేవికి మొక్కుకుని తన ప్రసంగాన్ని ఆరంభించారు. ‘అమెరికా సోదర సోదరీమణుల్లారా’ అనే ఒకేఒక్క మాటకు ఆ సభ మొత్తం మూడు నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
స్ఫురదీపి అయిన ఈ యువకిశోరానికి అమ్మగా ఆకలిదప్పులు తీర్చటమే కాదు ఆహార్యంలోనూ మార్పులు తీసుకువచ్చి అక్కడ ఉన్నన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడింది కూడా అమెరికా దేశ మహిళలే. అమెరికా పర్యటనలో అడుగడుగన వెన్నుదన్నుగా నిలిచిన మహిళలు ఆయనను దర్శించినా..పాదాలు స్పృశించినా దివ్యానుభూతి కలిగేదంటారు. ఓ రోజు కైరో వీధుల గుండా వెళుతుండగా.. కొంతమంది వేశ్యలు ఆయన్ని రమ్మని పిలిచారు. ఆయన వారి వద్దకు వెళ్లగానే వారిలో అపవిత్ర భావాలన్నీ తొలగిపోయాయి. ఒకామె స్వామిజీని చూస్తూ.. ‘మీరు భువిలో వెలసిన దైవం’ అంటూ కన్నీటి పర్యంతమవుతుంది. ఇలా ఆయన సాంగత్యం ఎంతో మంది మహిళలకు సాంత్వన కలిగించినందునే ఎంతోమంది ఆయన వెంట నడిచారు. వారిలో ముఖ్యులను గురించి తెలుసుకుందాం.
రూపురేఖలు దిద్దిన ‘దేవి’
లోకంలో ‘యుగానికొక్కడు’గా నిలిచిన మహనీయుడు స్వామి వివేకానందుడి వంటి వ్యక్తికి జన్మనిచ్చిన భువనేశ్వరీ దేవి నిజంగా దేవతే. నరేంద్రుడికి చిన్నతనంలోనే భవిష్యత్ రూపురేఖలు దిద్దింది. కుటుంబం దారిద్య్రంతో విలవిలలాడుతున్నా పెద్దకుమారుడైన నరేంద్రుడిపై ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నా, విశాల హృదయంతో ఆయన సన్యసించడానికి అనుమతి ఇచ్చింది.
శిష్యులైన ‘మణు’లు
సోదరి నివేదిత :్భరతీయ నారీమణుల్లో ‘అక్షర’ చైతన్యం వెల్లివిరియాలని జీవితానే్న ధారపోశాడు. ఇందుకోసం సోదరి నివేదితను కరదీపిగా స్వామిజీ మలచి ఆమెను భారతదేశానికి రప్పించారు. స్ర్తిలకు విద్యా సౌకర్యాన్ని కల్పిస్తే, వారి సమస్యలను వారే పరిష్కరించుకునే శక్తి కూడగట్టుకుంటారని చాటారు.
జోసఫీన్ మాక్లియోడ్ : వివేకనందుని బోధనలకు ప్రభావితురాలైన మరో మహిళ కుమారి జోసఫీన్ మాక్లియోడ్. సుమారు ఏడేళ్ళపాటు స్వామితోకలిసి సేవ చేసింది. నివేదితకు వివరించినట్టే ఆమెకు కూడా స్వామి భారతదేశ స్థితిగతులను చెప్పి, వీటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే విచ్చేయాలని విన్నవించారు. జోసఫీన్ ఇచ్చిన విరాళంతో స్వామి ‘ఉద్బోధన్’ అనే బెంగాలీ పత్రికను ప్రారంభించాడు. ఆమె ఏకధాటిగా 40 ఏళ్లపాటు స్వామి బోధనలు ప్రచారం చేసింది. ఒకసారి స్వామి జోసఫీన్‌ను ‘ఓం’ మీద ఒక వారం పాటు ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ఆమె హృదయంలో కాంతి ప్రకాశించినట్టు అనుభూతి కలిగింది.
మేడమ్ ఎమ్మా క్లేవ్: క్లేవ్ అమెరికాలో సుప్రసిద్ధ గాయని. ఆమె ఎన్నో ఘనవిజయాలు సాధించినా అనేక కష్టాల్లో మునిగిపోయింది. చివరకు ఆత్మహత్యే పరిష్కారమార్గమని తలచింది. ఒక రోజు స్వామి వద్దకు వెళ్ళింది. ధ్యానంలో ఉన్న స్వామి ఆమెలో దాగిఉన్న ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేశారు. అంతే మనసు వికసించింది. తర్వాత స్నేహితుల వద్ద ఆమె ‘స్వామి వివేకానంద నా మెదడును ఆవరించి ఉన్న జాఢ్యాలను అన్నింటినీ నిర్మూలించి, నిర్మలమైన, ప్రశాంత భావాలను ప్రవేశపెట్టారు’ అని చెప్పుకొంది. అలాగే, స్వామి బోధనలకు మేరి హేల్, హేల్, బాగ్లే అనే మహిళలు ఆకర్షితులయ్యారు.
ధీరమాత : కేంబ్రిడ్జిలో నివసించే ఓల్‌బుల్‌ను ‘్ధరమాత’గా స్వామి సంబోధించేవాడు. ఈమె నార్వేజియన్ వయొలిన్ విద్వాంసుని భార్య. ఓల్‌బుల్ వివేకానందతో మాతృవాత్సల్యంతో కూడిన స్నేహబంధాన్ని సంపాదించింది. ఈమె నిర్ణయాలపై స్వామికి విశ్వాసం ఉండేది. ‘ఇంతకుముందు నీ పట్ల ప్రేమ మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం నా జీవితాన్ని కనిపెట్టి ఉండటానికి దివ్యజనని నిన్ను నియమించినట్టుగా అనిపిస్తోంది’ అనేవారు.
స్ర్తిలను నిర్లక్ష్యం చేస్తే పతనమే..
స్వామి దృష్టిలో స్ర్తి అంటే శక్తికి ప్రతిరూపం. ఆ శక్తిని గౌరవించకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల దేశం పురోగమించదు. స్ర్తి జాతిని అణచివేయడం, కులం పేరిట పీడించడం. ఈ రెండూ ఉన్నన్నాళ్ళు దేశంలో ఘోరపరిస్థితులు సంభవిస్తుంటాయి. విదేశాల్లో స్ర్తికి సముచిత స్థానం ఉంటుంది. అక్కడి వారికి స్వేచ్ఛ ఉంటుంది. అందుకే అక్కడ స్ర్తిలు విజ్ఞానవంతులై ఉంటారు. మనదేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ స్ర్తి ఉండాల్సిన స్థానంలో ఉండకపోవడం వల్లనే దేశం బలహీనంగా, వెనుకబడినదిగా ఉంటుందని హెచ్చరించారు.
సీతే ఆదర్శం
కష్టాలను ఓర్చిన సహనశీలి. భర్త విశ్వాసాన్ని చూరగొన్న పరమసాధ్వి, స్వచ్ఛతకు, పవిత్రతకు మారుపేరు సీత. ప్రపంచంలో ఎక్కడ వెదికినా ఇటువంటి మహిళ కానరాదు. కష్టాలకు కలత చెందక, తనువులు చాలించక సీత వలె దిటవుగా ఉండాలని స్వామి వివేకానంద బోధించేవారు. మన పురాణాలు, ఇతిహాసాలు అదృశ్యమైనా ప్రతీ భారతీయుని హృదయంలో సీత మాత్రం ఒక ఆరాధ్యదేవతగా నిలిచిపోవాలని నొక్కి వక్కాణిస్తారు. అప్పుడే నిజమైన పురోగతి దేశంలో వికసిస్తుందని చాటిచెప్పారు.
పురుషుల జోక్యం వద్దు
స్ర్తిలను విద్యావంతులను చేయడమే పురుషుల విధి. అంతవరకు పురుషుల పాత్రను పరిమితమవ్వండి. వారికి అవసరమైన సంస్కరణలను వారే రూపొందించుకుంటారు. ఆ స్వేచ్ఛ వారికి ఇవ్వాల్సిందేనని స్వామిజీ వారి సామర్థ్యాన్ని చాటిచెప్పారు.

-గున్న కృష్ణమూర్తి