జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటనలతో చిక్కులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లపై ప్రకటనలతో బిహార్‌లో ఓడిపోయాం
రామమందిరం అంశంతో యుపిలో ఇబ్బందులే
బిజెపి సీనియర్ నేతల మనోగతం

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించవలసిన అవసనం ఉందని ప్రకటించి బిహార్ విభానసభ ఎన్నికలలో బిజెపి ఓటమికి అవకాశం కల్పించిన ఆర్‌ఎస్‌ఏస్ ఇప్పుడు రామమందిరం నిర్మాణాన్ని తెరపైకి తెచ్చి ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికలను పార్టీకి సవాలుగా మార్చనుంది. రామమందిరం నిర్మాణంపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర నినసన వ్యక్తం చేస్తూ, రాజ్యసభలోప్రభుత్వ వివరణకు డిమాండ్ చేసింది. భగవత్ చేసిన ప్రకటనతో ఉత్తరప్రదేశ్‌లో తిరిగి మత కలహాలు ప్రారంభమయ్యే ప్రమాదం దాపురించిందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో అయోధ్యలో రామమందిరం నిర్మితమై తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేస్తూ, ఆలయ నిర్మాణానికి సమాజం అన్ని విధాలా సమాయత్తం కావాలని మోహన్ భగవత్ ఇటీవల పిలుపిచ్చారు. తమ అభిమతాన్ని తేటతెల్లం చేస్తూ ఆయన ఆనేక సందేశాలు పంపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అనేకమంది ప్రముఖలు విహెచ్‌పి నాయకుడు అశోక్ సింఘాల్ సంస్మరణ సభలో రామాలయం నిర్మాణమే ఆయనకు శాంతి కలిగిస్తుంది కాబట్టి నిర్మాణానికి రంగం సిద్ధం చేయాలని పిలుపిచ్చారు. భగవత్ చేసిన ప్రకటనతో తాము ఇబ్బందుల్లో పడుతున్నామని బిజెపి నాయకులు చెబుతున్నారు. బిహార్‌లో ఓడిపోయిన తరువాత కొన్ని ముఖ్యమైన సంస్కరణలకు ప్రధాని మోదీ మార్గాన్ని సుగమమం చేసుకుంటున్న తరుణంలో భగవత్ చేసిన ప్రకటన తమను ఇబ్బందులపాలు చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి. వివాదాస్పద స్థలం విషయం ఇంకా తేలలేదు. పరస్పర అంగీకారం లేదా న్యాయస్థానం తీర్పుకు లోబడి తదుపరి అడుగులు వేయవలసి ఉంటుంది. రామాలయ నిర్మాణం ఎన్నికల ప్రణాళికలో ఉన్నప్పటికీ అభివృద్ధిని విస్మరించేది లేదని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసిన నేపథ్యంలో రామాలయ నిర్మాణంపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత చేసిన ప్రకటన అదనపు భారంగా మారుతోందని పార్టీ నేతలు వాపోతున్నారు. అయితే అధినాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదిస్తే ఒక స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి.