బిజినెస్

హార్లే-డేవిడ్‌సన్ బైకులు ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: లగ్జరీ బైక్‌ల తయారీ దిగ్గజం హార్లే-డేవిడ్‌సన్ తమ బైక్ ధరలను పెంచింది. కొన్ని రకాల మోడళ్ల ధరలను 30,000 రూపాయలకు వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకుల మధ్య ధరలు పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. స్ట్రీట్ 750, స్పోర్ట్స్‌టర్ ఫ్యామిలీ, సాఫ్‌టెయిల్ రేంజ్ మోడళ్లలోని వివిధ రకాల బైక్ ధరలను పెంచుతున్నామని వివరించింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.