అనంతపురం

బిల్లుల చెల్లింపులో మతలబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నగర పాలకసంస్థలో ఆధిపత్య పోరు
* బయటపడ్డ గ్రూపులు..
* ఉన్నతాధికారిపై దౌర్జన్యం...
అనంతపురం , డిసెంబర్ 18: నగర పాలకసంస్థలో అధికార పార్టీలో ఆధిపత్యపోరు పరాకాష్టకు చేరుకుంది. బిల్లుల చెల్లింపు విషయంలో పార్టీలోని మూడువర్గాలు ఎవరికివారు ఉన్నతాధికారిపై వత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఓవర్గం వారు ఉన్నతాధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడమేగాక, దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ వ్యవహారం నగర పాలకసంస్థలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలోని మూడు వర్గాల కుమ్ములాటల్లో తాము పావులుగా మారాల్సి వస్తోందని అధికారులు వాపోతున్నారు. కార్పొరేషన్‌లో మూడు నెలల కాలంగా బిల్లుల మంజూరుకు అవసరమైన ఎల్‌ఓసి జారీ కాకపోవటంతో పెండింగ్ బిల్లులు కొండలా పేరుకుపోయాయి. దీంతో బిల్లుల కోసం కాంట్రాక్టర్లకు నిరీక్షణ తప్పలేదు. రూ. ఐదు వేల బిల్లు కోసం చిన్న కాంట్రాక్టర్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుకై లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసి)కి బుధవారం ట్రెజరీ నుంచి అనుమతి లభించింది. బిల్లుల చెల్లింపునకు తీసుకువచ్చిన ఎల్‌ఓసికి తగ్గట్టుగా ఒక వర్గం వారి బిల్లులకే అధికప్రాధాన్యం ఇచ్చారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ సమాచారం తెలుసుకున్న ఒక ముఖ్యనేత నగరపాలక సంస్థ ఉన్నతాధికారిని పిలిపించి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ‘మిమ్ములను ఏరికోరి తెప్పించుకున్నది మా ఆదేశాలు మేరకు పనిచేయటానికే. అంతేగానీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించటానికి కాదంటూ’ కాస్త గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఒక వర్గానికే ప్రయోజనం చేకూర్చేలా తయారుచేసిన జాబితాను మార్చి తమ వారికి బిల్లులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మరో నేత తమవర్గం వారి బిల్లుల చెల్లింపులు పరిగణలోకి తీసుకోవాలని ఆ అధికారికి సూచించినట్లు తెలిసింది. ఈ దశలో ఓవర్గం నేత అనుచరులు ఉన్నతాధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడమేగాక దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై అటు నగరపాలక సిబ్బంది గానీ, ఇటు పార్టీనేతలు గానీ పెదవివిప్పకపోవడం గమనార్హం.
దొంగనోట్ల ముఠా అరెస్టు
గార్లదినె్న, డిసెంబర్ 18 : మండల పరిధిలోని కల్లూరు రైల్వేస్టేషన్‌లో దొంగ నోట్లు చెలామణి చేసే ముఠాను శుక్రవారం అరెస్టు చేసినట్లు సిఐ శివనారాయణ, ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు అనంతపురానికి చెందిన సురేంద్రబాబు, గుంతకల్లు మండలం నాగసముద్రానికి చెందిన రామకృష్ణ, కణేకల్లు మండలం ఆదిగానిపల్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఓ డెయిరీలో పని చేస్తున్న అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన సురేంద్రబాబుకు గుంతకల్లు మండలం నాగసముద్రానికి చెందిన రామకృష్ణ పరిచయమయ్యాడు. వీరితోపాటు కణేకల్లు మం డలం ఆదిగానిపల్లికి చెందిన రాజ్‌కుమార్ ముఠాగా ఏర్పడి దొంగనోట్లు చ లామణి చేసేవారని తెలిపారు. ఇందులో భాగంగానే కల్లూరు ఆర్‌ఎస్‌లో దొంగనోట్లు చలమణి చేస్తున్నారని సమాచారం అందడంతో హుటాహుటిన సిబ్బందితో దాడి చేసిన పట్టుకున్నట్లు తెలిపారు. రాజ్‌కుమార్‌పై ఇదివరకే ఉరవకొండలో ఛీటింగ్ కేసు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.