కృష్ణ

పనివేళలు పాటించకుంటే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 22: ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని విజయవాడ డివిజన్ పరిధిలో త్వరలో అమలు చేయనున్నట్లు విజయవాడ సబ్ కలెక్టర్ సృజన వెల్లడించారు. మంగళవారం ఆమె స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసమయంలో సూపరింటెండెంట్ ఆలస్యంగా రావటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వేళాపాళా లేకుండా విధులకు హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఉద్యోగుల హాజరుపై బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె మండలంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై వీఆర్వోలు నిఘా ఉంచాలన్నారు. అన్యాక్రాంతమైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న ఎంపియుపి స్కూల్‌ను, రేషన్ షాపును తనిఖీ చేసి ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. సబ్జపాడు రోడ్‌లో పేదల కోసం కొనుగోలు చేసిన ఇళ్లస్థలాలను పరిశీలించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పుల్లూరులో నిర్మితమవుతున్న సిసిరోడ్లను పరిశీలించారు. ఇదే సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చండ్రగూడెంలో జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీంచటానికి వచ్చారు. చండ్రగూడెం గ్రామంలో నుండి జాతీయ రహదారిని విస్తరించాల్సి రావటం వల్ల విలువైన తమ భూములు కోల్పోతున్నామని, అలాకాకుండా బైపాస్ రోడ్ ద్వారా రహదారని విస్తరించాలని రైతులు కోరారు. విషయాన్ని జాతీయ రహదారి విస్తరణ అధికారుల దృష్టికి తీసుకుపోయి అవకాశమున్నంత వరకూ రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తహశీల్దార్ కెవి శివయ్య, ఆర్‌ఐ రామ్మూర్తిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సర్కారీ వైద్యంపై మరింత నమ్మకం కలిగించండి

మచిలీపట్నం, డిసెంబర్ 22: సర్కారీ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించే విధంగా కృషిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యులపై ఉందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై అరాతీశారు. సి.టి స్కాన్ ఫిలిమ్స్ కొరతపై ఆస్పత్రి ఆర్‌ఎంఓ త్యాగిపై మండిపడ్డారు. మరమ్మతులకు గురైన అత్యాధునికమైన సి.టి స్కాన్ మిషన్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీరు మాత్రం విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. సి.టి స్కాన్ మిషన్ పనిచేస్తున్నా రోగులకు ఫిలిమ్స్ ఇవ్వడం లేదన్న ఫిర్యాదుపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలిమ్స్ కొరత ఎందుకు వస్తుందని ఆర్‌ఎంఓ త్యాగిని నిలదీశారు. ఫిలిమ్స్ సరఫరాదారుకు కొంత బకాయి ఉండటం వల్ల కొరత ఏర్పడుతోందని ఆయన చెప్పటంతో ఆమె మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఎప్పటికప్పుడు తాను ఫిలిమ్స్ కొనుగోలు చేసేందుకు చెక్కులు ఇస్తున్నా బకాయి ఎందుకు ఉందని ప్రశ్నించారు. మరోసారి తాను ఆస్పత్రి తనిఖీకి వచ్చినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైతే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసి రోగులకు మరిన్ని సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వ్యాధులు నయం చేసేలా వ్యవహరించాలన్నారు. సర్కారీ వైద్యంపై భరోసా కల్పించేవిధంగా వైద్యుల ప్రవర్తన ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆమె ఆస్పత్రిలో రూ.కోటీ 40లక్షలతో నిర్వహిస్తున్న ప్లే షిఫ్టింగ్ పనులను పరిశీలించారు. కిచెన్ షెడ్డు మరమ్మతులు, ప్యాచ్ వర్క్‌లు, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి అనూరాధ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ఎపిఎంఐసి డిసి డిఇ నాగరాజు, ఎఇ శివకుమార్, గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

కాల్‌మనీ వ్యాపారులను
కఠినంగా శిక్షించాలి
మచిలీపట్నం , డిసెంబర్ 22: కాల్‌మనీ పేరుతో పేదల రక్తాన్ని పీలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ర్తి విముక్తి సంఘటన జిల్లా ఉపాధ్యక్షురాలు పామర్తి అంజమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్‌మనీ పేరుతో సాగుతున్న వడ్డీ వ్యాపారాన్ని, మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవరాలతో చెలగాటమాడుతున్న వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. రైతుకూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె జగన్, జిల్లా నాయకులు కొప్పినేని ఉమా మహేశ్వరరావు, ఎఐఎఫ్‌టియు(న్యూ) నాయకులు ముచ్చు సుధాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

తోడేళ్లదిబ్బలంకలో రెండిళ్లు దగ్ధం
* రూ.5లక్షల ఆస్తి నష్టం
తోట్లవల్లూరు, డిసెంబర్ 22: మండలంలోని రొయ్యూరు గ్రామ పంచాయతీ శివారు తోడేళ్లదిబ్బలంకలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు నివాస గృహాలు పూర్తిగా కాలిపోయి రూ.5లక్షల ఆస్తి నష్టం జరిగింది. మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం రెండు కుటుంబాలను వీధిన పడేసింది. పసుపులేటి ప్రకాశరావు, మొగదాసు కోటేశ్వరరావు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ముందుగా ప్రకాశరావు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. గాలులకు వెనుక వున్న కోటేశ్వరరావు సిమెంట్ రేకుల షెడ్డుకి వ్యాపించాయి. అందరూ పొలాల్లో వున్న సమయంలో అగ్నిప్రమాదం జరగటంతో ఇళ్ల నుంచి చిల్లిగవ్వ కూడా తీయలేకపోయారు. ప్రకాశరావు ఇంటిలో రూ.లక్ష నగదు, 160 గ్రాముల బంగారు నగలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.లక్ష 50వేల విలువైనల ఇంటి సామగ్రి కాలి బూడిదయింది. కోటేశ్వరరావు ఇంటిలో రూ.20వేల నగదు కాలిపోయింది. కోటేశ్వరరావుకు చెందిన గేదె మంటల్లో చిక్కుకుని శరీరం కాలిపోయింది. కోటేశ్వరరావు ఇంటిలో పేలిన సిలెండర్ పక్కనే ఉన్న రావులపల్లి పోతురాజు ఒంటి ఇంటి గోడకు తాకటంతో గోడ పగిలి ఇంటిలోని సామగ్రి చెల్లాచెదురయ్యాయి. బైక్ పాక్షికంగా కాలింది. ఆధార్, రేషన్ కార్డులు, ఎల్‌ఐసీ బాండ్లు కాలిపోయాయి. రెండు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. వ్యవసాయ పనుల కోసం రూ.3లక్షలు అప్పు చేశామని, అప్పులు తీర్చేందుకు ఇంటిలో దాచిన రూ.లక్ష కాలిపోయాయని, క్రిస్మస్‌కి తెచ్చిన కొత్తబట్టలు కాలిపోయాయని పసుపులేటి నాగలత కన్నీరుమున్నీరుగా విలపించింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో రవికుమార్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక వాహనం కృష్ణా నదీపాయలో దిగబడిపోవటంతో సకాలంలో రాలేక తీవ్ర నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తహశీల్దార్ జి భద్రు, విఆర్‌ఓ రాంకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

ధనుర్మాస మహోత్సవాల్లో ఘనంగా వేద పారాయణ
మచిలీపట్నం , డిసెంబర్ 22: స్థానిక రాబర్టుసన్‌పేట శ్రీరంగనాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వేద పారాయణ నిర్వహించారు. తంగిరాల రాధాకృష్ణమూర్తి బ్రహ్మత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులు మంత్రాల కనక హనుమత్ శాస్ర్తీ, చిట్టి యజ్ఞనారాయణ, రాళ్ళపల్లి సాయి వెంకటేశ్వరశాస్ర్తీ, శిష్ట్లా శ్రీమన్నారాయణ శర్మ, లంకా వ్యాసకృష్ణ సీతారామశాస్ర్తీ సుస్వరంతో యజుర్వేద పారాయణ చేశారు.
ఈసందర్భంగా రంగనాయక స్వామి, గోదాదేవి మూర్తులను ఆలయ అర్చకులు ముత్తేవి సత్యనారాయణాచార్యులు, ముత్తేవి శ్రీనివాసాచార్యులు కన్నులపండువగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అడబాల శ్రీనివాస్, రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి టివివి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
నూజివీడు, డిసెంబర్ 22: తెలుగు రాష్ట్రాల్లో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటుతో సాంకేతిక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు విశ్వవిద్యాలయం కులపతి డి రాజ్‌రెడ్డి వెల్లడించారు. ఎటువంటి విద్యాసౌకర్యాలు, ఇతర సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రిపుల్ ఐటీలను రూపకల్పన చేశామని చెప్పారు. మంగళవారం సాయంత్రం స్థానిక ట్రిపుల్ ఐటీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన దేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని విధంగా సౌకర్యాలతో పాటు 36 వేల మంది విద్యార్థినీ విద్యార్ధులకు వసతి, భోజన విద్యాసౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా రూపొందించామన్నారు. ప్రపంచ స్థాయిలో సాంకేతిక విద్యనందించి ఉన్నత విద్యావంతులను చేయటం ఆర్జేయుకెటీ ప్రధాన లక్ష్యం అని చెప్పారు.