చిత్తూరు

మున్సిపల్ బినామీ కార్మికులకు వేతనాలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమలుకాని బయోమెట్రిక్ అటెండెన్స్
మదనపల్లె, డిసెంబర్ 27: నిజమైన కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాల చెల్లింపులకై రాష్టవ్య్రాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల పరిధిలో పారిశుద్ధ్యశాఖ కాంట్రాక్టు కార్మికులకు బయోమెట్రిక్ హాజరుపట్టిక విధానాన్ని అమలుచేసింది. జిల్లాలో తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థలు, నగరి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుత్తూరు పురపాలక సంఘాలున్నాయి. ప్రతినెలా కార్మికులకు కాంట్రాక్టర్లు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని, డివిజన్‌కు కేటాయించిన సిబ్బందితో కాకుండా తక్కువ సిబ్బందితో ఎక్కువపనులు చేయించుకుంటున్నారని కార్మికులే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో స్పందించి ప్రభుత్వం 2013లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తూ.. కార్మికుల ఆధార్‌కార్డు, పనిచేస్తున్న సొసైటీపేరు, వయస్సు, అడ్రస్సు, బ్యాంకుఖాతా నెంబరు, ఇఎస్‌ఐ, ఇఫిఎఫ్, గుర్తింపుకార్డు నెంబరు తదితర వివరాలు సేకరించి కంప్యూటర్‌ద్వారా వారి వేలిముద్రలు సేకరించి ఆన్‌లైన్ సీడింగ్ చేశారు. ప్రతిరోజు విధులకు హాజరు, విధులు ముగించుకునే సమయాలపై బయోమెట్రిక్‌లో బొటనవేలుతో ముద్రవేస్తే హాజరైనట్లుగా కంప్యూటర్‌లో రికార్డు అవుతుంది. ఈవిధానం మదనపల్లె పురపాలకసంఘం పరిధిలో బయోమెట్రిక్ అమలుచేయకపోగా.. మున్సిపల్ పారిశుద్ధ్యవిభాగంలోని ఐదు డివిజన్‌లలో 170మంది కాంట్రాక్టు కార్మికులు పనులు చేస్తున్నట్లు ప్రతినెలా రికార్డులు సృష్టిస్తూ వేతనాలు చెల్లిస్తున్నారు. ఇందులో బినామీవర్కర్‌ల వేతనాలను అధికారులు, పాలకులు పంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇటీవల వచ్చిన పత్రికల కథనాలతో కార్మికులు ప్రత్యక్ష ఆందోళనలకు దిగడం, అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు కౌన్సిల్‌మీట్‌లో అధికారులను నిలదీయడంతో దద్ధరిల్లింది. ఈ రచ్చ అధికారపార్టీ అధిష్ఠానం వరకు వెళ్లింది. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 2015 ఏప్రిల్ మొదట్నించి టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ ఇచ్చిన కార్మికుల జాబితా ప్రకారం విధులకు హాజరుపై విచారణ చేపట్టారు. పారిశుద్ధ్యశాఖలోని సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా వారిని సైతం తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలోని ఆయా శాఖల అధికారులకు సర్క్యులర్ కూడా పంపించారు. పారిశుద్ధ్యశాఖ అధికారుల నివేదిక ప్రకారం 20మంది పనిచేయడం లేదని చెబుతుండగా, మున్సిపల్ కమిషనర్ విచారణలో 57మంది కార్మికులు పనిచేయడం లేదని బినామీ వర్కర్‌ల జాబితాను పాత్రికేయులకు విడుదల చేశారు. అంతేకాకుండా వారం, పదిరోజుల్లో కాంట్రాక్టుకార్మికులకు సైతం బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే యధాప్రకారం తక్కువగా కార్మికులు విధులకు హాజరవుతున్నా.. అటెండెన్స్ రిజిస్టర్‌లలో కార్మికులందరూ హాజరవుతున్నట్లు చూపుతుండటం కొసమెరుపు.
150మంది కార్మికులకు చెల్లించాలని కమిషనర్‌కు నోట్
మదనపల్లె మున్సిపాలిటీ 5డివిజన్‌లలో 170మంది కాంట్రాక్టు కార్మికులకు గాను కేవలం 150మంది పనిచేస్తున్నట్లు పారిశుద్ధ్యశాఖ అధికారికంగా మున్సిపల్ కమిషనర్‌కు నోట్ పెట్టారు. ఇందుకు ససేమిరా అన్న కమిషనర్ 110మందికే నోట్ సిద్ధం చేయాలని సూచించడం.. ఇందుకు కౌన్సిలర్లు కొందరు కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం వేతనాల చెల్లింపు ఓ కొలిక్కిరానుంది. పారిశుద్ధ్య పర్యవేక్షకుడు మురళీధర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో నవంబర్ నెల వేతనం ఆగిపోయింది. బినామీ వర్కర్‌ల పేర్లు తొలగించి మిగిలిన వారికే వేతనాలు చెల్లిస్తామని అధికారులు, పాలకులు బహిరంగ ప్రకటన చేశారు. ఇదిలావుండగా అధికారులు, పాలకుల మిలాఖత్‌తో బినామీ వర్కర్‌ల వేతనాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరో నాలుగురోజుల్లో డిసెంబర్ మాసం పూర్తవుతుండగా.. పండుగలు, నూతన సంవత్సవ వేడుకలతో కార్మికులు అవస్థలు పడకుండా వేతనాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మార్చివరకు 170మంది కార్మికులకు వేతనాలు విడుదల చేసి.. ఆపై ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్‌తో అధికార నిబంధనల మేరకు విడుదల చేయాలని కాంట్రాక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను వేడుకున్నట్లు సమాచారం. అందరికీ వేతనాలు చెల్లించేలా పారిశుద్ధ్యశాఖ రికార్డులు సిద్ధం చేసినప్పటికీ... మున్సిపల్ కమిషనర్ ఇందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్లు, పాలకుల మధ్య కార్మికులు బలవుతున్నారు. పాలకులు, కాంట్రాక్టర్‌లకు తలొగ్గి నిజమైన కార్మికులకు వేతనాలు చెల్లించి.. బినామీలకు వేతనాలు నిలుపుదల చేస్తారా.. లేక అందరికీ చెల్లిస్తారా అన్నదానిపై వేచిచూడాల్సి ఉంది.