తెలంగాణ

తెలంగాణలో బీజేపీ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభావం చాటుతోంది. గత ఎన్నికల సమయంలో కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకున్న బీజేపీ నేడు ఐదు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. నరేంద్ర మోదీ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తుందని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు బట్టి ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ పది స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశే్వశ్వరరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.