జాతీయ వార్తలు

బెంగాల్, ఒడిశాలలో బీజేపీ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ బెంగాల్, ఒడిశాలలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. బీజేపీ తన ఆధిక్యం ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైంది. పశ్చిమబెంగాల్‌లో మొత్తం 42 లోకసభ నియోజకవర్గాలు వుండగా బీజేపీ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ, ఏకంగా 16 స్థానాల్లో తన ప్రాబల్యాన్ని మెరుగుపరుచుకుంది. ఇక ఒడిశాలో బీజేపీ 14 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేడీ కేవలం 7 స్థానాల్లో ప్రభావం చూపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ముందంజలో ఉంది.