జాతీయ వార్తలు

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడమే నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జెఎన్‌యు వివాదంలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి శుక్రవారం మరింత తీవ్రమైంది. ఆర్థిక రంగంలో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం భావోద్వేగాలను రెచ్చగొడుతోందని, బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడమే పెద్ద నేరంగా చూస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌లు ఆరోపించారు. ‘ 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో దారుణంగా విఫలమైంది. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి వారు(బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్) భావోద్వేగాలతో ముడిపడిన జెఎన్‌యు సమస్యను లేవనెత్తారు’ అని శుక్రవారం పాట్నాలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లడుతూ నితీశ్ అన్నారు. అంతేకాదు, ఎలాంటి సాక్ష్యాధారమూ లేకుండా జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం ఆరోపణలు చేయడంపైన కూడా ఆయన మోదీ సర్కార్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. కాషాయ సిద్ధాంతాన్ని నమ్మే వారు జెఎన్‌యులో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేరు గనుకనే వారు దాన్ని టార్గెట్ చేసుకున్నారని కూడా ఆయన అన్నారు. మిగతా పార్టీలకు చెందిన వారు కూడా జాతీయ వాదులేనని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లనుంచి వారికి సర్ట్ఫికెట్ అక్కర లేదని నితీశ్ అన్నారు.
కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించడమే అన్నిటికన్నా పెద్ద నేరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అంటూ, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే తమ సానుభూతిపరులపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోవడం లేదని అన్నారు. ‘మీరు బిజెపికి చెందిన వారయితే చాలు హత్య చేసినా, రేప్ చేసినా, లేదా చావకొట్టినా నేరం కాదు. బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించడమే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద నేరం- ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కొత్త భారత శిక్షా స్మృతి’ అని కేజ్రివాల్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఎవరైనా ప్రశ్నిస్తే బాధితుడు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాడని చెప్తే చాలు మిమ్మల్ని వదిలేస్తారని కూడా ఆయన ఆ ట్వీట్‌లో అన్నారు.