జాతీయ వార్తలు

ప్రజల సొమ్ము దోచుకోనివ్వను : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:దేశ ప్రజల సొమ్మును దోచుకోనివ్వనని, తమ రెండేళ్ల పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యుపిఎ పాలనలో నిత్యం అవినీతికి సంబంధించిన వార్తలే టీవీల్లో వచ్చేవని, ఇప్పుడు అలాంటి అవకాశం లేదని అన్నారు. మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన అనంతరం నగరానికి చేరుకున్న మోదీ ఎల్‌బిస్టేడియంలో నిర్వహిస్తున్న బిజెపి మహాసమ్మేళనం సభలో పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను ఇక్కడి బహిరంగకు వచ్చినపుపుడ హైదరాబాద్ ప్రజలు సొంత డబ్బుతో టిక్కెట్ కొనుగోలు చేసి హాజరయ్యారని, అది ఒక చరిత్ర అని, అందుకు తెలంగాణకు వందనాలు చెబుతున్నానని అన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను తాను ఇక్కడ చూస్తున్నానని, రాజకీయ పండితులు జోస్యం చెప్పేముందు సరికొత్త అంశాలను పరిశీలించుకోక తప్పదని అన్నారు. తమ పాలనలో అందరినీ కలుపుకుపోయే పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. యుపిఎ హయాంలో ఎంపీలు గ్యాస్‌కూపన్లు అమ్ముకునేవారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. తమకు 120 కోట్లమంది భారతీయులే హైకమాండ్ అని అన్నారు. ఈ సభలో కేంద్రమంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.