జాతీయ వార్తలు

బిజెపి ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: హౌరా-గోరఖ్‌పూర్ రైలులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్సీ తున్నా పాండేపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పాండేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి బిహార్ శాఖ ప్రకటించింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పాండేను కోర్టులో హాజరుపరిచారు. ఆగస్టు 6వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. తాను బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించలేదని, సెల్‌ఫోన్ చార్జర్‌ను అడిగానని పాండే చెబుతున్నారు.