ఆటాపోటీ

సంజూకు ఊరట (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడుతున్న వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు పదో ఐపిఎల్ ఊరటనిచ్చింది. 2013 ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించినప్పుడు సంజూ పేరు క్రికెట్ వర్గాల్లో మారుమోగింది. 2015లో జింబాబ్వే టూర్‌కు వెళ్లిన టి-20 ఇంటర్నేషనల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ, అంతర్జాతీయ వేదికలపై విఫలమై, జట్టుకు దూరమయ్యాడు. తర్వాతి కాలంలో దాదాపు అంతా అతని గురించి మరచిపోయారు. ఫ్లాప్ షోలతో నీరుగారిపోయిన సంజూ మళ్లీ తనను తాను నిరూపించుకోవడానికి పదో ఐపిఎల్‌ను వేదికగా తీసుకున్నాడు. పుణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొని, 102 పరుగులు చేసి, ఈ ఐపిఎల్ సీజన్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అతను మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేశాడు.