రాష్ట్రీయం

నేడు బ్లాక్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం
పోలీసులు అప్రమత్తం
పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు

హైదరాబాద్, డిసెంబర్ 5: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొన్ని ముస్లిం సంఘాలు డిసెంబర్ 6వ తేదీని బ్లాక్ డేగా పాటించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కుట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. తెలంగాణలోని హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లోని భైంసా, నిర్మల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లాక్ డే సందర్భంగా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 6 ఉదయం నుంచి 7వ,తేదీ ఉదయం వరకు 144సెక్షన్ విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఆదోనిలతోపాటు ప్రధాన మున్సిపాలిటీల్లో కూడా పోలీసులు నిఘా పెంచారు. సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఉపేక్షించేదిలేదని హైదరాబాద్ సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ హెచ్చరించారు. ముఖ్యంగా పాతబస్తీలో 50మంది సిఐలను, 150మంది ఎస్‌ఐలతోపాటు ఐదువందల మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు కేటాయించారు. అదేవిధంగా వారం రోజులపాటు నగరంలో ఎలాంటి బహిరంగ సమావేశాలకు అనుమతిలేదని న గర కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్లతోపాటు రైల్వే స్టేషన్లు, ఆర్టీసి బస్సుస్టేషన్లు, విమానాశ్రయంలో అదనపు బలగాలను మోహరింపజేసినట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆధోని, గుంటూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్ సూచించారు. బ్లాక్ డే సందర్భంగా మతపరమైన ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.