అంతర్జాతీయం

నల్లజాతీయుల ఆందోళన హింసాత్మకం : నలుగురు పోలీసులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డల్లాస్‌: అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన నిరసన ర్యాలీలో ఆందోళనకారులు కాల్పులు జరపడంతో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. గత రెండు రోజుల్లో మిన్నెసోటా, లూసియానాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నల్లజాతి యువకులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. దీంతో అమెరికాలో పలుచోట్ల నల్లజాతీయులు ఆందోళనలు చేపట్టారు. డల్లాస్‌లో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు పోలీసులు మృతి చెందారు. ఏడుగురు పోలీసులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.