సంజీవని

రక్తప్రసరణకు దారి చూపే కవాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరమంతటా రక్తం నిర్దుష్ట మార్గంలో ప్రయాణం చేస్తుంటుంది. రక్తప్రవాహంది వన్ వే ట్రాఫిక్. ఆ వన్ వే అతిక్రమణ జరిగితే ముప్పే. గుండెలో నాలుగు గదులుంటాయి. పై రెంటినీ ఏట్రియమ్ అని, కింద రెంటినీ వెంట్రికల్స్ అని అంటారు. సాధారణంగా రక్తం వేరు వేరు సిరల ద్వారా వచ్చి రెండు ప్రధాన సిరల ద్వారా (సుపీరియర్ వేనాకేవా, ఇన్‌ఫెరియర్ వేనాకేవా) మొదట గుండెలోని కుడి ఏట్రియమ్‌నుంచి కిందనున్న కుడి వెంట్రికల్‌లోకి వెళుతుంది. గుండె పంప్ కాగానే అక్కడనుంచి పల్మొనరీ ఆర్టెరీస్ ద్వారా ఊపిరితిత్తులలోకి వెళుతుంది. అక్కడనుంచి రక్తంలోని కార్బన్‌డైఆక్సైడ్ బయటకు, శ్వాసించడంతో వచ్చిన ఆక్సిజన్ రక్తంలోకి మారతాయి. అలా ఆక్సిజన్‌తో నిండగానే రక్తం ఎడమ ఏట్రియమ్‌లోకి వచ్చి అక్కడనుంచి ఎడమ వెంట్రికల్‌లోకి వస్తుంది. రక్తం అక్కడనుంచి గుండె పంప్ చేయగానే ఈ పరిశుభ్ర రక్తం అయోర్టాద్వారా మిగతా శరీర భాగాలకు వెళుతుంది. ఇలా గుండెలోకి, గుండెనుంచి రక్తం ఒకే మార్గంలో ప్రయాణిస్తుంటుంది. గుండెలో వుండే కవాటాలు ఇలా రక్తం ఒకే మార్గంలో ప్రయాణించడానికి తోడ్పడతాయి. గుండెలో వుండే నాలుగు కవాటాల్లో దేనికైనా, ఏదైనా సమస్య వచ్చి రక్తం వెనక్కి చిమ్మితే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. గుండె ప్రతిస్పందనలోనూ ఈ నాలుగు కవాటాలు తమ విధిని ప్రతిక్షణం అప్రమత్తంగా నిర్వహిస్తాయి. రక్తం ప్రవహించే దారి రక్తం తప్పకుండా ఎల్లవేళలా కాపాడుతుంటాయి.
ఎడమ ఏట్రియమ్, ఎడమ వెంట్రికల్‌మధ్య వుండే కవాటాన్ని మైట్రల్ వాల్వ్ అంటారు. ఎడమ వెంట్రికల్ అయోర్టా మధ్య వుండే కవాటాన్ని అయోర్టిక్ వాల్వ్ అంటారు. కుడి ఏట్రియమ్, కుడి వెంట్రికల్ మధ్య వుండే కవాటాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. కుడి వెంట్రికల్ పల్మొనరి ఆర్టరీ మధ్య వుండే కవాటాన్ని పల్మొనరీ వాల్వ్ అంటారు.
ఇన్‌ఫెక్షన్స్‌వల్ల కవాట సమస్యలు రావడం ఏ వయస్సులోనైనా జరగవచ్చు. అదే అరుగుదలవల్ల వచ్చే సమస్యలు సాధారణంగా 50పైబడిన వయస్సువారిలో కన్పిస్తుంటాయి. కంజెనైటల్ వాల్వ్ సమస్యలు పుట్టుకతో వస్తుంటాయి.
రుమాటిక్ హార్ట్ డిసీజ్‌వల్ల వచ్చే కవాట సమస్యని కొన్ని జాగ్రత్తలవల్ల రాకుండా చూసుకోవచ్చు. చిన్నవయసులో అంటే, 5 నుంచి 10 సంవత్సరాల మధ్యవయసులో జలుబు, దగ్గు, ఫ్యారింజైటిస్ వంటి లక్షణాలతో కనిపిస్తుంది. అలాంటి లక్షణాలు కనిపించినపుడు వెంటనే యాంటీబయాటిక్స్ వాడాలి. లేకపోతే ఆ లక్షణాలు తగ్గినా వాటి ప్రభావం గుండె కవాటాలమీద పడి ఆ సమస్య అలా వయసుతోపాటు కొనసాగుతూనే వుంటుంది. కవాటాలు క్రమంగా దెబ్బతింటాయి. 20-25 సంవత్సరాలు వచ్చేసరికి శస్తచ్రికిత్స ద్వారా కవాటాలను సరిదిద్దాల్సి రావచ్చు.
పుట్టుకతో వచ్చే గుండెజబ్బులలో అయోర్టిక్ వాల్వ్ ఎక్కువగా దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో కవాటాన్ని మార్చాల్సిన పరిస్థితి రావచ్చు.
ఏవైనా గుండె ఇన్‌ఫెక్షన్స్‌లో ఎండోకార్టైటిస్, యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడకపోయినా కవాటాలు దెబ్బతినవచ్చు. ఎండోకార్టైటిస్‌లో కవాటాలు దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. హార్ట్‌ఎటాక్ వచ్చి కవాటాలు దెబ్బతిన్నా వెంటనే శస్తచ్రికిత్స అవసరం అవుతుంది. కార్డె అంటే గుండెలో కవాటాల్ని పట్టివుంచే తాడులాంటివి తెగిపోయినా వెంటనే శస్తచ్రికిత్స అవసరం అవుతుంది.
సన్నబడిపోవడంతో కవాటం దెబ్బతింటే స్టినోసిస్ అంటారు. ముందుకు వెళ్లాల్సిన రక్తం వెనక్కి రాకుండా చూడాల్సిన కవాటాలు దెబ్బతింటే ముందు మందుల ద్వారా చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితం లేకపోతే శస్తచ్రికిత్స అవసరం అవుతుంది.
కవాట మార్పిడికోసం ఇపుడు రెండు రకాల కవాటాలు అందుబాటులో వుంటాయి.
మెకానికల్ వాల్వ్.. దీంట్లో మళ్లీ రెండు రకాలు. మొదటిది- బైలిఫిలెట్ వాల్వ్. ఈ వాల్వ్‌ను సాధారణంగా విదేశాలనుంచి తెప్పిస్తారు. ఇక సింగిల్ లీఫ్‌లెట్ వాల్వ్‌ని మన దేశంలోనే తయారుచేస్తున్నారు.
టిష్యూ వాల్వ్.. ఇతర జీవులనుంచి సేకరించే కవాటం. వీటిలో కూడా రెండు రకాలు. మెకానికల్ వాల్వ్‌ను ఉపయోగిస్తే రక్తం గడ్డకట్టకుండా ఎసిటోమ్ అని మాత్రను రోజూ వాడాలి. అదే టిష్యూవాల్వ్‌లో మాత్రలని కేవలం ఆరు నెలలు వాడితే చాలు. అయితే మెకానికల్ వాల్వ్ జీవితాంతం మన్నుతుంది. టిష్యూవాల్వ్ జీవితకాలం 15 ఏళ్ళు. ఆ తరువాత మళ్లా శస్తచ్రికిత్స అవసరం అవుతుంది.
ఎసిట్రోమ్ మాత్రలు తీసుకునేవారు ఆకుకూరలు, కాబేజీ తీసుకోవాలి. ఎసిట్రోమ్ మాత్రలు వాడుతుంటే గాయం అయితే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అందుకని దాన్ని నిలిపేందుకు గాయాన్ని చాలాసేపు ఒత్తిపట్టుకోవాలి. ఈ అంశాలపై రోగికి అవగాహన కలిగించాలి. ప్రతినెల క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. జ్వరం వచ్చినా, పుండ్లు, వాపులు వంటివి వచ్చినా, పిప్పి పళ్ళు వంటి దంత సమస్యలు వచ్చినా, ఏ ఇన్‌ఫెక్షన్ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన చికిత్స చేయించాలి. ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి.
కొన్ని ముందు జాగ్రత్తలతో కొన్ని కవాట జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. పిల్లల్లో కీళ్ళనొప్పులు, జలుబు, జ్వరం వంటివి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638