చిత్తూరు

శ్రీకాళహస్తి వైభవాన్ని చాటిచెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సినీ దర్శకుడు రాఘవేంద్రరావును కోరిన మంత్రి బొజ్జల
శ్రీకాళహస్తి, మార్చి 7 : శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాల ద్వారా క్షేత్రాలకు మంచి ప్రాచుర్యం కల్పించిన విధంగానే శ్రీకాళహస్తి వైభవాన్ని కూడా చాటిచెప్పే విధంగా పౌరణిక చిత్రాన్ని రూపొందించాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావును కోరారు. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, మాటల రచయిత ఏఎ భారవి తమ బృందంతో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ప్రజాదరణ పొందాయని, వాటి ద్వారా ఆయా క్షేత్రాలకు కూడా మంచి ప్రచారం వచ్చిందని అన్నారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంపై కూడా ప్రత్యేక చిత్రాన్ని రూపొందించాలని కోరారు. ఈ ఆలోచన తమకు ఎప్పటి నుంచో ఉందని, దేవస్థానం కూడా సహకరించాలని రాఘవేంద్రరావు కోరారు. శ్రీకాళహస్తి వైభవాన్ని చాటిచెప్పడానికి తమవంతు సహకారం అందిస్తామని ట్రస్ట్‌బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు బృందం శ్రీ మంజునాథ చిత్రంలోని మహాప్రాణ దీపం పాటను వినిపించారు.

ఐసిడిఎస్ పిడికి ఉత్తమ పురస్కారం
చిత్తూరు, మార్చి 7:జిల్లా స్ర్తిశిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మికి ఉత్తమ పురస్కారం లభించింది. జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించడంతో పాటు, ఈ-పాస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలులో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పిడి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో పాటు సిబ్బంది సహకారంతోనే ఈ పురస్కారం వచ్చిందని పిడి తెలిపారు.