క్రీడాభూమి

ఒలింపిక్ వీరుడు బోల్ట్ కు మంత్రి పదవి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రాజకీయాల్లోకి రావాలంటూ జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ సాదర ఆహ్వానం పంపారు. బోల్ట్ కోరుకుంటే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమంటూ జమైకా ప్రధాని బంపర్ ఆఫర్ ప్రకటించారు. బోల్ట్ తన ప్రదర్శనతో దేశానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చాడని పేర్కొన్న ఆయన కోసం తలపులు తెరిచే ఉన్నాయంటూ పేర్కొని రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానం పంపారు. ఒలింపిక్ కెరీర్‌ను విజయవంతంగా ముగించిన పరుగుల యంత్రం ఉసేన్ బోల్ట్ త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించి రెండో ఇన్సింగ్ కొనసాగించాలని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.