అంతర్జాతీయం

బ్రస్సెల్స్ పేలుళ్లలో 26 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వే స్టేషన్‌లో వరుస బాంబు పేలుళ్లలో కనీసం 26 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ పోర్టులో రెండుసార్లు బాంబులు పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగానే ఉందని వారు తెలిపారు. ఇది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని బెల్జియం పోలీసులు అనుమానిస్తున్నారు. పారిస్‌లో విధ్వంసానికి వ్యూహరచన చేసిన కీలక నిందితుడిని నాలుగు రోజుల క్రితం బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నందుకు ప్రతీకారంగానే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఈ దాడికి తెగించారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.