ఆటాపోటీ

బాంబులు పేలినా మ్యాచ్ ఆగలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌లోని సెయింట్ డెనిస్ శివార్లలోని స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం బయట బాంబులు పేలినా, స్టేడియంలోపల ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. ప్రపంచ చాంపియన్ జర్మనీని ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో స్టేడియం వెలుపల బాంబులు పేలిన శబ్దం వినిపించినప్పటికీ, చాలా మంది దానిని బాణాసంచా శబ్దంగా భ్రమించారు. కొందరికి సమాచారం తెలిసినప్పటికీ బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో స్టేడియంలోనే ఉండిపోయారు. స్టేడియానికి అత్యంత సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ వద్ద పేలిన బాంబు ఐదుగురిని బలితీసుకుంది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. పారిస్‌లో బాంబుల కలకలం రేగినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయస్ హోలాండె కూడా స్టేడియంలోనే ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బాంబు పేలుళ్ల సంఘటన గురించి తెలుసుకున్న ప్రేక్షకులు భయంతో మైదానంలోకి పరుగులు తీశారు. చాలాసేపు అక్కడ వేచి చూడాల్సి వచ్చింది. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారిని బయటకు పంపేందుకు భద్రతా సిబ్బంది అంగీకరించారు. ఇలావుంటే, అధికారులకు పారిస్ బాంబు పేలుళ్ల వార్త తెలిసినప్పటికీ, మ్యాచ్‌ని కొనసాగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.