అంతర్జాతీయం

బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వేస్టేషన్లలో వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసం నెలకొంది. పేలుళ్ల ధాటికి పలువురు మరణించారని, చాలామంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. అన్ని మెట్రో స్టేషన్లను, ఎయిర్‌పోర్టును, సిటీ మ్యూజియంను వెంటనే మూసివేశారు. ఈ ఘటనలో భారతీయులెవరూ మరణించలేదని అక్కడి భారత రాయబార కార్యాలయం సిబ్బంది తెలిపారు. పేలుళ్ల ఘటనపై బ్రిటన్ ప్రధాని కామెరూన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బెల్జియంను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు.